
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హింస వాతావరణం నెలకొంది. దళితులు, మరాఠాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఈ గొడవలో ఒకరు మృతిచెందగా, పలువరికి గాయాలయ్యాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు ముంబై, పుణె, ఔరంగాబాద్‌లో జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. వారి ఆగ్రహజ్వాలలకు పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇరువర్గాల మధ్య గొడవల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ప్రజలు ఆందోళనలు మిరమించి, శాంతియుతంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విజ్ఞప్తి చేశారు. ఈ హింసాత్మక ఘటన వెనుక ఉన్నదేవరో తేల్చేందుకు ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. దళిత సంఘాలు రేపు మహారాష్ట్రలో బందుకు పిలుపునిచ్చాయి.