సాక్షి, కామారెడ్డి : నా ముందే కుర్చీలో కూర్చుంటావా? అని ఓ సర్పంచ్ దళితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దళితుడు తన కుర్చీలో కూర్చోడం సహించలేని అతడు తిట్లదండకం మొదలెట్టాడు. ఈ ఘటన లింగంపేట్ మండలం జల్దిపల్లిలో చోటు చేసుకుంది. అయితే విషయం తెలుసుకున్న కొంతమంది దళితులు సర్పంచ్‌ను నిలదీయగా.. మరింత కోపంతో రగిలిపోయాడు. ఆ 15 దళిత కుటుంబాలను సామాజిక బహిష్కరణకు గురిచేశాడు. దళిత కాలనీకి బోరు, మోటార్ విద్యుత్ కనెక్షన్ తొలగించాడు. కిరాణా సరుకులు ఇవ్వొద్దని, మురికి కాలువల నుంచి తీసిన చెత్త తొలగించవద్దని సిబ్బందిని ఆదేశించాడు.
Comments
Please login to add a commentAdd a comment