
సాక్షి, మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ) చైర్మన్ వర్ల రామయ్య బస్సులో ప్రయాణిస్తున్న దళిత యువకుడి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గురువారం మచిలీపట్నం బస్టాండ్‌లో అధికారులతో కలసి ఆయన బస్సుల తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సులో ఓ యువకుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటాన్ని రామయ్య గమనించారు.
అతని దగ్గరకు వెళ్లి చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవా? అంటూ ప్రశ్నించారు. ‘మీ కులం ఏంటో చెప్పు?. మాల లేదా మాదిగా?. మాదిగలు అసలు చదవరు. ఈ వెధవ పరీక్ష కూడా రాసి ఉండడు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు?. పొలం ఉందా?. బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది?. డబ్బులు లేకపోతే ఎలా చదువుకుంటావ్?. ఫోన్లు గీన్లు మానేసి చదువుకో.’అంటూ అసభ్యంగా మాట్లాడారు.
రామయ్య వ్యాఖ్యలతో ఆర్టీసీ అధికారులు, బస్సులోని ఇతర ప్రయాణీకులు విస్తుపోయారు. గత వారంలో ప్రయాణీకులతో డ్రైవర్లు, కండెక్టర్లు మర్యాదగా ప్రవర్తించాలని, మర్యాద వారోత్సవాలు నిర్వహించారు. ఇంతలో సాక్ష్యాత్తు ఆర్టీసీ చైర్మన్ దళిత యువకుడిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment