గెలుపే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యం గా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులను ‘సార్వత్రిక’ బరిలోదింపింది. జిల్లాలోని రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థులను మంగళవారం రాత్రి ప్రకటించ గా, వారు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు.
నిజామాబాద్ ఎంపీ స్థానానికి సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ స్థానానికి మహమూద్ మొహియొద్దీన్ నామినేషన్లు వేశారు. రవీందర్‌రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు తన నామినేషన్ పత్రాలను అందజేయగా, మొహియొద్దీన్ జహీరాబాద్‌లో దాఖలు చేశారు. తొమ్మిది శాసనసభ స్థానాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొం దరు ఇప్పటికే మొదటి సెట్‌ను దాఖలు చేసినప్పటికీంచి ముహూర్తంగా భా వించిన పలువురు బుధ వారం కార్యకర్తల కోలాహలం మధ్యన నామినేషన్లు వేశారు.
భారీ ఊరేగింపుతో
నిజామాబాద్ అర్బన్ నుంచి అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి కలెక్టరేట్‌లో తన నామినేషన్ వేశారు. ఎల్లారెడ్డిలో పెద్దపట్లోళ్ల సిద్దార్థ రెడ్డి నాయకులు, కార్యక ర్తలు, అభిమానులతో తరలి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. జుక్కల్ అభ్యర్థి నాయుడు ప్రకాశ్ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. బోధన్‌లో కాటి పెల్లి సుదీప్‌రెడ్డి, కామారెడ్డిలో పైల కృష్ణారెడ్డి, బాల్కొండ అభ్యర్థి పాలేపు మురళి, బాన్సువాడ కు రావుట్ల శోభన మహేందర్‌గౌడ్, నిజామాబాద్ రూరల్‌కు బొడ్డు(సి ర్పూరు) గంగారెడ్డి, ఆర్మూరుకు ఎస్‌కే మహబూబ్ వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులుగా నామినేషన్‌లు వేశారు.
దివంగత నేత పథకాలతో జనంలోకి
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సువర్ణ పాలనను గుర్తు చేస్తూ, ఆ పాలన తిరిగి తెస్తామని హామీ ఇస్తూ వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు జనంలోకి దూసుకు వెళ్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి వస్తే చేపట్టే అ భివృద్ధి, సం క్షేమ పథకాలు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యాలను ప్రజలకు వివరిస్తున్నారు.
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల తరపున అనేక ఉద్యమాలు నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ జిల్లా ప్రజలకు చేరువయ్యింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆర్మూరులో నిర్వహించిన రైతు దీక్షకు మద్దతు పలికిన జిల్లా ప్రజలు వైఎస్‌ఆర్ సీపీని ఇంతకాలం ఆదరిస్తూ వస్తున్నారు. ‘గడప గడపకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అన్న నినాదంతో నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారు.