బస్సు యాత్రకు వెళ్తున్న కలెక్టర్, కమిషనర్
వరంగల్ అర్బన్: స్మార్ట్‌సిటీ నిధులతో చారిత్రక ఖిలా వరంగల్ కోట పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, గ్రేటర్ కమిషనర్ వీపీ.గౌతమ్ ఆదేశించారు. రెండో రోజు గురువారం మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్మార్ట్ రోడ్లు తదితర అభివృద్ధి పనులపై వారు బస్సు యాత్ర నిర్వహించారు. కాజీపేట ఫాతిమానగర్‌లో ప్రారంభమైన ఏసీ బస్సు యాత్ర అర్బన్ కలెక్టరేట్ వరకు సాగింది. గ్రేటర్ ఇన్‌చార్జి ఎస్‌ఈ లింగమూర్తి, ఈఈలు భిక్షపతి, విద్యాసాగర్, ఇన్‌చార్జి సీపీ శ్యాంకుమార్, ‘కుడా’ ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల శాఖ అధికారులు, లీ అసోసియేట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్మార్ట్‌సిటీ –3 ఫేజ్, సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులకు ఆదేశాలు ఇచ్చారు.
కలెక్టర్, కమిషనర్ సూచనలు..
♦ ఫాతిమానగర్ కేయూ క్రాస్‌రోడ్డు నుంచి ములుగు రోడ్డు వరకు డివైడర్, సుందరీకరణ, ఎలిమెంట్స్ పనులు చేయాలని ఆదేశించారు.
♦ ఖిలా వరంగల్ కోటను పూర్తిస్థాయిలో టూరిజం స్పాట్‌గా మార్చుతున్నారు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాలు, కోట చుట్టూ రోడ్డు నుంచి ఖుష్‌మహల్ వరకు స్మార్ట్ లుక్ కోసం అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని లీ అసోసియేట్స్ ప్రతినిధులకు సూచించారు.
♦ ఖమ్మం రోడ్డులోని శివనగర్ వాటర్ ట్యాంకు నుంచి వరంగల్ రైల్వే స్టేషన్‌లోని 3 ప్లాట్‌ఫారం వరకు సెంట్రల్ డివైడర్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు.
♦ ఖమ్మం రోడ్డులోని మామూనూరు మీదుగా ఐనవోలు క్రాస్‌రోడ్డు వరకు రెండు వైపులా వెడల్పు, స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ, బీటీ రోడ్డు పనులకు ప్రతిపాదనలు.
♦ రంగశాయిపేట చౌరస్తా నుంచి ఖమ్మం బైపాస్ రోడ్డు వరకు బై సైకిల్, వాకింగ్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్‌కు మార్కింగ్, ఖమ్మం బైపాస్ రోడ్డు (ఇసుక అడ్డా)ను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment