
అమిత్, ఇందు
అమిత్, ఇందు జంటగా శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పల రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీమ– ప్రేమ మధ్యలో భామ’. ఎస్‌ఎన్ లక్ష్మీనారాయణ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులో విడుదల కానున్న ఈ చిత్రం గురించి శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో చీమే హీరో. అలా అని ఈ చిత్రం చిన్న పిల్లలకు ప్రత్యేకం అని చెప్పలేం. ఈ సినిమా అందరి కోసం... కాకపోతే కొంచెం ఎక్కువ మహిళల కోసం’’ అన్నారు. ‘‘మా సినిమాకి ఎటువంటి సెన్సార్ కట్స్ లేకుండా విడుదలకు అనుమతి లభించింది. విలువలకు ప్రాధాన్యతనిస్తూ తీసిన వినూత్నమైన సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు లక్ష్మీనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని.
Comments
Please login to add a commentAdd a comment