
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. పార్లమెంట్‌లో తనతో కనీసం 15 నిమిషాలు అయినా చర్చకు ప్రధాని సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఢిల్లీలోని తల్కాటొర స్టేడియంలో ‘రాజ్యాంగాన్ని పరిరక్షించండి’ అంటూ చేపట్టిన ప్రచార సభలో సోమవారం రాహుల్ ప్రసంగిస్తూ...మోదీ పాలనపై మండిపడ్డారు. దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, అధికార నేతలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
మోదీ ఇచ్చిన ‘బేటి బచావో బేటీ పడావో’ నినాదాన్ని ఇప్పుడు దేశ ప్రజలు ‘బేటీ బచావో, బీజేపీ లోగోమ్‌సే పడావో’( చిన్నారులను రక్షించడి, బీజేపీ నేతల నుంచి కాపాడండి) అంటున్నారని ఎద్దేవా చేశారు. మహిళా భద్రతను గాలికొదిలేశారని, దళితుల పరిరక్షణ, పేద ప్రజల సంక్షేమాన్ని మోదీ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మోదీకి దేశ అభివృద్ధిపై ఆలోచన లేదని, ఆయనకు ఎప్పుడు ప్రధాని కూర్చిని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తారని విమిర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలనన్నింటినీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలతో నింపేశారని, ఈ వ్యవస్థల్లో సంప్రదింపులు, చర్చలు ఉండవని రాహుల్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని బల పరచేందుకు గత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలన్నింటికీ బీజేపీ ఉద్దేశపూర్వకంగా గండికొడుతోందని రాహుల్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment