t rajaiah
-
లైన్ ఎవరు దాటినా ఊకునేది లేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలో సీనియర్ నేతల నడుమ జరుగుతున్న మాటల యుద్ధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. మంగళవారం మధ్యాహ్నాం ప్రగతి భవన్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కేటీఆర్ సమావేశమై ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించారు. గత కొంతకాలంగా రాజయ్య వర్సెస్ కడియం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయపరంగానే కాదు.. వ్యక్తిగత విమర్శలకు సైతం ఇద్దరూ వెనుకాడడం లేదు. ఈ తరుణంలో పార్టీ పరువును బజారుకీడ్చడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఇవాళ్టి భేటీలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో.. రాజయ్యను మందలించిన ఆయన.. ఇంకోసారి అలాంటి పని చేయొద్దని వారించినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడకూదని, ఎవరూ ఆ పని చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ‘‘ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. ఇంతటితో ఈ వివాదం ముగించాలని, ఎన్నికల సమయం దగ్గరపడుతోంది కాబట్టి ఇద్దరూ కలిసి పని చేసుకోవాలని.. లేకుంటే తీవ పరిణామాలు ఉంటాయ’’ని కేటీఆర్ రాజయ్యను హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు ఆయన కడియంతోనూ భేటీ కావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడియం-రాజయ్య వైరం ఈనాటిది కాదు! మాజీ ఉపముఖ్యమంత్రులైన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు.. మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులు. దీంతో స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆధిపత్య పోరు సహజంగానే కొనసాగుతూ వస్తోంది. 2019 సెప్టెంబర్‌లో వేర్వేరుగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన యాత్ర రెండు వర్గాల మధ్య విభేదాలకు ఆజ్యం పోయగా.. ఆ తర్వాత పరిణామాలు కూడా మరింత దూరం పెంచాయి. ఎవరికీ వారుగా నియోజకవర్గంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఫ్లెక్సీలు, ప్రొటోకాల్ వివాదం.. అంటూ ఇరువర్గాల మధ్యన తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 20 రోజుల వరకు కూడా పరోక్షంగా ఆరోపణలు చేసుకున్న ఇద్దరు నేతలు.. ఈ మధ్య కాస్త దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్వరం మరింత పెంచుకోవడంతో.. అధిష్టానం ఈ విమర్శలను తీవ్రంగా పరిగణించింది. ఇదీ చదవండి: నేను నోరు విప్పితే రాజయ్య కుటుంబం సూసైడ్ చేస్కోవాలి-కడియం -
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి, వరంగల్: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, ఆదివారం.. సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే రాజయ్య.. మీడియా సమక్షంలో ఆమెకు క్షమాపణ చెప్పారు. సర్పంచ్ భర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చిన రాజయ్య.. నవ్య దంపతులతో కలిసి ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. వేధిస్తే భరితం పడతాం: సర్పంచ్ నవ్య సర్పంచ్ నవ్య మాట్లాడుతూ, మహిళలకు అన్యాయం జరుగుతోందని, తాను మాట్లాడిన ప్రతి మాట నిజం అంటూ మండిపడ్డారు. అన్యాయాలు, అరాచకాలు సహించవద్దని ఆమె అన్నారు. చిన్న పిల్లలను కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, మహిళలను ఎవరైనా వేధిస్తే భరితం పడతామని సర్పంచ్ హెచ్చరించారు. ‘‘ఎమ్మెల్యే రాజయ్యను గౌరవిస్తా. ఆయన వల్లే నేను సర్పంచ్ అయ్యా. నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా. పార్టీని ఒక కుటుంబంలా భావిసా. జరిగిన విషయాన్ని మరిచిపోయి ఇక ముందు అలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నా. తప్పు చేసినట్టు ఒప్పుకుంటే క్షమిస్తా’’ అని సర్పంచ్ నవ్య అన్నారు. క్షమించమని కోరుతున్నా.. ఎమ్మెల్యే రాజయ్య జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ‘‘నాకు నలుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ప్రవీణ్‌పై అభిమానంతో ఆయన భార్యకు సర్పంచ్ టికెట్ ఇచ్చా.. నేను తెలిసి తెలియక చేసిన పనులు వల్ల మానసిక క్షోభకు గురైతే క్షమించమని కోరుతున్నా. జానకిపురం అభివృద్ధికి పాటుపడుతా. అధిష్టానం ఆదేశం మేరకు రూ.25 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నా’’ అని రాజయ్య పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా కమిషన్ యాక్షన్‌కు సిద్ధమైంది. ఆయనపై జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. అసలేం జరిగింది.. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చదవండి: బీఆర్ఎస్లో ‘చిలిపి’ రాజకీయం! ‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఊహించని షాక్ తగిలింది. రాజయ్యపై మహిళా కమిషన్ యాక్షన్‌కు సిద్ధమైంది. ఆయనపై జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. @SCWTelangana has taken cognizance of the matter. Chairperson @sunitavakiti has already written to @TelanganaDGP to personally intervene in the matter. @TelanganaToday @ntdailyonline https://t.co/7k0ygdkxJR — Telangana State Commission for Women (@SCWTelangana) March 11, 2023 జరిగింది ఇది.. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు. -
నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్..
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: ‘నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుపీరియర్, బాస్. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైనా సరే ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో పర్యటించొద్దు..’అని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్ ఎవరైనా సరే ఎమ్మెల్యే ఆహ్వానం మేరకే నియోజకవర్గంలోకి రావాలన్నారు. అలాకాకుండా వస్తే గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించినట్లవుతుందని, ఎవరైనా పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఏ ప్రపోజలయినా అధికారులు ఎమ్మెల్యే ద్వారానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారన్నారు. 119 నియోజకవర్గాల్లో ఏవిధంగా జరుగుతుందో ఘన్‌పూర్‌లో కూడా అలాగే జరుగుతుందని.. జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించేవారు ఎంతటివారైనా సహించేది లేదని తెలిపారు. చదవండి: ‘కొండపోచమ్మ’కు డెడ్‌లైన్ మే 15.. -
మాదిగలకు వాటా దక్కాల్సిందే
హైదరాబాద్: మాదిగలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో వాటా దక్కాల్సిందే అని, దీనికోసం మాదిగలందరూ ఐక్యంగా పోరాడాలని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్యెల్యే టి.రాజయ్య అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో మాదిగల అలయ్–బలయ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాజయ్య ముఖ్య వక్తగా హాజరయ్యారు. రాజయ్య మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పోరాటం చేసిన చరిత్ర మాదిగలదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నా రు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు చోటు లభించకపోవడంతో ఆ వర్గంలో చలనం వచ్చిందని వెల్లడించారు.కార్యక్రమంలో అసెంబ్లీ విప్ గువ్వల బాలరాజు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ రాజన్నగా తీర్చిదిద్దారు : ఎమ్మెల్యే రాజయ్య
సాక్షి, వరంగల్ : కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని వందశాతం బలపరుస్తున్నానని స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.రాజయ్య స్పష్టం చేశారు. తనను కేసీఆర్ టి.రాజయ్య నుంచి తెలంగాణ రాజయ్యగా తీర్చిదిద్దారని చెప్పారు. కేసీఆర్ అందరికీ న్యాయం చేస్తారని.. మాదిగలకు త్వరలోనే మరిన్ని ఉన్నత పదవులు వస్తాయని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాదిగలకు మందకృష్ణ ఒక్కడే ప్రతినిధి కాదని తెలిపారు. తాను అంతకన్నా పెద్దవాడినని పేర్కొన్నారు. -
ఫోన్లో ఓ మహిళతో రాజయ్య సరసం
ఆమె : హలో సార్ నేను.. అతను: నాకు తెలుసురా.. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటవో నాకు తెలుసురా. నువ్వు ఎంత కొంటె పురుగువంటే..! బాగా కొంటె పనులు చేస్తవు.. కొంటెతనం అంటే..! చిలిపి చేష్టలు అన్నట్టు.. చిలిపి..చిలిపి పనులు అన్నట్టు.. ..అంటూ సంభాషణ సాగుతుంటే మహిళ పగలబడి నవ్వుతుండడంతో మొదలైన మాటలు.. ‘నువ్వే నా మొగుడివి’ అనే మాటలతో ముగుస్తుంది. మధ్యలో రాయలేని పదజాలంతో సంభాషణ ఉంటుంది. మొత్తం 5.43 నిమిషాల నిడివితో ఉన్న ఆడియో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంభాషణలో వినిపిస్తున్న మహిళ గొంతు టీఆర్ఎస్ పార్టీలో పదవి ఆశిస్తున్న ఆమెది కాగా.. పురుష గొంతు మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యదే అని నెటిజన్లు కరాఖండీగా చెబుతున్నారు. పార్టీలో పదవి కోసం ఓ మహిళ.. నేతల చుట్టూ తిరిగే క్రమంలో వారి మధ్య సన్నిహిత సంబం ధానికి దారితీసినట్లు.. ఇది 5 నుంచి 8 నెలల క్రితం రికార్డు చేసిన సంభాషణగా తెలుస్తోంది. తొలి నుంచి అసమ్మతే.. రాజయ్యకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించిన నాటి నుంచీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తొలుత రాజారపు ప్రతాప్‌తో మొదలైన అసమ్మతి.. ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అనుచరుల చేతిలోకి వెళ్లిపోయింది. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌తో కొంత కాలంగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజయ్యను రాజకీయంగా అణగదొక్కాలనే పక్కా పథకం ప్రకారమే ఆడియో క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలోకి వదిలారని రాజయ్య వర్గం అంటోంది. నియోజకవర్గంలో వెల్లువెత్తుతున్న నిరసనలపై ఉప ముఖ్యమంతి కడియం శ్రీహరిని కలిసేందుకు మంగళవారం ఉదయం రాజయ్య తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో క్లిప్పింగ్‌ను చూసి మార్గమధ్యలోనే ఆయన వెనుదిరిగినట్లు సమాచారం. దయాకర్, వెంకటేశ్వర్లు ఎవరు ? మాటల మధ్యలో ‘ఏవ్వా.. ఏవ్వా.. నాకు పోస్టు ఎప్పుడిస్తవ్ ఏవ్వా.. ఎప్పుడు చేతుల పెడుతవ్.. ఏవ్వా ’ అని మహిళ నవ్వుతూ అడుతుండగా.. రాజయ్య గొంతును పోలిన స్వరం నుంచి ‘నీకు పోస్టు దయాకర్ ఇస్తడు.. వెంకటేశ్వర్లేమో రికమండ్ చేస్తడు.. దయాకరేమో ఇస్తడు ’ అనే మాటలు వినిస్తున్నాయి. సదరు మహిళకు వారితో కూడా వివాహేతర సంబంధం అంటగడుతూ నీకు ముగ్గురు హీరోలు అని మాట్లాడుతుండగా.. మహిళ కల్పించుకుని ‘నువ్వే నా హీరో’ అంటూ.. దయాకర్‌కు మరో మహిళతో సంబంధం ఉందని దయాకరే తనకు చెప్పినట్లు మహిళ చెప్పింది. ఈ నేపథ్యంలో దయాకర్, వెంకటేశ్వర్లు ఎవరు ? అనే చర్చ జోరుగా సాగుతోంది. వాళ్లు కూడా రాజకీయ నాయకులేనా? లేక వ్యాపారవేత్తలా? పోస్టింగ్ పేరుతో మహిళలను ఎంత కాలం నుంచి తిప్పుకుంటున్నారు? అనే అంశాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. కాగా, రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఒక ఫేక్ ఆడియోను సృష్టించారని రాజయ్య వివరణ ఇచ్చారు. తన గొంతును మిమిక్రీ చేశారని చెప్పారు. ఇలాంటి యత్నాలను చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు. -
కడియం వర్సెస్ రాజయ్య
పార్టీలో ఆధిపత్యపోరు కొనసాగిస్తున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఒకరినొకరు కౌగిలించుకుని నవ్వులు చిందించారు. ఆ మరుసటి రోజే స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన పార్టీ నియోజకవర్గ సమావేశంలో వారి అనుచరులు ఘర్షణ పడ్డారు. సమావేశంలో రాజయ్య కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరు న్నికల వేళ అధికార పార్టీకి ఇబ్బందులు వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్కు.. ఆ పార్టీ కీలక నేతలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య ఆధిపత్యపోరు ఇబ్బందికరంగా మారుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న వర్గపోరు ప్రస్తుత ఉప ఎన్నిక తరుణంలో మరింత పెరుగుతోంది. ఉప ఎన్నిక ప్రచారానికి టీఆర్ఎస్ శ్రేణులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ సెగ్మెంట్లో ప్రతిపక్ష పార్టీలతో కంటే సొంత పార్టీలోని వర్గాలతోనే పోటీ పడాల్సిన పరిస్థితి ఉందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక రావడానికి కారణమైన ఇద్దరి మధ్య వర్గపోరు పార్టీకి నష్టం చేసేలా ఉందని అంటున్నారు. పదవుల్లో ఉన్న ఇద్దరు కీలక నేతలు ఇప్పటికైనా వర్గపోరుకు తెరవేయకుంటే ఉప ఎన్నికలో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అంటున్నారు. మొదటి నుంచీ ఆధిపత్యపోరు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మధ్య మొదటి నుంచీ ఆధిపత్యపోరు ఉంది. వీరిద్దరు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందినవారే. వేర్వేరు పార్టీల్లో ఉన్న ఈ ఇద్దరు నేతలు టీఆర్ఎస్లోకి వచ్చారు. అయినా పంచారుుతీ మాత్రం ఆగకుండా కొనసాగుతూనే ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి, కాంగ్రెస్ తరుపున తాటికొండ రాజయ్య 1999, 2008, 2009, 2012 ఎన్నికల్లో తలపడ్డారు. చెరి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ టీఆర్ఎస్లో చేరారు. సాధారణ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇద్దరు నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. తమ నేత ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే డిమాండ్లతో రెండు వర్గాల మధ్య కొట్లాటలు కూడా జరిగాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల సమయంలోనూ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. గత సాధారణ ఎన్నికల్లో కడియం శ్రీహరి వరంగల్ ఎంపీగా, తాటికొండ రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. దీంతో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్గానికి చెక్ పెట్టేందుకు రాజయ్య వ్యూహం రచించారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ కమిటీలు, ఎంపీపీ ఎన్నికలు... అన్ని విషయాల్లోనూ తమ వర్గమే ఉండేలా చేశారు. కడియం శ్రీహరి వర్గీయులు సైతం దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. మారిన రాజకీయ పరిస్థితులలో టి.రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ పరిణామంలో కడియం వర్గీయులు ఆధిపత్యం కోసం.. దీన్ని నిలువరించేందుకు రాజయ్య వర్గీయులు ప్రయత్నిస్తునే ఉన్నారు. -
'కడిగిన ముత్యంలా బయటపడతా'
ఆందోళన వద్దని అభిమానులకు రాజయ్య విజ్ఞప్తి హైదరాబాద్: ఉద్యమంలో మంచి భూమిక పోషించానని, ఆరోపణల నేపథ్యంలో ఇక సామాన్య కార్యకర్తగా ముందుకు సాగుతానని తాజా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన రాజయ్య గుండెపోటుతో మంగళవారం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మలిదఫా వైద్య పరీక్షల నిమిత్తం హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి బుధవారం వచ్చిన రాజయ్య వైద్యపరీక్షల అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నాడు తెలంగాణ కోసం అధికార కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చా, నేడు బంగారు తెలంగాణ కోసం ద్వితీయ స్థానాన్ని త్యజించా, తండ్రిలాంటి సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నాను.’ అని అన్నారు. ఆరోపణలపై పారదర్శకంగా విచారణ జరగాలన్నారు. విచారణ తర్వాత కడిగిన ముత్యంలా బయటపడతానన్నారు. కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కోరారు. రాజయ్యను పరామర్శించేందుకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ అవినీతికి తావులేని పాలన కొనసాగుతుందని సీఎం చెపుతూనే ఉన్నారని, ఈ నేపథ్యంలో రాజయ్యపై ఆరోపణలు వచ్చినందున విచారణ కోసం తప్పించి ఉంటారని అభిప్రాయపడ్డారు. రాజయ్య తొలగింపు కక్షపూరితం కాదని, బర్తరఫ్ చేశారంటూ దళితులను తప్పుదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. -
ఆత్మరక్షణలో డిప్యూటీ సీఎం రాజయ్య
* వైద్యారోగ్య శాఖలో అవినీతి ఆరోపణలపై రాజయ్య ఆందోళన * సీఎంకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం * ఆరేడు నిమిషాలకు మించి సమయమివ్వని కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం రాజయ్య ఆత్మరక్షణలో పడిపోయారు. దీనిపై సీఎం కె. చంద్రశేఖర్‌రావుకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. స్వైన్‌ఫ్లూపై కేసీఆర్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన నేపథ్యంలో గురువారం మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారని, వైద్య శాఖలో చోటుచేసుకున్న వ్యవహారాలపై ఆగ్రహంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరగడంతో ఉదయమే రాజయ్య సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తన శాఖపై వచ్చిన ఆరోపణలతో తనకు సంబంధంలేదని వివరించి, ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు కేసీఆర్ ఆరేడు నిమిషాలకు మించి సమయం ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆందోళనగా సచివాలయానికి చేరుకున్న రాజయ్య అక్కడ మంత్రి కేటీఆర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. గంటన్నరపాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. స్వైన్‌ఫ్లూ పరిస్థితితోపాటు వైద్య శాఖలో చోటుచేసుకున్న అవినీతిపై ఇంటెలిజెన్స్ నివేదిక తదితర అంశాలపై కేటీఆర్‌కు రాజయ్య వివరించినట్లు తెలిసింది. ఈ భేటీ తర్వాత మరో మంత్రి హరీశ్‌రావును సచివాలయంలోనే కలిసేందుకు రాజయ్య ప్రయత్నించారు. కానీ అప్పటికే బయటకు వెళ్లిపోవడానికి హరీశ్‌రావు సిద్ధంకావడంతో కలవలేకపోయారు. అయితే నేరుగా హరీశ్‌రావు ఇంటికే వెళ్లి ఆయన్ను కలిసినట్లు సమాచారం. హరీశ్‌రావు, కేటీఆర్ ద్వారా సీఎంకు వాస్తవాలను వివరించి గండం నుంచి గట్టెక్కేందుకు రాజయ్య ప్రయత్నించారు. కాగా, వైద్య, ఆరోగ్య శాఖలో గురువారం ఇద్దరు అధికారులపై వేటు పడడం, ప్రధానంగా ఆరోగ్య శాఖ డెరైక్టర్‌ను పక్కనబెట్టి, ఆ బాధ్యతలను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు అప్పగించడం చర్చనీయాంశమైంది. కాగా, 108 నిర్వహణ సంస్థను ఈ శాఖకు చెందిన కొందరు నెలవారీ పర్సెంటేజీ అడిగినట్లు, అయితే ప్రభుత్వం అందించే నిర్వహణ ఖర్చులే సరిపోవడం లేదంటూ వారు చేతులెత్తేసినట్లు బయటకుపొక్కింది. -
అభద్రతను తొలగించేందుకే ఆస్పత్రిలో నిద్రపోయా
హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అభద్రత భావానికి గురవుతున్నారని.... వారిలో ఆ భావాన్ని తొలగించేందుకే తాను ఆస్పత్రిలో నిద్రపోయానని డిప్యూటీ సీఎం టి.రాజయ్య మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. నాలుగు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. అందుకోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు టి.రాజయ్య ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లో అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే వైద్య సిబ్బంది ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో నర్సుల కొరత తీవ్రంగా ఉందని... ఆ సమస్యకు త్వరలో పరిష్కరిస్తామని టి.రాజయ్య తెలిపారు. తెలంగాణ డిప్యూటీ సీఎం టి.రాజయ్య సోమవారం రాత్రి నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో నిద్రపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం రాజయ్య ఆస్పత్రి నుంచి తన వాహన కాన్వాయితో బయలుదేరిన సమయంలో ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు రెండు నెలలుగా జీతాలు అందడం లేదని ఆందోళనకు దిగారు. అలాగే తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చిస్తానని రాజయ్య కాంట్రాక్ట్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. -
'కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాసుపత్రులు'
హైదరాబాద్: నగరంలో ఉన్న ఆస్పత్రులకు రూ.552 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.... ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని రాజయ్య తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకుంటున్న చర్యలు వివరించాలని అసెంబ్లీలో సభ్యుడు ప్రశ్నకు టి.రాజయ్య పైవిధంగా సమాధానమిచ్చారు. -
'జూడాలు మానవత్వంతో వ్యవహరించాలి'
వరంగల్ : మానవత్వంతో వ్యవహరించాలని సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు తెలంగాణ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య శనివారం వరంగల్‌లో హితవు పలికారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని ఆయన జూడాలకు విజ్ఞప్తి చేశారు. రూరల్ సర్వీసు మినహా జూడాల అన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని రాజయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. జూనియర్ డాక్టర్లు విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని కేసీఆర్ సర్కార్ జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అంతేకాకుండా అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తున్నామంటూ జూడాలు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
తిరగబడ్డ తెలంగాణ
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి చేసిన పోరాటం, తెలంగాణ రాష్ట్రంలో మూతపడిన ఫ్యాక్టరీలు, ఆగిపోయిన నీటి ప్రాజెక్టులు, గొలుసు చెరువుల అభివృద్ధి గురించి చర్చించే కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘తిరగబడ్డ తెలంగాణ’. స్వీయదర్శకత్వంలో సాంబ శివుడు నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే నెల ఆరంభం కానుంది. ‘స్వాతంత్ర భారత..’ పాటలో కేసీఆర్, గద్దర్, కోదండరామ్, కాళోజీ పాత్రల్లో కనిపిస్తానని, ముఖ్య పాత్రలను భానూరి కృష్ణమురళి, కారం రవీందర్‌రెడ్డి, అతిథి పాత్రను ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య చేయనున్నారని సాంబశివుడు తెలిపారు.