పరేడ్ గ్రౌండ్‌లో పతాకావిష్కరణ
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర అవతరణ అనంతరం స్వాతంత్య్ర దినోత్సవాన్ని వరంగల్ కోటలో నిర్వహించిన జిల్లా యంత్రాంగం ఈసారి వేదకను పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు మార్చింది. శనివారం ఉదయం పది గంటలకు ఉప ముఖ్యమంత్రి శ్రీహరి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. 9.10 గంటలకు ప్రసంగిస్తారు.. 9.25 స్వాతంత్య్ర సమర యోధులకు సన్మానం.. 10.45 గంటలకు ఉత్తమ అవార్డుల పంపిణీ.. మధ్యాహ్నం 12 గంటలకు పబ్లిక్ గార్డెన్‌లో ఛాయాచిత్ర ప్రదర్శన.. 6.00 గంటలకు పబ్లిక్ గార్డెన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటారుు.
హన్మకొండ అర్బన్: పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటుచేయూలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. పత్కావిష్కరణ అనంతరం సా యంతం నేరెళ్ల వేళ్ల నేణుమాధవ్ ఆడిటోరియంలో సాంృస్కతిక క్యాక్రమాలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో ఈ నెల 17,18వ తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్న క్రమంలో జిల్లా అధికారులు తగు సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించా రు. ముఖ్యమంత్రి గీసుకొండ మండలం గంగాదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, అనంతరం నల్లబెల్లి మండలం రాంపూర్, మేడేపల్లిలో ముఖ్యమంత్రి పర్యటించే అ వకాశం ఉందని కలెక్టర్ అన్నారు. 18న ముఖ్యమం త్రి నగరంలో పర్యటించే అవకాశం ఉందని అ న్నా రు. సమావేశంలో ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, డీపీ వో ఈఎస్‌నాయక్, శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం సభాస్థలి పరిశీలన
వరంగల్: సీఎం పాల్గొనే బహిరంగ సభ జరిగే దేశారుుపేటలోని సీకేఎం కాలేజీ మైదానాన్ని కలెక్టర్ వాకాటి కరుణ, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, కార్పొరేషన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, తహశీల్దార్‌లు శుక్రవారం పరిశీలించారు. సీఎం 18న ఉదయం ఎనుమాముల మార్కెట్ సందర్శన, దేశాయిపేటలో దివంగత ఆచార్య జయశంకర్ విగ్రహ అవిష్కరణ, ఇదే డివిజన్‌లో నిర్మించనున్న షాదీఖానా నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున ప్రజలను తరలించాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కావటి రాజుయాదవ్, జన్ను జఖర్య, రమేష్‌బాబు, యాకేందర్, దయాకర్, రామకృష్ణ, శ్రీను, విజయారావు, ప్రవీణ్, నగేష్, సునీల్ ఉన్నారు.
నేడే జెండా పండుగ
Published Sat, Aug 15 2015 1:51 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement