Warangal fort
-
వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..?
ఖిలా వరంగల్: రాజులు పోయారు.. రాజ్యాలు అంతరించాయి. రాచరికపు వైభోగాలు కనుమరుగయ్యాయి. కానీ నాటి కట్టడాలు, జ్ఞాపకాలు నేటికీ చెక్కు చెదరలేదు. శతాబ్దాల చరిత్ర.. శత్రు దుర్బేధ్య నగరం.. శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది ఏకశిల కొండ. నాడు ఏకశిల నగరం, ఓరుగల్లుగా పలు పేర్లతో ప్రఖ్యాతిగాంచింది. కాలక్రమేణా దీనికి వరంగల్ (Warangal) పేరు స్థిరపడింది. వారసత్వ నగరంగా.. భారతదేశంలోని ఉత్తమ వారతస్వ నగరాల్లో ఒకటిగా ఓరుగల్లు (Orugallu) గుర్తింపు పొందింది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరం. ఓరు.. అంటే ఒకటి, గల్లు.. అనే పదానికి రాయి అని అర్థాలున్నాయి. 11వ శతాబ్ధంలో ఈ అందమైన నగరాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని 300 ఏళ్లు కాకతీయులు పాలించారు. ఈ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. రాజధానిగా చెప్పుకుంటున్న ఖిలా వరంగల్ కోట అద్భుతమైన పురాతన కట్టడాలు, అనేక స్మారక చిహ్నాలు, వాస్తు శిల్ప కళా సంపదకు నిలయం. వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే.. కాకతీయుల రాజధానిగా చెప్పుకునే ఖిలా వరంగల్ కోటలో ఏకశిల గుట్ట (ఎత్తయిన రాతి కొండ)గా ఉంది. ఏక (ఒక) శిల (రాయి) ఏకశిలా నగరం.. దీన్నే ఓరు (ఒకటి) గల్లు (రాయి) అని.. ఈ ఎత్తయిన కొండ పేరుతోనే ఓరుగల్లు నగరంగా పిలుస్తుంటారు. శతాబ్దాల కాలం నుంచి ఏకశిల, ఓరుగల్లు నగరం కనుమరుగై.. ప్రస్తుతం వరంగల్‌గా పేరొందింది. అందాల కొండ ఏకశిల గుట్టను ఎక్కి చూస్తే.. నగరంతోపాటు చుట్టు పక్క గ్రామాలు, కొండలు, గుట్టలు, కనువిందు చేస్తాయి. ఈకొండపై ఆలయం, బురుజు, సైనిక స్థావరం, విశ్రాంతి గదులు, ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. ఈ కొండపై ఉన్న ఎత్తయిన బురుజుపై ఫిరంగి, భారీ తోపులు ఏర్పాటు చేశారు. శత్రు సైన్యం రాకను పసిగట్టినప్పుడు ఫిరంగులు, తోపుల్ని పేల్చడం వల్ల.. కోట చుట్టూ ఉన్న సైన్యం అప్రమత్తమయ్యేదని చరిత్రకారులు చెబుతున్నారు. కొండపై సైనిక స్థావరం హనుమకొండ పద్మాక్షి దేవాలయం కేంద్రంగా మూడు కొండలను ఏకం చేసి కాకతీయుల తొలి రాజధానిని ఏర్పాటు చేశారు. కాకతీమాత అనుగ్రహంతో గణపతి దేవ చక్రవర్తి 1199 నుంచి 1262 మధ్యకాలంలో రాజధానిని ఓరుగల్లుకు మార్చేసి 300 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించారు. తొలుత 3వేల ఆడుగుల ఎత్తయిన ఏకశిల కొండపై సైనిక స్థావరం ఏర్పాటు చేశారు. ఇందుకు కొండపై ఎత్తయిన బురుజే సాక్ష్యం. బురుజు ఎక్కేందుకు అంతర్భాగంలోనే వేర్వేరుగా మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గం ఎక్కి చూస్తే నగరంతోపాటు చుట్టూ ఉన్న కొండలు గుట్టలు, అందమైన నగరం కనువిందు చేస్తాయి. బురుజుపై తోపులు పెట్టి పేల్చిన ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. సైనికులు గాయపడకుండా.. నిలువెత్తు పటిష్టమైన నాలుగు రాళ్లు నాలుగు వైపులా నిలబెట్టి ఉంటాయి. దీనిపైకి పర్యాటకులు ఎక్కి.. రాతి కట్టడాలు.. ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించి ఆస్వాదిస్తున్నారు. సైనికులకు విశ్రాంతి గదులు ఆనాడు కొండపై సైనికులకు విశ్రాంతి గదులు నిర్మించారు. ఫిరంగుల్లో మందు నింపేందుకు ప్రత్యేక గదులు వేర్వేరుగా ఉండేవని చెబుతారు. ఈ నిర్మాణాలన్నీ 20 ఏళ్ల క్రితం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆదరణ లేక శిథిలమై కూలిపోయాయి. ఈగుట్టపైకి రహస్య సొరంగ మార్గాలు ఉండేవని.. వాటి ద్వారా చేరుకుని సైనికులకు మార్గనిర్ధేశం చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు. చదవండి: ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు అభివృద్ధికి దూరంగా.. ఏకశిల గుట్ట నేటికీ అభివృద్ధికి దూరంగా ఉంది. గుట్టపై విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. కనీసం ఐదువేల మంది ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. గుట్టపై పర్యాటకులు చల్లని వాతావరణం, ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ.. నగర అందాలను వీక్షిస్తూ సేదదీరుతుంటారు. కానీ గుట్టపై దాహార్తి తీరేందుకు మంచినీటి సౌకర్యం లేదు. మెట్ల మార్గం ద్వారా పర్యాటకులు ఎంతో కష్టపడి ఎక్కినా.. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేక అవస్థలు పడుతుంటారు. ఒకే రాయితో ఏర్పడిన సుందరమైన చారిత్రక గుట్టను ఆధునికీకరిస్తే.. పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని, తద్వారా స్థానిక యువతకు స్వయం ఉపాధి మెరుగుపడుతుందని స్థానికులు భావిస్తున్నారు.కొండపై ఆలయంఏకశిల కొండపై అద్భుతమైన శిల్ప కళా సౌందర్యంతో కూడిన ఓ ఆలయం ఉంది. ఆలయంలో 28 స్తంభాలతో గర్భగుడి, విశాలమైన కల్యాణ మండపం ఉంది. శిల్ప కళా సౌందర్యంతో కనిపించే ఈ ఆలయ గర్భగుడి దేవతా విగ్రహాలు లేక బోసిపోయి కనిపిస్తోంది. ఆనాడు సైనికులు సైతం ఇక్కడ శివారాధన చేసిన తర్వాతే విధుల్లో చేరేవారని చారిత్రక నిపుణులు చెబుతున్నారు. -
కోటకు ‘స్మార్ట్'లుక్
వరంగల్ అర్బన్: స్మార్ట్‌సిటీ నిధులతో చారిత్రక ఖిలా వరంగల్ కోట పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, గ్రేటర్ కమిషనర్ వీపీ.గౌతమ్ ఆదేశించారు. రెండో రోజు గురువారం మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్మార్ట్ రోడ్లు తదితర అభివృద్ధి పనులపై వారు బస్సు యాత్ర నిర్వహించారు. కాజీపేట ఫాతిమానగర్‌లో ప్రారంభమైన ఏసీ బస్సు యాత్ర అర్బన్ కలెక్టరేట్ వరకు సాగింది. గ్రేటర్ ఇన్చార్జి ఎస్ఈ లింగమూర్తి, ఈఈలు భిక్షపతి, విద్యాసాగర్, ఇన్చార్జి సీపీ శ్యాంకుమార్, ‘కుడా’ ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, ఆర్అండ్బీ, జాతీయ రహదారుల శాఖ అధికారులు, లీ అసోసియేట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్మార్ట్‌సిటీ –3 ఫేజ్, సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్, కమిషనర్ సూచనలు.. ♦ ఫాతిమానగర్ కేయూ క్రాస్‌రోడ్డు నుంచి ములుగు రోడ్డు వరకు డివైడర్, సుందరీకరణ, ఎలిమెంట్స్ పనులు చేయాలని ఆదేశించారు. ♦ ఖిలా వరంగల్ కోటను పూర్తిస్థాయిలో టూరిజం స్పాట్‌గా మార్చుతున్నారు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాలు, కోట చుట్టూ రోడ్డు నుంచి ఖుష్‌మహల్ వరకు స్మార్ట్ లుక్ కోసం అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని లీ అసోసియేట్స్ ప్రతినిధులకు సూచించారు. ♦ ఖమ్మం రోడ్డులోని శివనగర్ వాటర్ ట్యాంకు నుంచి వరంగల్ రైల్వే స్టేషన్‌లోని 3 ప్లాట్ఫారం వరకు సెంట్రల్ డివైడర్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. ♦ ఖమ్మం రోడ్డులోని మామూనూరు మీదుగా ఐనవోలు క్రాస్‌రోడ్డు వరకు రెండు వైపులా వెడల్పు, స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ, బీటీ రోడ్డు పనులకు ప్రతిపాదనలు. ♦ రంగశాయిపేట చౌరస్తా నుంచి ఖమ్మం బైపాస్ రోడ్డు వరకు బై సైకిల్, వాకింగ్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్‌కు మార్కింగ్, ఖమ్మం బైపాస్ రోడ్డు (ఇసుక అడ్డా)ను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. -
నేడే జెండా పండుగ
పరేడ్ గ్రౌండ్లో పతాకావిష్కరణ హన్మకొండ అర్బన్ : రాష్ట్ర అవతరణ అనంతరం స్వాతంత్య్ర దినోత్సవాన్ని వరంగల్ కోటలో నిర్వహించిన జిల్లా యంత్రాంగం ఈసారి వేదకను పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు మార్చింది. శనివారం ఉదయం పది గంటలకు ఉప ముఖ్యమంత్రి శ్రీహరి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. 9.10 గంటలకు ప్రసంగిస్తారు.. 9.25 స్వాతంత్య్ర సమర యోధులకు సన్మానం.. 10.45 గంటలకు ఉత్తమ అవార్డుల పంపిణీ.. మధ్యాహ్నం 12 గంటలకు పబ్లిక్ గార్డెన్లో ఛాయాచిత్ర ప్రదర్శన.. 6.00 గంటలకు పబ్లిక్ గార్డెన్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటారుు. హన్మకొండ అర్బన్: పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటుచేయూలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. పత్కావిష్కరణ అనంతరం సా యంతం నేరెళ్ల వేళ్ల నేణుమాధవ్ ఆడిటోరియంలో సాంృస్కతిక క్యాక్రమాలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో ఈ నెల 17,18వ తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్న క్రమంలో జిల్లా అధికారులు తగు సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించా రు. ముఖ్యమంత్రి గీసుకొండ మండలం గంగాదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, అనంతరం నల్లబెల్లి మండలం రాంపూర్, మేడేపల్లిలో ముఖ్యమంత్రి పర్యటించే అ వకాశం ఉందని కలెక్టర్ అన్నారు. 18న ముఖ్యమం త్రి నగరంలో పర్యటించే అవకాశం ఉందని అ న్నా రు. సమావేశంలో ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, డీపీ వో ఈఎస్నాయక్, శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం సభాస్థలి పరిశీలన వరంగల్: సీఎం పాల్గొనే బహిరంగ సభ జరిగే దేశారుుపేటలోని సీకేఎం కాలేజీ మైదానాన్ని కలెక్టర్ వాకాటి కరుణ, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, కార్పొరేషన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, తహశీల్దార్లు శుక్రవారం పరిశీలించారు. సీఎం 18న ఉదయం ఎనుమాముల మార్కెట్ సందర్శన, దేశాయిపేటలో దివంగత ఆచార్య జయశంకర్ విగ్రహ అవిష్కరణ, ఇదే డివిజన్లో నిర్మించనున్న షాదీఖానా నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున ప్రజలను తరలించాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కావటి రాజుయాదవ్, జన్ను జఖర్య, రమేష్‌బాబు, యాకేందర్, దయాకర్, రామకృష్ణ, శ్రీను, విజయారావు, ప్రవీణ్, నగేష్, సునీల్ ఉన్నారు. -
కోట అందాలు భేష్..!
ఓరుగల్లు కోటలో పర్యటించిన గవర్నర్ న రసింహన్ రాతికోట, ఖుషీమహల్, ఏకశిల గుట్ట సందర్శన కాకతీయ శిల్ప సంపదకు తన్మయులైన గవర్నర్ దంపతులు ఖిలా వరంగల్/హన్మకొండ కల్చరల్: చరిత్రాత్మక ఓరుగల్లు కోటలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా పర్యటించారు. గవర్నర్ దంపతులను వరంగల్ తహసీల్దార్ రవి, పర్యాటకశాఖ జిల్లా అధికారి శివాజీ, సాదరంగా అహ్వనించారు. తొలుత రాతి చుట్టు పర్యటిం చిన గవర్నర్ కోట తాలుకు వివరాలను తెలుసుకున్నారు. ఆపై నేరుగా ఖుషిమహాల్ని సందర్శించి ఆక్కడి శిల్ప సంపదను, కాకతీయుల నిర్మాణ కౌశల్యాన్ని తిలకించారు. ఆతర్వత కాకతీయుల కీర్తితోరణాలు నడమ ఉన్న శిల్పాల సం పద ప్రాంగణాన్ని సందర్శించారు. ఆక్కడ ఉన్న శిల్పాలను, నళ్లరాతితో కాకతీయ శిల్పలు చెక్కిన ఆరుదైన కళా సంపదను చూసి ముగ్దులయ్యారు. తర్వాత గుండు చెరువును సందర్శించి పక్కనే ఉన్న ఏకశిల గుట్టఎక్కి వరంగల్ కోట అందాలతోపాటు నగరాన్ని వీక్షించారు. ఆలయంలో పూజలు.. హన్మకొండలోని రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయాన్ని గవర్నర్ దంపతులు సందర్శించారు. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ తాళ్లూరి రమేశ్‌బాబు, అసిస్టెంట్ కమిషనర్ సాయిబాబా, అర్చకులు, పండితులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మూలమహాగణపతికి, రుద్రేశ్వరునికి పూజలు చేశారు. అనంతరం గంగు ఉపేంద్రశర్మ వారికి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి పట్టుధోవతి, పట్టుచీర అందజేశారు. బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్శర్మ గవర్నర్ దంపతులను సత్కరించారు. తరువాత గంగు ఉపేంద్రశర్మ వారికి దేవాలయాల స్తంభాల్లో దారం దూరేంత సన్నని రంధ్రాలను శి ల్పులు చెక్కిన విషయాన్ని చూపించారు. కాగా గవర్నర్ దంపతులు ఆలయంలోని నందీశ్వరున్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ సలహాదారు పాపారావు(రిటైర్డ్ ఐఏఎస్) గవర్నర్‌కు వాటి విశేషాలను వివరించారు. గవర్నర్ వెంట కలెక్టర్ వాకాటి కరుణ, జిల్లా ఎస్పీ అంబర్కిశోర్ఝూ, జి ల్లా టూరిజంశాఖ అధికారి శివాజి, జిల్లా పౌర సంబంధాల శాఖ డీడీ బాలగంగాధరతిలక్, జేసీ ప్రశాంత్‌పాటిల్, నగర కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. -
కాకతీయుల కోటలో మువ్వన్నెల జెండా
ఖిలా వరంగల్‌లో పంద్రాగస్టు వేడుకలు సర్కారు గోల్కొండ స్ఫూరితో నిర్ణయం సాక్షి ప్రతినిధి, వరంగల్: వ్యవసాయానికి, భక్తికి ప్రాధాన్యత ఇచ్చి సుదీర్ఘపాలన సాగించిన కాకతీయుల రాజధాని కేంద్రం ఖిలావరంగల్‌లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ర్టంలో తొలిసారిగా జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయి లో గోల్కొండ కోట ఆవరణలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే స్ఫూర్తి తో గత వైభవాన్ని గుర్తు చేసేలా వరంగల్లోనూ కాకతీయ కోటలో ఆగస్టు 15 వేడుకలకు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కోట ప్రాంతం ఆవరణలోని ఖుష్‌మహల్ పక్క న ఖాళీ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు ఖిలావరంగల్ ప్రాంతం స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబవుతోంది. కాకతీయుల్లో ముఖ్యురాలైన రాణిరుద్రమదేవి హయాం(1261)లో ఈ కోట నిర్మాణం పూర్తి అయ్యింది. కాకతీయుల శకం ముగిసిన తర్వాత నిజాం నవాబుల పరిపాలనలో షితాబ్‌ఖాన్ సైన్యాధికారిగా ఉన్నప్పుడు ఖిలావరంగల్‌లో ఖుష్‌మహల్ ను నిర్మించారు. కీర్తి తోరణాలు, ఖుష్‌మహల్ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి.