
సాక్షి, వరంగల్ : కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని వందశాతం బలపరుస్తున్నానని స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.రాజయ్య స్పష్టం చేశారు. తనను కేసీఆర్ టి.రాజయ్య నుంచి తెలంగాణ రాజయ్యగా తీర్చిదిద్దారని చెప్పారు. కేసీఆర్ అందరికీ న్యాయం చేస్తారని.. మాదిగలకు త్వరలోనే మరిన్ని ఉన్నత పదవులు వస్తాయని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాదిగలకు మందకృష్ణ ఒక్కడే ప్రతినిధి కాదని తెలిపారు. తాను అంతకన్నా పెద్దవాడినని పేర్కొన్నారు.