అభ్యర్థులు - ఆస్తిపాస్తులు | Candidates - property | Sakshi
Sakshi News home page

అభ్యర్థులు - ఆస్తిపాస్తులు

Published Thu, Apr 10 2014 2:57 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

అభ్యర్థులు - ఆస్తిపాస్తులు - Sakshi

అభ్యర్థులు - ఆస్తిపాస్తులు

 ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ కుటుంబ ఆస్తులు *16 కోట్లు
 సొంత వాహనం లేని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి
 పోచారం శ్రీనివాస్‌కు బండి లేదు..!
 కాసుల బాల్‌రాజుకు ఇల్లు లేదు..!

 
 
 సార్వత్రిక సమరానికి సై.. అంటూ బరిలో నిలిచేందుకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఈ సందర్భంగా తమ ఆస్తిపాస్తులను ప్రకటించారు. ఇళ్లు, స్థలాలు, వ్యవసాయ భూములు, షేర్లు, డిపాజిట్లు, బంగారు అభరణాలు తదితర ఆస్తుల వివరాలను వారు చూపారు. జిల్లాలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
 - ఆర్మూర్/బాల్కొండ/బోధన్/బాన్సువాడ/కామారెడ్డి/ఎల్లారెడ్డిటౌన్/నిజామాబాద్‌సిటీ

 

కామారెడ్డి
 
 కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ మహ్మద్‌అలీ షబ్బీర్ తన పేరిట, భార్య, కుమారుడి పేరిట కలిపి 16 కోట్ల 80లక్షలు ఉన్నట్టు చూపారు. ఇందులో బ్యాంకు డిపాజిట్లు, వాహనాలు, భూములు, ఇండ్లు, ఫ్లాట్లు ఉన్నాయి. మాచారెడ్డి, కామారెడ్డి మండలం లింగాపూర్, మెదక్ జిల్లా శంకరంపేట్ మండలం శివనూర్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పుర, హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో స్థిర ఆస్తులున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 
 నిజామాబాద్ రూరల్
 
 రూరల్ నుంచి టీఆర్‌ఎస్ తరపున నామినేషన్ వేసిన బాజిరెడ్డి గోవర్ధన్ *67 లక్షల 25వేల 82, తన భార్య వినోదా పేరిట 10 లక్షల ఆస్తులు ఉన్నట్లు చూపారు. 15 లక్షల విలువ గల వాహనం ఉన్నట్లు పేర్కొన్నారు.
 బీజేపీ నుంచి నామినేషన్ వేసిన గడ్డం ఆనంద్‌రెడ్డి తన పేరిట 3 కోట్ల 49లక్షల 82వేల 648 విలువ గల ఆస్తులున్నట్లు చూపారు. తన భార్య ఇందిరాదేవి పేరిటా 96 లక్షల 16వేల 882 వేలు ఆస్తులు ఉన్నాయని చెప్పారు. 15 లక్షల విలువగల వాహనం ఉన్నట్లు పేర్కొన్నారు.
 
 బాల్కొండ
 
 వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పాలెం మురళి 3 లక్షల విలువైన కారు, 1.50 లక్షలు విలువైన బంగారం, 8.50 లక్షల వ్యవసాయ భూమి, భార్య పేరున 8.50 లక్షల భూమి ఉన్నట్లు చూపారు. ఇన్‌కంటాక్స్ చెల్లింపులు 2.80 లక్షలు ఉన్నాయని తెలిపారు.
 కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనిల్ నగదు 6,12,800 ఉన్నట్లు చూపారు. ఆదాయపు పన్ను చెల్లింపులు 16,65,055, బ్యాంకు డిపాజిట్‌లు *32.60 లక్షలు(కుటుంబ సభ్యులను కలిపి), తపాలా శాఖ డిపాజిట్లు 10.36 లక్షలు, 10 లక్షల ఇన్నోవా ఉన్నాయి. భార్య పేరున 30తులాల బంగారం, మెదక్, రంగారెడి, నిజామాబాద్‌జిల్లాల్లో భూములు ఉన్నాయి. హైదరాబాద్‌లో *8 లక్షల ఫ్లాట్ ఉంది. తల్లి పేరిట కిసాన్‌నగర్‌లో 3.50 లక్షల విలువ చేసే ఇల్లు ఉన్నాయి.

 టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి తన వద్ద నగదు 7,48,458 ఉన్నట్లు చూపారు. ఆదాయపు పన్ను చెల్లింపు 11,41,540, భార్య నీరజ పేర చెల్లింపు 12,88,410 ఉన్నట్లు తెలిపారు. భార్య చేతిలో నగదు *65,733 ఉంది. డిపాజిట్లు 12 లక్షలు, 10లక్షల ఇన్నోవా ఉన్నాయి.


 టీడీపీ అభ్యర్థి మల్లికార్జున్‌రెడ్డి నగదు *6లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లింపు 5,35,932, భార్య పేర 5,26,056 ఉన్నట్లు చూపారు. తన వాహనం 2.05 లక్షలుగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 41.69 లక్షల స్థిరాస్తి, డిపాజిట్లు 20 లక్షలు ఉన్నట్లు తెలిపారు.
 
 బోధన్
 
 కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి తన  పేరిట బ్యాంకు ఖాతా నిల్వలు 10,162,60 ఉన్నట్లు చూపారు. కంపెనీల్లో పెట్టుబడులు 37,879,306, ఇతరులకు ఇచ్చిన అడ్వాన్సులు 13,370,882, బంగారు అభరణాలు 8,75,000 ఉన్నాయి. 66లక్షలు విలువైన వ్యవసాయ భూములు సిరాన్‌పల్లిలో ఉన్నాయి. *కోటి 80లక్షల విలువైన ఇతర భూములు, కోటి ఇరవై లక్షల భవనాలు ఉన్నాయి. ఇచ్చిన అప్పులు 14,137.116, బ్యాంక్ డిపాజిట్‌లు 8,77,143, వివిధ కంపెనీల షేర్లు 35,853,829, కమర్షియల్ బిల్డింగ్‌లు 80లక్షలు, నిజామాబాద్‌లో 25లక్షలు విలువైన ఇల్లు, హైదరాబాద్‌లో 11కోట్ల 54లక్షల 12వేల విలువైన భూములు ఉన్నట్లు చూపారు.

ఎల్లారెడ్డి
 
     టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తన పేరిట 9లక్షల 7 వేలు నగదు ఉన్నట్లు చూపారు. భార్య పేరిట 4 లక్షల 33 వేలు ఉన్నట్లు తెలిపారు. అలాగే బీఎండబ్ల్యూ(35 లక్షలు), మారుతీ స్విఫ్ట్(8లక్షల 50 వేలు) కార్లు ఉన్నాయి. ల క్ష 80వేల విలువ గల బంగారం, భార్య వద్ద 32లక్షల 45 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. భూములు, భవనాలు, స్థలాలు కలిపి 10కోట్ల 33 లక్షలు విలువ చూపారు. ఇక 72 లక్షలు అప్పు ఉన్నట్లు తెలిపారు.


 బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి లక్ష 27 వేలు నగదు ఉన్నట్లు తెలిపారు. ఎల్‌ఐసీ పాలసీల విలువ 59లక్షల 70 వేలు, 21లక్షా 70 వేలు విలుగల వాహనాలు, 4లక్షల 50 వేలు విలువైన బంగారు అభరణాలు చూపారు. 4కోట్ల 61లక్షల 50వేలు ఆస్తులున్నాయని,95 లక్షలు ప్రైవేటు వ్యక్తులకు, 4లక్షల 75 వేలు ప్రభుత్వ రుణం ఉన్నట్లు చూపారు.


 వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పెద్దపట్లోళ్ల సిద్దార్థరెడ్డి నగదు 2లక్షల 19 వేలు, బ్యాంకుల్లో *2లక్షల 75 వేలు ఉన్నట్లు చూపారు. ఫార్చునర్(*10 లక్షలు), ఇన్నోవా( 6లక్షలు), స్విఫ్ట్‌కారు(2లక్షలు) వాహనాలున్నాయని తెలిపారు. 12లక్షలు విలువగల బంగారు అభరణాలు, *కోటి విలువైన భూములు,స్థలాలు ఉన్నాయని పేర్కొన్నారు.


 కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు(జాజాల) సురేందర్ తనవద్ద నగదు, బ్యాంకుల్లో 2లక్షల 21 వేలు, ఇన్నోవా(10 లక్షలు), మారుతీ(7 లక్షలు), ట్యాంకర్( 3లక్షలు) వాహనాలున్నట్లు తెలిపారు. 15లక్షలు విలువైన అభరణాలు, 72లక్షల విలువ గల భూములు, భవనాలున్నట్లు  పేర్కొన్నారు. అప్పులు 9లక్షల 50 వేలు చూపారు.
 
 బాన్సువాడ
 
 టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి నగదు 45,500, డిపాజిట్లు 4,02,121,  96వేల షేర్, 30 గ్రా ముల బంగారం, 10 గ్రాముల ఉంగరం(1.20లక్షలు) మొత్తం కలిపి 5,93,621 ఉన్నట్లు చూపారు. భార్య పేరిట *20,550, డిపాజిట్లు 66,047, 10,85,000ల బంగారం ఉన్నాయి. సింగరాయిపల్లిలో *8లక్షల భూములు, పోచారంలో 3,22,728 విలువైన ఇల్లు, 11.50లక్షల విలువ చేసే ఇతర భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. వరంగల్‌లో తనపై కే సు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరిట వాహనాన్ని పేర్కొనక పోవడం గమనార్హం.


 కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్ వద్ద నగదు రూపంలో 8వేలు, 17లక్షల విలువ చేసే ఇన్నోవా వాహనం ఉన్నాయి. 3లక్షల విలువ చేసే ట్రాక్టర్, లక్ష విలువ చేసే ట్రాలీ, 25వేల విలువ చేసే మోటర్ బైక్, *90వేల విలువ చేసే 30గ్రాముల బంగారం ఉన్నట్లు చూపారు. భార్య, తల్లి పేరిట 60వేల విలువ చేసే బంగారం ఉంది. *20 లక్షలు విలువ చేసే భూములు ఉన్నాయి. సుమారు 16లక్షల రుణాలు పొందారు.
 టీడీపీ అభ్యర్థి బద్యానాయక్ వద్ద నగదు రూపంలో 10వేలు, 11లక్షల విలువ చేసే స్కార్పియో వాహనం, 40 గ్రాముల బంగారం ఉంది. 7లక్షల విలువ చేసే 13 ఎకరాల భూమి, *లక్ష విలువ చేసే ఇల్లు ఉంది. బ్యాంకు ద్వారా 8,31,000 రుణాన్ని పొందారు.  
 
 
 ఆర్మూర్
 
 శానససభ మాజీ స్పీకర్, ఆర్మూర్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి కేఆర్ సురేశ్‌రెడ్డి వద్ద అప్పులు పోను మిగిలిన ఆస్తులన్నింటినీ కలిపి ప్రస్తుత బహిరంగ మార్కెట్‌లో స్థిర, చరాస్థులు, బాండ్లు, షేర్లు, నేషనల్ సేవింగ్స్ రూపంలో తన పేరిట 5 కోట్ల 48 లక్షల 93 వేలు ఉన్నట్లు చూపారు. భార్య పద్మజ రెడ్డి పేరిట  ఐదు కోట్ల 85 లక్షల 95 వేలు, కుమారుని పేరిట  రెండు కోట్ల ఆస్థులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతరత్రా ఆస్తులు తన పేరిట  40 లక్షల 31 వేలు, భార్య పేరిట  47 లక్షల 56 వేలు ఉన్నట్లు చూపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి కుటుంబ ఆస్తుల వివరాలు స్థిర చరాస్థులన్నీ కలిపి.. తన పేరిట  మూడు కోట్ల 62 లక్షల 32 వేలు, భార్య పేరిట  మూడు కోట్ల 50 లక్షల విలువైన ఆస్తులున్నట్లు చూపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement