
విజయవాడ : దళితులపై దాడులు చేస్తూ టీడీపీ దళిత తేజం కార్యక్రమం చేయడం సిగ్గుచేటని ఏపీసీసీ ప్రధానకార్యదర్శి మీసాల రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దళితులపై దాడులు చేస్తూ ఏ మొహం పెట్టుకుని టీడీపీ నేతలు దళితుల దగ్గరకు వెళ్లారని ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో దళితులపై విపరీతంగా దాడులు పెరిగాయన్నారు. గరపగర్రు, దేవరపల్లి, జెర్రిపోతులపాలెం, పెడగట్టుపాడుల్లో దళితులపై జరిగిన దాడులకు సీఎం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక బ్యాక్ లాగ్ పోస్టు కూడా భర్తీ చేయలేదని వెల్లడించారు. చంద్రబాబు ఎస్సీ సబ్ ప్లాన్‌ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.