
అమిత్, ఇందులను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీమ– ప్రేమ మధ్యలో భామ!’. లక్ష్మీ నారాయణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలకానుంది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో చీమ హీరోగా వస్తున్న మొదటి చిత్రమిది. అలాగని పూర్తి యానిమేషన్ చిత్రం కాదు. అందరూ చూడదగ్గ మంచి కుటుంబ కథా చిత్రం’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్ చూసి, రాజమౌళిగారి ‘ఈగ’ను మా చీమతో పోల్చాడం గొప్ప ప్రశంసగా భావిస్తున్నాం. ‘ఈగ’ది ప్రతీకారం. మా చీమది ప్రేమకథ’’ అన్నారు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు. సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని.
Comments
Please login to add a commentAdd a comment