ఇందు
అమిత్, ఇందు జంటగా నటించిన చిత్రం ‘చీమ ప్రేమ మధ్యలో భామ’. మాగ్నమ్ ఓపస్ ఫిలింస్ పతాకంపై శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్.ఎన్ లక్ష్మీనారాయణ నిర్మించారు. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘చిన్న సినిమాల్లో మా సినిమా స్పెషల్. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు దర్శకుడు. ‘‘ప్రస్తుతం యువతీ యువకులు ప్రేమవిషయంలో ఎంత పరిణతితో ఉన్నారో చూపే చిత్రమిది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా ఉంటుందని చెబుతున్నాం. మా సినిమా అన్ని వర్గాలవారికి నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత. ‘‘మంచి పాత్ర చేశా’’ అన్నారు అమిత్.
Comments
Please login to add a commentAdd a comment