మహారాష్ట్రలోని జల్గావ్‌లో దళిత బాలురపై గ్రామస్తుల పైశాచిక దాడిని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.మానవత్వం తన ఉనికిని కాపాడుకునేందుకు సమస్యలు ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ విషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళమెత్తాలని పిలుపు ఇచ్చారు. మహారాష్ట్రలో ఇద్దరు బాలురను కర్రలతో కొడుతున్న వీడియోను రాహుల్ షేర్ చేస్తూ..దళిత చిన్నారులు చేసిన నేరం గ్రామానికి చెందిన బావిలో స్నానం చేయడమేనన్నారు.