
అహ్మదాబాద్ : గుజరాత్‌లో మరో దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తన పేరు చివరన సింహ్ అని చేర్చుకున్నాడని దళితుడిని చితక బాదారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర గుజరాత్‌లోని బనక్సంత జిల్లాకు చెందిన మౌలిక్ జాదవ్(22) తనపేరులో సింహ్ చేర్చుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. కానీ గుజరాత్, రాజస్థాన్‌లో సింహ్ అనేది అగ్రవర్ణాల వారి పేరులో ఉంటుంది. అది తమ గౌరవం, ప్రత్యేక హక్కుగా భావిస్తారు.
ఒక దళితుడు సింహ్ అని పెట్టుకోవడంతో భరించలేని రాజ్‌పుత్ యువకుడు మౌలిక్‌పై దాడి చేసి గాయపరిచాడు. అయితే ఈ ఘటనపై సదరు యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సహదేవ్‌సింహ్ వగేలా అనే రాజ్‌పుత్ యువకుడు, అతని ఐదుగురు స్నేహితులు కలిసి తనపై దాడిచేసి గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు స్పందిస్తూ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే దీనికి కౌంటర్‌గా రాజ్‌పుత్‌లు కూడా మౌలిక్‌పై ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment