పొత్తుల కత్తులు
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : బీజేపీ, టీడీపీ పొత్తు జిల్లాలో పొసగడం లేదు. టీడీపీతో దోస్తీని వుందునుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ నాయుకులు ఆ పార్టీకి సహకరించడం అనువూనంగానే కనిపిస్తోంది. ఏకపక్షంగా పొత్తును తవుపై రుద్దారనే భావన కవులనాథుల్లో బలంగా నాటుకుపోరుంది. దీనికితోడు గతంలో ప్రాతినిథ్యం వహించిన పెద్దపల్లి సీటును టీడీపీకి కేటారుుంచాల్సి రావడం కూడా బీజేపీ నాయుకుల అసంతృప్తికి ప్రధాన కారణమైంది.
పొత్తులో భాగంగా పెద్దపల్లి నుంచి బరిలోకి దిగాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రావుకృష్ణారెడ్డి ఆశించినప్పటికీ, అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయురవుణారావు పోటీలో ఉండటంతో సహజంగానే టికెట్ టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. దీనిపై బీజేపీ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి సహకరించేది అనువూనమే కాగా, అవసరమైతే రెబెల్‌గా పోటీకి దిగాలనే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
పొత్తుపై విముఖత...
తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ముఖ్యభూమిక పోషించడం, పార్టీ నాయకులు చురుకుగా పాల్గొనడంతో జిల్లాలో పార్టీకి పట్టు పెరిగింది. దీంతో మొదటి నుంచి ఒంటరిగా పోటీచేసే అవకాశాలున్నట్లు పార్టీ నుంచి సంకేతాలు రావడంతో నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఆ స్థాయి నాయకులు పోటీకి సిద్ధమయ్యారు. తీరా నామినేషన్లపర్వం మొదలయ్యాక బీజేపీ-టీడీపీ పొత్తులు తెరపైకి వచ్చాయి.
తెలంగాణ ఉద్యమంతో జిల్లాలో పట్టుకోల్పోయిన టీడీపీతో పొత్తువల్ల తమకే నష్టం వాటిల్లుతుందని భావించిన స్థానిక నేతలు అసంతృప్తితో రగులుతున్నారు. టీడీపీతో పొత్తు తవుకు నష్టవుని ఏకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు మీడియూ సవూవేశం ఏర్పాటు చేసి వురీ ఆక్రోశం వెల్లగక్కారు. గెలిచే స్థానాలను బీజేపీకి కాకుండా టీడీపీకి కేటాయించడంపై మండిపడ్డారు. పొత్తు ఉన్నప్పటికీ పట్టున్న స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలోకి దిగుతామని పలువురు నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతుండడంతో టీడీపీ, బీజేపీ పొత్తుపై నీలినీడలు కవు్మకున్నారు.
టీడీపీ స్థానాల్లో అసంతృప్తి...
పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు అసంతృప్తి సెగలు రగుల్చుతున్నారు. పెద్దపల్లి, జగిత్యాల, మంథని, మానకొండూర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకి పట్టు ఉందని, ఆ స్థానాల్లో పోటీకి దిగుతామని బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీ పునరాలోచించకపోతే స్వతంత్రులుగా బరిలో నిలిచేందుకు సిద్దమవుతున్నారు. అసమ్మతులు, అసంతృప్తులతో బీజేపీ నేతలు అన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశాలే కనబడుతున్నాయి. దీంతో టీడీపీ-బీజేపీ పొత్తు కొసదాకా కొనసాగడం అనుమానమే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.