11మంది పాతకాపులు | manthani from minister sridhar babu | Sakshi
Sakshi News home page

11మంది పాతకాపులు

Published Tue, Apr 8 2014 2:21 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

11మంది పాతకాపులు - Sakshi

11మంది పాతకాపులు

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్:వుంథని నుంచి వూజీ వుంత్రి శ్రీధర్‌బాబు, వూనకొండూరు నుంచి వూజీ విప్ అరెపల్లి మోహన్, హుస్నాబాద్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి టిక్కెట్టు కేటారుుంచింది. ఇటీవలే టీడీపీ నుంచి పార్టీలో చేరిన చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యుకు అదే బెర్త్ ఖరారు చేసింది. గత ఎన్నికల్లో చేదు అనుభవం చూసిన పార్టీ అభ్యర్థులు నలుగురికి వురోసారి అవకాశం ఇచ్చింది. జగిత్యాల నుంచి వూజీ వుంత్రి జీవన్‌రెడ్డి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కువూర్, కరీంనగర్ నుంచి చెల్మెడ లక్ష్మీనరసింహారావు, రావుగుండం నుంచి బాబర్‌సలీం పాషాకు టిక్కెట్లు కేటారుంచింది.

సిరిసిల్ల టిక్కెట్టు అందుకున్న కొండూరి రవీందర్‌రావు, పెద్దపల్లి  నుంచి పార్టీ అభ్యర్థిత్వం పొందిన టి.భానుప్రసాద్‌రావు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. మిగతా వారందరూ గతంలో పోటీ చేసిన అనుభవవున్న నేతలే. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకే పెద్దపీట వేసింది. వుూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలు వదిలిస్తే... ఏడు సీట్లను ఓసీలకు, వుూడు చోట్ల బీసీలను అవకాశం కల్పించింది. రావుగుండం సీటును మైనారిటీలకు కేటారుంచింది.

 అగ్రవర్ణాల్లో వుూడు వెలవు, వుూడు రెడ్డి, ఒకటి బ్రాహ్మణకు కేటారుుంచింది. పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల సీట్లను వెలవు సావూజిక వర్గానికి, జగిత్యాల, హుజూరాబాద్, హుస్నాబాద్ స్థానాలను రెడ్డిలకు, వుంథని బ్రాహ్మణులకు కేటారుుంచగా.. వేవులవాడ, కోరుట్ల సీట్ల నుంచి వుున్నూరు కాపు అభ్యర్థులను బరిలోకి దింపింది.సుదీర్ఘంగా చర్చల అనంతరం పొత్తు పెట్టుకున్న సీపీఐకి కాంగ్రెస్ మొండిచేరుు చూపింది. పొత్తులో భాగంగా హుస్నాబాద్ లేదా రావుగుండం స్థానాలకు సీపీఐకి కేటారుుస్తారని అనుకున్నా, అందుకు విరుద్ధంగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

 రెండు పార్టీల పొత్తుల చర్చల్లోనూ హుస్నాబాద్‌పై పీటవుుడి పడగా... హుస్నాబాద్‌కు బదులు రావుగుండం ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అందుకే పార్టీ ఆదేశిస్తే రావుగుండం నుంచి పోటీలో ఉంటానని సీపీఐ వూజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. తీరా రావుగుండం నుంచి కాంగ్రెస్ పార్టీ బాబర్‌సలీం పాషాకు టిక్కెట్టు ఇవ్వటంతో పొత్తు ఉల్లంఘించినట్లరుుంది.
     

వుంథని నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, వూజీ వుంత్రి శ్రీధర్‌బాబు వరుసగా నాలుగోసారి సొంత సెగ్మెంట్ నుంచి పోటీకి దిగుతున్నారు. శ్రీధర్‌బాబు కంటే వుుందు ఆయున తండ్రి శ్రీపాదరావు సైతం ఇక్కణ్నుంచి వరుసగా నాలుగుసార్లు పోటీ చేశారు. వారసత్వంగా ఆయున తనయుుడు శ్రీధర్‌బాబు వరుసగా నాలుగోసారి ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జగిత్యాల నుంచి వూజీ వుంత్రి జీవన్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. వరుసగా తొమ్మిది ఎన్నికల్లో ఒకే చోటు నుంచి పోటీ చేసిన రికార్డును ఆయున సొంతం చేసుకున్నారు. 1983 నుంచి వరుసగా వచ్చిన ఎన్నికలన్నింటా ఆయున ప్రధాన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రవుణపై ఓడిపోరుున జీవన్‌రెడ్డి ఈసారి అక్కడ త్రివుఖ పోటీ ఎదుర్కోనున్నారు.


వూనకొండూరు నుంచి ప్రాతినిథ్యం వహించిన సిట్టింగ్ ఎమ్మెల్యే, వూజీ విప్ అరెపల్లి మోహన్‌కు వురోసారి సీటు ఖరారైంది. తన సొంత సెగ్మెంట్ నుంచి ఆయున వరుసగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు. హుస్నాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి వురోసారి అవకాశం కల్పించారు. పొత్తులో భాగంగా ఈ సీటును తవుకు ఇవ్వాలని సీపీఐ చివరి వరకు పట్టుబట్టినా.. సిట్టింగ్ సీటు కావటంతో కాంగ్రెస్ ఇచ్చేందుకు వివుఖత చూపింది.
     

హుజూరాబాద్ నుంచి కేతిరి సుదర్శన్‌రెడ్డికి టిక్కెట్టు దక్కింది. 2008 ఉప ఎన్నికల్లో అప్పటి పాత సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగి ఓడిపోయూరు. పునర్విభజన తర్వాత సుదర్శన్‌రెడ్డికి పోటీ చేసే అవకాశం దక్కటం ఇదే మొదటిసారి. కరీంనగర్ నుంచి చెల్మెడ లక్ష్మీనరసింహారావుకు వరుసగా రెండోసారి పోటీ చేసే అవకాశం వచ్చింది. గత ఎన్నికల్లోనూ ఆయున ఇదే సీటు నుంచి పోటీకి దిగారు. చొప్పదండి నుంచి ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యుకు అవకాశం లభించింది. వరుసగా రెండోసారి ఆయున పోటీకి సిద్ధవువుతున్నారు.
     

సిరిసిల్ల నుంచి డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు అభ్యర్థిత్వం ఖరారైంది. నిరుడు సహకార ఎన్నికల్లో కేడీసీసీ బ్యాంకు అధ్యక్షునిగా గెలుపొందిన కొండూరి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.వూజీ ఎమ్మెల్యే, సీనియుర్ నాయుకుడు బొవ్ము వెంకటేశ్వర్లుకు వేవుులవాడ టిక్కెట్టు ఇచ్చారు. పాత ఇందుర్తి నియోజకవర్గంలో నాలుగుసార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన బొవ్ము వెంకటేశ్వర్లు ప్రస్తుతం వేవుులవాడ ఆలయు కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. తొలిసారిగా వేవుులవాడ నుంచి బరిలోకి దిగుతున్నారు.


ధర్మపురి నుంచి వరుసగా వుూడోసారి అడ్లూరి లక్ష్మణ్‌కువూర్ పోటీకి దిగుతుండటం రికార్డు. ఈ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి 2009, 2010 ఉప ఎన్నికల్లో ఆయునే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి నిలిచారు.అనూహ్యంగా రాజకీయూల్లోకి వచ్చి, అరుుదేళ్ల కిందట స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన భానుప్రసాదరావు ఇప్పుడు ఎమ్మెల్యే బరిలోకి దిగుతున్నారు. పెద్దపల్లి నుంచి ఆయున అభ్యర్థిత్వం ఖరారైంది.
     
కోరుట్ల నుంచి వూజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రావుులును కాంగ్రెస్ పోటీకి దింపింది. పాత మెట్‌పల్లి నియోజకవర్గంలో గతంలో నాలుగుసార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన కొమిరెడ్డి.. కొత్తగా ఏర్పడ్డ కోరుట్ల నుంచి పోటీకి దిగటం ఇదే మొదటిసారి. రావుగుండం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బాబర్‌సలీం పాషాకు కాంగ్రెస్ పార్టీ వురోసారి టిక్కెట్టు కేటారుంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement