
అమిత్‌షా, నితీశ్‌కుమార్
న్యూఢిల్లీ/పాట్నా: ‘జేడీ (యూ)తో మా బంధం బలంగా ఉందని, వచ్చే బీహార్ ఎన్నికలను ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోనే ఎదుర్కొంటామని హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా జేడీ (యూ), బీజేపీ సంబంధాలపై వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. రెండు పార్టీల మధ్య సంకీర్ణ బంధం బలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బిహార్‌లో నితీశ్‌కుమార్ నాయకత్వంలోనే ఎన్నికలలో పోటీచేస్తాం, జాతీయ స్థాయిలో తమ కూటమికి ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తారని షా వెల్లడించారు. ‘కలహాలు సంకీర్ణం ఆరోగ్యకరంగా ఉందనడానికి సంకేతం. విభేదాలు ఉండడం సహజం, వాటిని మనసులోకి తీసుకుంటేనే కష్టం’అని షా అన్నారు. త్రిపుల్ తలాక్ చట్టం, 370 రద్దుపై కేంద్రానికి నితీశ్ కుమార్ మద్దతు ప్రకటించని విషయం తెలిసిందే.