gujjula Ramakrishna Reddy
-
ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఎల్లంపల్లి నీరివ్వాలి
సాక్షి, ధర్మారం(ధర్మపురి): ఎల్లంపల్లి నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీ–83 కెనాల్ ద్వారా ఆయకట్టుకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం ప్రకటన చేయాలని లేని పక్షంలో సెప్టెంబర్ 6న రాష్ట్ర రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టుతామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. ధర్మారం మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎల్లంపల్లి నీటిని దోపిడి చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నాడని ఆరోపించిన కేసీఆర్ ప్రస్తుతం ఆయన చేస్తున్న పనేంటో స్పష్టం చేయాలన్నారు. ఎల్లంపల్లి నిర్మాణ సమయంలో పేర్కొన్న డీపీఆర్‌లో ఆంధ్ర ప్రాంతానికి నీరు తరలిస్తున్నట్లు ఎక్కడ లేదని మాయమాటలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ తప్పుదోవపట్టించారని ఆరోపించారు. అప్పటి డీపీఆర్‌లో ఎల్లంపల్లి నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ డీ–83 ద్వారా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు సాగునీరందించాలని స్పష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం కేసీఆర్ డీపీఆర్‌కు విరుద్ధంగా ఇక్కడ రైతులకు సాగునీరందించకుండా హైదరాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 6లోగా ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా రైతులకు సాగునీరందించే విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని లేకుంటే రైతు ఉద్యమం చేపట్టాల్సివస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, ప్రధానకార్యదర్శి కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కన్నం అంజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శులు బండారి శ్రీనివాస్, తీగుల్ల సతీష్‌రెడ్డి, సందనేని లక్ష్మణ్, పత్తిపాక సింగిల్‌విండో చైర్మన్ తాడ్వాయి రాంగోపాల్‌రెడ్డి, నాయకులు మెడవేని శ్రీని వాస్, ఎల్లాల మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మోదీయే నిజమైన రైతుబంధు
పెద్దపల్లిరూరల్: ఆరుగాలం కష్టపడి పంట దిగుబడులు సాధించిన రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రధాని నరేంద్రమోదీ సాహసోపేత నిర్ణయం తీసుకుని నిజమైన రైతుబంధుగా నిలిచారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. పెద్దపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పంటలను సాగుచేసే రైతులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన కేంద్రం మద్దతు ధరను పెంచిందన్నారు. 24 రకాల పంటలకు పెంచాలనుకున్నా తొలిదఫాగా 14 పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుందని వివరించారు. పెద్దపల్లి జిల్లాలో వరి, పత్తి పంటల సాగు ఎక్కువ విస్తీర్ణంలో చేస్తున్న రైతులకు మద్దతు ధర పెంపు ఎంతో ఉపకరిస్తుందన్నారు. పత్తికి క్వింటాల్‌కు రూ. 1130, వరికి రూ. 200 మద్దతు ధర పెంచడం హర్షనీయమన్నారు. కష్టపడి పని చేసే రైతు, కౌలు రైతులకే నేరుగా లబ్ధి చేకూరేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా రైతాంగం సంతోష పడుతుందన్నారు. అ యితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే అమలులోకి తెచ్చిన రైతుబంధు పథకం భూ యజమానులకే లబ్ధి చేకూర్చేలా ఉందన్నారు. కేంద్రం ఇచ్చే మద్దతు «ధరకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ అధికారం దేశంలో నీతివంతమైన పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాల సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్న ధీమాను గుజ్జుల వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ప్రజా జనచైతన్య యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందన్నారు. బుధవారం పెద్దపల్లికి చేరిన ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా చేపట్టిన బైక్‌ర్యాలీకి తరలివచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కొంతం శ్రీనివాస్‌రెడ్డి, మీస అర్జున్‌రావు, కర్రె సంజీవరెడ్డి, పుట్ట మొండయ్య, ఠాకూర్ రాంసింగ్, పిన్నింటి రాజు, ఫహీమ్, జంగ చక్రధర్‌రెడ్డి, కందుల సదానందం, ఠాకూర్ రాజారాంసింగ్, స్వతంత్ర కుమార్, ఆనంద్, బచ్చలి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దాం
► బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల పెద్దపల్లిరూరల్: కేంద్ర ప్రభుత్వం అమలు చేసు ్తన్న సంక్షేమ పథకాల తీరును ప్రజలకు వివరి ంచి, గ్రామస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పెద్దకల్వల గ్రామంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మోదీ సర్కార్ ఎంతో ప్రాధాన్యతనిస్తుందన్నా రు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తె చ్చేందుకు శ్రమించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట మొం డయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఆది కేశవరావు, నాయకులు పిన్నింటి రాజు, పర్శ సమ్మయ్య, తొడుపునూరి కృష్ణమూర్తి, చిలువేరు ఓదెలు, పల్లె సదానం దం, వెల్లంపల్లి శ్రీనివాసరావుతోపాటు మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబపాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ఓదెల: ప్రత్యేకరాష్ట్రం తెల ంగాణ ఆవిర్భవించిన అనంతరం సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ పే రిట కుటుంబపాలన కొ నసాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జు ల రామక్రిష్ణారెడ్డి ఆరోపించారు. గుంపుల గ్రామంలోమండల కార్యవర్గసమావేశం ఆదివారం జరిగింది. గ్రామంలోని ప్రధానకూడలివద్ద జిల్లాఅధ్యక్షుడు కాసిపేట లింగయ్య జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, బీజేపీ మండలఅధ్యక్షుడు శనిగరపు రమేశ్, జిల్లాప్రధానకార్యదర్శి కర్రె సంజీవరెడ్డి, సర్పంచు ఖైరున్నీసా, జిల్లా ఉపాధ్యక్షులు ఆది కేశవరావు, గుజ్జుల రాజనరేందర్‌రెడ్డి, జిల్లాదళిత మోర్చ ఉపాధ్యక్షుడు పల్లె ఓదెలు, మండల ప్రధానకార్యదర్శి తాళ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, జిల్లా పంచాయతీ సెల్ అధ్యక్షుడు ఆవుల ముత్తయ్య, కాల్వశ్రీరాంపూర్ మండల అధ్యక్షుడు జంగ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు జాపతి రాజిరెడ్డి, కనుకుంట్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు. గుజ్జుల సమక్షంలో పలువురిచేరిక మడక గ్రామానికి చెందిన నోముల కార్తీక్ రెడ్డి, ఆవుల వంశీ, మహేశ్, నొముల మల్లారెడ్డి, గోపు ప్రశాంత్, శింగారపు ఐలయ్యతో పాటు ఇ ందుర్తి గ్రామానికి చెందిన మల్లారెడ్డిలు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. -
యూపీఏ ప్రభుత్వంలో రైతులు కనిపించలేదా?
కాంగ్రెస్ పాలనలో రైతులకు తీరని నష్టం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి జగిత్యాల అర్బన్ : కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ పాలనలో అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారందరూ రాహుల్‌గాంధీకి కనిపించలేదా? అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పట్టణంలోని ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యూపీఏ పదేళ్లపాలనలో ఏం చేశారో చెప్పాలన్నారు. రాహుల్‌గాంధీ పర్యటనపై కాంగ్రెస్ నాయకులే అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉనికి కోసమే రాహుల్ తెలంగాణలో పర్యటిస్తున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలపై యూపీఏ ప్రభుత్వం అనేక కమిటీలు వేసిందని, అవి నివేదికలు ఇచ్చినా... రైతుల ఆత్మహత్యలు ఎందుకు నిలువరించలేకపోయారని ప్రశ్నించారు. భూసేకరణ చట్టంలో ఎలాంటి మార్పులు లేవన్నారు. ప్రజాసంక్షేమం కోసం నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆర్టీసీ సమ్మెతో రూ.100 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని, ఇందుకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని, ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్, నాయకులు రాజన్న, లింగారెడ్డి, సీపెల్లి రవీందర్, కిశోర్‌సింగ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
పొత్తుల కత్తులు
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : బీజేపీ, టీడీపీ పొత్తు జిల్లాలో పొసగడం లేదు. టీడీపీతో దోస్తీని వుందునుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ నాయుకులు ఆ పార్టీకి సహకరించడం అనువూనంగానే కనిపిస్తోంది. ఏకపక్షంగా పొత్తును తవుపై రుద్దారనే భావన కవులనాథుల్లో బలంగా నాటుకుపోరుంది. దీనికితోడు గతంలో ప్రాతినిథ్యం వహించిన పెద్దపల్లి సీటును టీడీపీకి కేటారుుంచాల్సి రావడం కూడా బీజేపీ నాయుకుల అసంతృప్తికి ప్రధాన కారణమైంది. పొత్తులో భాగంగా పెద్దపల్లి నుంచి బరిలోకి దిగాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రావుకృష్ణారెడ్డి ఆశించినప్పటికీ, అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయురవుణారావు పోటీలో ఉండటంతో సహజంగానే టికెట్ టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. దీనిపై బీజేపీ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి సహకరించేది అనువూనమే కాగా, అవసరమైతే రెబెల్‌గా పోటీకి దిగాలనే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. పొత్తుపై విముఖత... తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ముఖ్యభూమిక పోషించడం, పార్టీ నాయకులు చురుకుగా పాల్గొనడంతో జిల్లాలో పార్టీకి పట్టు పెరిగింది. దీంతో మొదటి నుంచి ఒంటరిగా పోటీచేసే అవకాశాలున్నట్లు పార్టీ నుంచి సంకేతాలు రావడంతో నియోజకవర్గ ఇన్చార్జీలు, ఆ స్థాయి నాయకులు పోటీకి సిద్ధమయ్యారు. తీరా నామినేషన్లపర్వం మొదలయ్యాక బీజేపీ-టీడీపీ పొత్తులు తెరపైకి వచ్చాయి. తెలంగాణ ఉద్యమంతో జిల్లాలో పట్టుకోల్పోయిన టీడీపీతో పొత్తువల్ల తమకే నష్టం వాటిల్లుతుందని భావించిన స్థానిక నేతలు అసంతృప్తితో రగులుతున్నారు. టీడీపీతో పొత్తు తవుకు నష్టవుని ఏకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు మీడియూ సవూవేశం ఏర్పాటు చేసి వురీ ఆక్రోశం వెల్లగక్కారు. గెలిచే స్థానాలను బీజేపీకి కాకుండా టీడీపీకి కేటాయించడంపై మండిపడ్డారు. పొత్తు ఉన్నప్పటికీ పట్టున్న స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలోకి దిగుతామని పలువురు నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతుండడంతో టీడీపీ, బీజేపీ పొత్తుపై నీలినీడలు కవు్మకున్నారు. టీడీపీ స్థానాల్లో అసంతృప్తి... పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు అసంతృప్తి సెగలు రగుల్చుతున్నారు. పెద్దపల్లి, జగిత్యాల, మంథని, మానకొండూర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకి పట్టు ఉందని, ఆ స్థానాల్లో పోటీకి దిగుతామని బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీ పునరాలోచించకపోతే స్వతంత్రులుగా బరిలో నిలిచేందుకు సిద్దమవుతున్నారు. అసమ్మతులు, అసంతృప్తులతో బీజేపీ నేతలు అన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశాలే కనబడుతున్నాయి. దీంతో టీడీపీ-బీజేపీ పొత్తు కొసదాకా కొనసాగడం అనుమానమే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.