హైదరాబాద్: మాదిగలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో వాటా దక్కాల్సిందే అని, దీనికోసం మాదిగలందరూ ఐక్యంగా పోరాడాలని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్యెల్యే టి.రాజయ్య అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో మాదిగల అలయ్–బలయ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాజయ్య ముఖ్య వక్తగా హాజరయ్యారు. రాజయ్య మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పోరాటం చేసిన చరిత్ర మాదిగలదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నా రు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు చోటు లభించకపోవడంతో ఆ వర్గంలో చలనం వచ్చిందని వెల్లడించారు.కార్యక్రమంలో అసెంబ్లీ విప్ గువ్వల బాలరాజు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment