గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దాం | Let us strengthen the party in the village | Sakshi
Sakshi News home page

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దాం

Published Mon, Feb 6 2017 10:26 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దాం - Sakshi

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దాం

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల
పెద్దపల్లిరూరల్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేసు ్తన్న సంక్షేమ పథకాల తీరును ప్రజలకు వివరి ంచి, గ్రామస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పెద్దకల్వల గ్రామంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మోదీ సర్కార్‌ ఎంతో ప్రాధాన్యతనిస్తుందన్నా రు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తె చ్చేందుకు శ్రమించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట మొం డయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఆది కేశవరావు, నాయకులు పిన్నింటి రాజు, పర్శ సమ్మయ్య, తొడుపునూరి కృష్ణమూర్తి, చిలువేరు ఓదెలు, పల్లె సదానం దం, వెల్లంపల్లి శ్రీనివాసరావుతోపాటు మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


కుటుంబపాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌
ఓదెల: ప్రత్యేకరాష్ట్రం తెల ంగాణ ఆవిర్భవించిన అనంతరం సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ పే రిట కుటుంబపాలన కొ నసాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జు ల రామక్రిష్ణారెడ్డి ఆరోపించారు. గుంపుల గ్రామంలోమండల కార్యవర్గసమావేశం ఆదివారం జరిగింది.  గ్రామంలోని ప్రధానకూడలివద్ద జిల్లాఅధ్యక్షుడు కాసిపేట లింగయ్య జెండా ఆవిష్కరించారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య,  బీజేపీ మండలఅధ్యక్షుడు శనిగరపు రమేశ్, జిల్లాప్రధానకార్యదర్శి కర్రె సంజీవరెడ్డి, సర్పంచు ఖైరున్నీసా, జిల్లా ఉపాధ్యక్షులు ఆది కేశవరావు, గుజ్జుల రాజనరేందర్‌రెడ్డి, జిల్లాదళిత మోర్చ ఉపాధ్యక్షుడు పల్లె ఓదెలు, మండల ప్రధానకార్యదర్శి తాళ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, జిల్లా పంచాయతీ సెల్‌ అధ్యక్షుడు ఆవుల ముత్తయ్య, కాల్వశ్రీరాంపూర్‌ మండల అధ్యక్షుడు జంగ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు జాపతి రాజిరెడ్డి, కనుకుంట్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.

గుజ్జుల సమక్షంలో పలువురిచేరిక
మడక గ్రామానికి చెందిన నోముల కార్తీక్‌ రెడ్డి, ఆవుల వంశీ, మహేశ్, నొముల మల్లారెడ్డి, గోపు ప్రశాంత్, శింగారపు ఐలయ్యతో పాటు ఇ ందుర్తి  గ్రామానికి చెందిన మల్లారెడ్డిలు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement