Indu
-
ఉండాల్సింది ధైర్యం మాత్రమే!
ప్రపంచంలో చాలామంది ఒకే తరహా పనిని ఏళ్లుగా చేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కొందరు మాత్రం ఏకకాలంలో ఎన్నో పనులు చేస్తూ సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ఇందు గుర్జార్. జైపూర్‌వాసి అయిన 32 ఏళ్ల ఇందు గుర్జార్ సింగిల్ పేరెంట్‌గా తన తొమ్మిదేళ్ల కూతురును చూసుకుంటూ, బ్యాంకు ఉద్యోగం చేస్తూ, అంతర్జాతీయ క్రీడాకారిణిగా, మౌంటెనీర్ బైకర్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. సవాళ్లను అధిగమిస్తూ ఇందు చేస్తున్న ప్రయత్నం ఒడిదొడుకులను ఎదుర్కొనేవారికి స్ఫూర్తిగా నిలుస్తుంది.‘‘సమస్యలు వచ్చేదే మనలోని శక్తిని గుర్తించడానికి. ధైర్యం తెచ్చుకొని ప్రయత్నిస్తే తిరిగి మనకో కొత్త జీవితం ఏర్పడుతుంది. నా చిన్నతనంలో మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. మా నాన్నకు టీ కొట్టు ఉండేది. కానీ, దాని నుంచే ఆయన తన కొడుకులలో ఒకరిని డాక్టర్ని చేసి, మా అందరికీ ఉత్తమవిద్యను అందించడానికి ప్రయత్నించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. చిన్ననాటి నుంచి క్రీడలంటే చాలా ఆసక్తి. రాష్ట్రస్థాయిలో బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ ఆడాను. కాలేజీలో స్పోర్ట్స్ ఆప్షన్ లేక΄ోవడంతో నా ఇష్టాన్ని అక్కడితో వదిలేయాల్సి వచ్చింది. గృహహింస మా కమ్యూనిటీలో అమ్మాయిలకు పెళ్ళిళ్లు త్వరగా చేస్తారు. కానీ, నా తల్లిదండ్రుల సహకారంతో గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను. ఆ వెంటనే పెళ్లి చేశారు. పెళ్లి నా జీవితాన్ని విచ్ఛిన్నం చేసింది. బిడ్డను కనాలని, వరకట్నం తేవాలని... ప్రతిరోజూ ఏదో ఒక విషయం మీద నరకం చూసేదాన్ని. అత్తింటివాళ్లు నా తల్లిదండ్రులకు నా మీద ఏవేవో చాడీలు చెప్పేవారు. పాప పుట్టిన తర్వాత పుట్టింటి నుండి తిరిగి అత్తవారింటికి వెళ్లడానికి భయపడ్డాను. కానీ, పెద్దవారిని కూర్చోబెట్టి, ఒప్పించి తిరిగి తీసుకెళ్లారు. కానీ, అక్కడి పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదు.నెల రోజుల వ్యవధిలోనే మా అత్తింటిని వదిలి, తిరిగి పుట్టింటికి వచ్చేశాను. ఏడాది కాలం పుట్టింట్లోనే ఉన్నాను. పరిస్థితుల్లో మార్పు రాదని గ్రహించి, విడాకులకు కోర్టులో కేసు వేశాను. ఒంటరిగా బిడ్డను పెంచడం నాకు అంత తేలికైన పనికాదు. ఇంటి నిర్వహణకు, నా ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ఇంధనం అవసరం. ఆ మనోవర్తి రూపంలో ఆ ఇంధనం రాబట్టుకోవడం కోసం ఏడేళ్లపాటు విడాకుల కేసుపై పోరాడుతూనే ఉన్నాను. కానీ, న్యాయం జరగలేదు.డిప్రెషన్ నుంచి కోలుకొని... ఆటుపోట్లతో ఉన్న జీవితాన్ని చూసి చాలా బాధపడేదాన్ని. ఒక వ్యక్తి జీవితంలో చెడుకాలం వచ్చినప్పుడు పరిస్థితుల ముందు లొంగిపోతాడు. కానీ, నాకు నేనుగా ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలనుకున్నాను. బ్యాంకు ఉద్యోగం సంపాదించుకొని, నాకు నేనుగా జీవించడం మొదలుపెట్టాను.ఫిట్‌గా ఉండేందుకు.. ఉద్యోగం చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే కోవిడ్ వచ్చింది. మొదటి వేవ్‌లో కరోనా బాధితురాలిని అయ్యాను. వాడిన మందుల వల్లనేమో కోవిడ్ తర్వాత బరువు పెరగడం మొదలైంది. దీంతో ఫిట్‌గా ఉండేందుకు రోజూ రెండు–మూడు కిలోమీటర్లు సైక్లింగ్ చేసేదాన్ని. ఆ తర్వాత స్టేడియంకు వెళ్లడం మొదలుపెట్టాను. అక్కడ సైక్లిస్టుల బృందాన్ని కలిశాను. ఆ క్రీడలో పాల్గొనడానికి వయోపరిమితి ఏమీ లేదని తెలిసింది.దాంతో నాలో చిన్న ఆశ కలిగింది. బహుశా విధి నాకు అలాంటి అవకాశం ఇచ్చింది అనుకున్నాను. మొదట్లో రెండు–మూడు కిలోమీటర్లు సైక్లింగ్ చేసే నేను ఈ రోజు 50– 100 కిలోమీటర్లు తిరుగుతున్నాను. యూసీఐ (ఇంటర్నేషనల్ సైకిలిస్ట్ యూనియన్) ఎలిమినేటర్ ప్రపంచకప్‌లో పాల్గొన్నాను. ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్లలో పాల్గొని, అంతర్జాతీయ సైక్లిస్టులను కలిశాను.పర్వత బైకర్‌గా...వృత్తిరీత్యా బ్యాంకర్గానే కాకుండా మూడేళ్లుగా మౌంటెన్ బైకర్‌గా కూడా ఉన్నాను. పర్వతాల్లో చేసే సాహసోపేతమైన ΄ోటీల్లో విజేతగా నిలుస్తుండేదాన్ని. ఆ పోటీలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేవి. రెండేళ్ల క్రితం లదాఖ్‌లోని లేహ్‌లో జరగిన యుసిఐ ఎలిమినేటర్ ప్రపంచ కప్‌లో ఎలైట్ మహిళల విభాగంలో భారతదేశానికి ్రపాతినిధ్యం వహించడం గర్వంగా అనిపించింది.శక్తిని గుర్తించాలి..నా కూతురికి ఇప్పుడు తొమ్మిదేళ్లు. ఆమె కూడా క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అందుకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాను. చదువుతోపాటు టాలెంట్‌ను కూడా గుర్తించి, దానిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలని అమ్మాయిలకు చెబుతుంటాను. ఈ నెల పదిన జరిగే రేస్‌లో పాల్గొంటున్నాను. గెలుపు – ఓటమి, విజయం – అపజయం అని చింతించకుండా 100 శాతం శక్తినీ, సామర్థ్యాన్నీ వినియోగించి లక్ష్యాన్ని సాధించి, ఫలితాన్ని భగవంతునికే వదిలేయాలి. ఇంకో విషయం.. ఏదైనా కొత్తగా చేయడానికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసులోనైనా విజయం సాధించవచ్చు. మీకుండాల్సింది ధైర్యం మాత్రమే’’ అంటుంది ఇందు. -
ప్రపంచ బ్యాంక్‌లో మన తెలుగమ్మాయి
ఇందుది కృష్ణా జిల్లా పెనమలూరు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి గెస్ట్ లెక్చరర్. తల్లి గృహిణి. ఎం.ఎస్. చేయడం కోసం యూఎస్ వెళ్లింది. ప్రపంచ బ్యాంకు ఉద్యోగం తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివే మనస్తత్వం... స్పష్టమైన గమ్యం... లక్ష్యంపై ఏకాగ్రత... నిండైన ఆత్మవిశ్వాసం ఇందు సొంతం. తల్లిదండ్రులు మాధవి, సత్యనారాయణ. విజయవాడలో బీటెక్ పూర్తి చేసి, అమెరికాలో ఎం.ఎస్. పబ్లిక్ పాలసీ చేసింది. ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సాధించిన వైనాన్ని ఆమె ‘సాక్షి’తో వివరించింది. ► పర్యావరణ పరిరక్షణ ‘‘అమెరికాలో ఎం.ఎస్. చదివి అక్కడే ఉద్యోగం చేయాలని ఉండేది. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా వెళ్లాను. అక్కడికి వెళ్లిన తరువాత నా దృక్కోణం విస్తరించింది. ప్రపంచ స్థాయిలో మానవజాతిని ప్రభావితం చేయగల ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సంస్థల్లో పని చేయాలని నిర్ణయించుకున్నా. ‘యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్– మేసన్’లో ఎంఎస్, పబ్లిక్ పాలసీ కోర్సులో చేరాను. యూనివర్సిటీ స్థాయిలో అనేక అంశాలపై అధ్యయనం చేసి అమెరికాలోనే ప్రఖ్యాతి గాంచిన ప్రొఫెసర్ టిమ్ స్మీడింగ్ వద్ద నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను. యూనివర్సిటీ స్థాయిలో నేను ఇచ్చిన ప్రజెంటేషన్లు, పరిశోధనల ఆధారంగా ప్రపంచ బ్యాంకు ఉద్యోగం ఇచ్చింది. ► దక్షిణ ఆసియా వాతావరణం నాకు ఉద్యోగంలో దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వాతావరణ విభాగం బాధ్యతలను కేటాయించారు. వాతావరణ మార్పును అధ్యయనం చేసే నిపుణురాలిగా, జాయింట్ మల్టీ బ్యాంకు డెవలప్మెంట్ మధ్య సమన్వయకర్తగా, విధానాల రూపకల్పనలు, వాటికి సాంకేతికతను అన్వయించడం, అమలు చేయటం, వివిధ దేశాలలో ఉండవలసిన కచ్చితమైన వాతావరణ కాలుష్యం ప్రామాణికతల నిర్ణయం, సంబంధిత దేశాల వాతావరణ కాలుష్య కార్యక్రమాల్లో అమలు తేడాలను విశ్లేషించడం నా విధులు. వీటికి సంబంధించిన నివేదికల తయారీ, ఒప్పందాల అమలు పర్యవేక్షణ, సమావేశాల్లో చర్చించటం మా విభాగం నిర్వర్తించాల్సిన ప్రత్యేక విధులు. అమెరికా ప్రభుత్వం నాకు ప్రత్యేకంగా జీ4 వీసా జారీ చేసింది. విధులకు హాజరుకావాలని ప్రపంచ బ్యాంకు నుంచి ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే అమెరికాకు వెళ్లి విధుల్లో చేరాలి’’ అని చెప్పారు ఇందు కిలారు. సాధించిన విజయాలివి ► కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయి క్యాంపస్ ఇంజినీరు పరీక్షకు హాజరై రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఇందు ఒకరు. ► యూఎస్ యూనివర్సిటీలో ఏకగ్రీవంగా యూనిటీ అండ్ డైవర్సిటీ సంఘానికి ఏకగ్రీవంగా కోఆర్డినేటర్‌గా ఎన్నిక. ఆ బాధ్యతల్లో విదేశీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి. విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులకు మధ్య వారధిగా పనిచేసి మల్టీ టాస్కింగ్ విజర్డ్‌గా గుర్తింపు. ► క్రిసాలిస్ అనే ఎన్జీఓ సంస్థలో మేనేజ్మెంట్ బోర్డు అడ్వయిజర్‌గా సేవలు అందించడం. ► టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టీచ్ ఫర్ చేంజ్ సంస్థలకు సేవలు అందించడం. ► ఎం.ఎస్.లో అత్యుత్తమ గ్రేడ్స్ సాధించి మూడు సెమిస్టర్లలో రూ 65 లక్షల రూపాయల ఉపకార వేతనం పొందడం. ► విదేశీ విద్యార్థినిగా స్నాతకోత్సవ సభలో యూనివర్సిటీ ఫ్లాగ్ బేరర్‌గా ఎన్నిక. ఔట్‌స్టాండింగ్ స్టూడెంట్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ ఎంప్లాయ్‌గా గోల్డెన్ బ్రిక్ అవార్డు, బెస్ట్ పైరో ఫ్రైజ్ విన్నర్, బెస్ట్ పేపర్ ఇన్ సైన్స్ అండ్ పబ్లిక్ పాలిసీ పురస్కారం. ► ప్రతిష్ఠాత్మకమైన యూరోపియన్ యూనియన్ ప్రాజెక్టు. గ్లోబల్ వార్మింగ్‌పై అధ్యయనం ప్రపంచ బ్యాంకు టీమ్‌తో కలిసి దక్షిణ ఆసియా దేశాలలో గ్లోబల్ వార్మింగ్ తగ్గింపుపై ప్రత్యేక ప్రాజెక్టు రూపొందించాలి. ప్రధానంగా భారత్–పాకిస్థాన్ దేశాలలో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తాను. ఇండియన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గ్రౌండ్ లెవల్లో కూలింగ్ సొల్యూషన్స్‌పై సాంకేతికంగా పాలసీని రూపొందించి దాని అమలుకు కృషి చేస్తాను. ఉష్ణోగ్రతలు 1.5–2 డిగ్రీల వరకు తగ్గించగలిగితే వ్యవసాయం, ఆరోగ్యం, కార్మికులకు అనువైన వాతావరణం నెలకొంటుంది. – ఇందు కిలారు – పోలవరపు వాసుదేవ్, సాక్షి, పెనమలూరు, కృష్ణా జిల్లా. -
మిస్టరీ డెత్.. దమ్మాయిగూడ చౌరస్తాలో ఉద్రిక్తత..
-
టైమ్స్ గ్రూప్ ఛైర్పర్సన్ ఇందూ జైన్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: ఇటీవల మరణించిన టైమ్స్ గ్రూప్ ఛైర్పర్సన్ ఇందూ జైన్ సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొని ఇందూ జైన్‌కు నివాళులు అర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందూ జైన్(84) కరోనా మహమ్మరి బారినపడి ఈ నెల 13న కన్నుమూశారు. భారతదేశంలో మీడియా రంగంలో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1999లో గ్రూప్ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన జైన్, సంస్థ స్థాయిని పెంచడంలో కృషి చేశారు. 2000లో టైమ్స్ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో దేశంలోనే ఉత్తమ ఎన్జీవోగా తీర్చిదిద్దారు. 1983లో ఏర్పాటైన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) వ్యవస్థాపక ప్రెసిండెంట్‌గా వ్యవహరించారు. భారతీయ భాషా సాహిత్యాభివృద్ధిని కాంక్షిస్తూ తన మామ సాహు శాంతి ప్రసాద్ జైన్ స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ ట్రస్ట్‌కు 1999 నుంచి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్ ఏటా జ్ఞానపీఠ అవార్డులను అందజేస్తుంటుంది. 2016లో కేంద్రం ఆమెను పద్మ భూషణ్‌తో సత్కరించింది. 84 ఏళ్ల ఇందూ జైన్ మీడియా ప్రపంచంలోనే కాకుండా, అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. చదవండి: Cyclone Yaas: ఉత్తరాంధ్ర కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష ఉచిత పంటల బీమా నగదు జమ చేసిన సీఎం జగన్ -
బుల్లితెర యాంకర్ ఇందు ఫోటోలు
-
శివరాత్రి కానుకగా ‘చీమ- ప్రేమ మధ్యలో భామ’
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటిది శివుడికి ఎంతో ఇష్టమైన రోజు ‘మహాశివరాత్రి’ పర్వదినాన మా చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు నిర్మాత ఎస్.ఎన్. లక్ష్మీనారాయణ. మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘చీమ - ప్రేమ మధ్యలో భామ!’. అమిత్, ఇందు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘మహాశివరాత్రి కానుకగా మా చిత్రం ‘చీమ- ప్రేమ మధ్యలో భామ’ విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈనాటి యువతీయువకులు ప్రేమ విషయంలో ఎంత పరిణితితో ఉన్నారో తెలియచెప్పే చిత్రం ఇది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా అన్నిపరీక్షలకు అతీతంగానే ఉంటుందని తెలియజేసేందుకు మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. అందరూ ఈ సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదించగలరని కోరుతున్నాము.’ అని అన్నారు. సుమన్, హరిత, పురంధర్, వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్, కిషోర్ రెడ్డి, వెంకటేశ్, సురేష్ పెరుగు తదితరులు నటించిన ఈ చిత్రానికిరవి వర్మ సంగీతం అందించారు. -
స్వచ్ఛమైన ప్రేమ
అమిత్, ఇందు జంటగా నటించిన చిత్రం ‘చీమ ప్రేమ మధ్యలో భామ’. మాగ్నమ్ ఓపస్ ఫిలింస్ పతాకంపై శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్.ఎన్ లక్ష్మీనారాయణ నిర్మించారు. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘చిన్న సినిమాల్లో మా సినిమా స్పెషల్. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు దర్శకుడు. ‘‘ప్రస్తుతం యువతీ యువకులు ప్రేమవిషయంలో ఎంత పరిణతితో ఉన్నారో చూపే చిత్రమిది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా ఉంటుందని చెబుతున్నాం. మా సినిమా అన్ని వర్గాలవారికి నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత. ‘‘మంచి పాత్ర చేశా’’ అన్నారు అమిత్. -
హీరో చీమ
అమిత్, ఇందు జంటగా శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పల రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీమ– ప్రేమ మధ్యలో భామ’. ఎస్ఎన్ లక్ష్మీనారాయణ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులో విడుదల కానున్న ఈ చిత్రం గురించి శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో చీమే హీరో. అలా అని ఈ చిత్రం చిన్న పిల్లలకు ప్రత్యేకం అని చెప్పలేం. ఈ సినిమా అందరి కోసం... కాకపోతే కొంచెం ఎక్కువ మహిళల కోసం’’ అన్నారు. ‘‘మా సినిమాకి ఎటువంటి సెన్సార్ కట్స్ లేకుండా విడుదలకు అనుమతి లభించింది. విలువలకు ప్రాధాన్యతనిస్తూ తీసిన వినూత్నమైన సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు లక్ష్మీనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని. -
అంతఃకరణ శుద్ధితో...
అమిత్, ఇందు జంటగా చీమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చీమ ప్రేమ మధ్యలో భామ!’. శ్రీకాంత్ శ్రీ అప్పల రాజు దర్శకత్వంలో ఎస్ఎన్ లక్ష్మీనారాయణ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘‘మా సినిమాకి చీమే హీరో. అంతఃకరణ శుద్ధితో అడుగు ముందుకు వేస్తే ఏదైనా సాధ్యమే, ఎవరేం కావాలనుకున్నా కావచ్చనే అంతర్లీన సందేశంతో ఈ సినిమా రూపొందించాం. ఈ చిత్రం హీరో ప్రభాస్‌గారి అభిమానులకు ప్రత్యేకంగా నచ్చుతుంది.. అది ఎందుకో తెలియాలంటే విడుదల వరకూ ఆగాలి’’ అన్నారు శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు. ‘‘ఫ్యాంటసీతో కూడిన ప్రేమ కథ ఇది’’ అన్నారు లక్ష్మీనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని. -
చీమ ప్రేమకథ
అమిత్, ఇందులను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీమ– ప్రేమ మధ్యలో భామ!’. లక్ష్మీ నారాయణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్లో విడుదలకానుంది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో చీమ హీరోగా వస్తున్న మొదటి చిత్రమిది. అలాగని పూర్తి యానిమేషన్ చిత్రం కాదు. అందరూ చూడదగ్గ మంచి కుటుంబ కథా చిత్రం’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్ చూసి, రాజమౌళిగారి ‘ఈగ’ను మా చీమతో పోల్చాడం గొప్ప ప్రశంసగా భావిస్తున్నాం. ‘ఈగ’ది ప్రతీకారం. మా చీమది ప్రేమకథ’’ అన్నారు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు. సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని. -
బాలు పాట హైలైట్
అమిత్, ఇందు, సుమన్, హరిత ముఖ్య తారలుగా శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చీమ–ప్రేమ.. మధ్యలో భామ’. చీమ ప్రధాన పాత్రలో కనిపించే ఈ చిత్రాన్ని మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్‌పై లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘ఈగ’ సినిమా మాకు స్ఫూర్తి. చీమ పాత్రని అపురూపంగా మలచిన తీరుకు అద్దం పట్టేలా ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు టైటిల్ సాంగ్‌ని అద్భుతంగా ఆలపించారు. రవివర్మగారి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాట పదికాలాలు అందర్నీ అలరిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని. -
పలికెడిది ప్రతి వస్తువూనట! పలికించునది ఇందుశ్రీ అట
వెంట్రిలాక్విజమ్ మంచి కెరీర్. ఈ ఫీల్డులో అబ్బాయిలే ఉంటారని, అమ్మాయిలు రాకూడదని ఏ నిబంధనలూ లేవు. షోలు ఇస్తూనే ప్రస్తుతం నేను బెంగళూరులో ఎంఎస్ కమ్యూనికేషన్స్, బీఎఫ్ఏ కోర్సు చేస్తున్నాను. ఆసక్తి అమ్మాయిలకు, అబ్బాయిలకు వెంట్రిలాక్విజం నేర్పిస్తున్నాను. – ఇందుశ్రీ ఇందుశ్రీ వెంట్రిలాక్విస్ట్. ఊహు.. ఈ మాట సరిపోదు. అంతర్జాతీయ వెంట్రిలాక్విస్ట్. ఈ మాట కూడా! ఇండియాలో మొట్ట మొదటి మహిళా వెంట్రిలాక్విస్ట్. ఎస్. ఈ మాట కరెక్ట్. ఈ ఏడాది జనవరి 20న న్యూఢిల్లీలో తొలి భారతీయ ఉమన్ వెంట్రిలాక్విస్ట్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఇందుశ్రీ ‘ఇండియన్ ఉమెన్ అచీవర్స్’అవార్డు అందుకున్నారు. ఈ నెల 26, 27 తేదీలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఉత్సాహవంతులైన యువతీయువకుల కోసం రవీంద్రభారతిలో నిర్వహించిన శిక్షణా శిబిరాలకు వచ్చి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’ ఇందుశ్రీని పలకరించింది. ఆ విశేషాలివి. రెండేళ్ల వయసుకే ‘పట్టు’! ఇందుశ్రీ బెంగుళూరు అమ్మాయి. రెండేళ్ల వయస్సులో టీవీలో వెంట్రిలాక్విజమ్ చూసి, మాట్లాడే ఆ బొమ్మ కావాలని పట్టుపట్టింది. తర్వాత కొన్నాళ్లు మ్యూజిక్‌లో పడిపోయి, తిరిగి వెంట్రిలాక్విజమ్లోకి షిఫ్ట్ అయ్యారు ఇందుశ్రీ. ఆమెకు ఆ కళను ఎవ్వరూ నేర్పలేదు. తనకు తానుగా ఆడియో, వీడియోల్లో నేర్చుకొంటూ సాధన చేస్తూ వచ్చారు! ఇష్టం కాబట్టి.. కష్టమనిపించలేదు వెంట్రిలాక్విజంలో ఆర్టిస్టుగా నిలదొక్కుకోడానికి రేయింబవళ్లు కష్టపడ్డారు ఇందుశ్రీ. స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడం, బొమ్మలు తయారు చేసుకోవటం పెద్ద పనులు. బొమ్మల తయారీలో, ఎంపికలో మొదటి నుంచి ఆమె తండ్రి రవీంద్ర సహకారం అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడు తమ్ముడు లకితేష్, భర్త అశ్వత్ భేరి చేదోడుగా ఉంటున్నారు. ఇందులో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ, వాటిని నెగ్గుకుని వచ్చారు ఇందుశ్రీ. లైవ్‌లో డాగ్ వెంట్రిలాక్విజమ్! బహుశా ఎవ్వరూ ఈ తరహా ప్రదర్శన చేసి ఉండరు. ఇందుశ్రీ చేశారు! బెంగళూరులో సోనీ, స్టార్, సీఎన్ఎన్ టీవీల్లో కుక్క బొమ్మతో కాకుండా, నిజంగా కుక్కతోనే వెంట్రిలాక్విజమ్ షో చేశారు. ముంబైలో అయితే ‘ఇండియా హ్యాజ్ గాట్ టాలెంట్ షో’లో ఒకేసారి నాలుగు బొమ్మలతో .. (రెండు చేతుల్లో రెండు, రెండు కాళ్లతో రెండు) వెంట్రిలాక్విజమ్ చేశారు. ఒకోసారి ఆ ఈవెంట్‌ను ఎలా చేయగలిగానా అనిపిస్తుందట. అభిమానులూ ఉన్నారు 2016లో బెంగళూరులో నారాయణ హృదయాలయంలో ఓ చిన్నారికి హార్ట్ ఆపరేషన్‌కు తేదీ నిర్ణయించారు డాక్టర్లు. కానీ ఆ చిన్నారి ఆపరేషన్‌కు రాను అంది. డాక్టర్లు కారణం అడిగారు. ‘‘ఇందుశ్రీ అక్క వెంట్రిలాక్విజమ్ ప్రోగ్రామ్ ఉంది. చూడాలి అంది. డాక్టర్లు విస్తుపోయారు. ఇది తెలిసిన ఇందుశ్రీ వండర్ అయ్యారు. 22 ఏళ్లు.. 3,500 షోలు బెంగళూరు సిటీకేబుల్‌లో ప్రోగ్రామ్స్‌తో పాటు, బయట 3,500 పై షోలు చేశారు ఇందుశ్రీ. వెంట్రిలాక్విజమ్‌లో 22 ఏళ్ల జర్నీ ఆమెది. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్ లాంటి 16 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. టీ కప్పు, పుస్తకంతో కూడా మాట్లాడించగలిగారు. అలా అన్ని వస్తువులతో మాట్లాడించాలన్నదే ఆమె ఆశయం. – కోన సుధాకర్ రెడ్డి, ‘సాక్షి’ సిటీ -
ఇందు...ఎందుకమ్మా ఇలా చేశావ్...!
ఇరవై ఏళ్ల ప్రాయం..వివాహం నిశ్చయమై మార్చి 20న పెళ్లి పీఠలు ఎక్కాల్సిన యువతి. తల్లిదండ్రులు కుమార్తె వివా హం కోసం ఏర్పాట్లు చేసుకుంటుంటే...యువతి మాత్రం తన వివాహం కోసం ఉన్న పొలమంతా అమ్మేస్తే కన్నవారి జీవనం ఎలాగంటూ మదనపడ సాగింది. తన తరువాత ఉన్న చెల్లి వివాహం ఎలా చేస్తారని ఆలోచించింది. ఆ ఆలోచనలో తీవ్ర మనస్తాపానికి గురైంది. తన చెల్లి పెళ్ళి చేయాలన్నా...తల్లిదండ్రులు ఉన్నంతలో సంతోషంగా జీవి ంచాలన్నా...తన చావే పరి ష్కారమనుకుంది. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృ దయ విదారక ఘటన రామభద్రపురం మండలం శిష్టు సీతారాంపురంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... రామభద్రపురం: మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీఠలెక్కి వధువు కావాల్సిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కన్నవారి జీవనం, తోబుట్టువు వివాహం కోసం ఆలోచించసాగింది. తన మరణంతోనే తోబుట్టువు పెళ్లి, కన్నవారి జీవనం సాగుతుందని ఆలోచించి పురుగుల మందు తాగేసింది. మండలంలోని శిష్టుసీతారాంపురం గ్రామానికి చెందిన శిష్టు ఇందు(20) అనే యువతి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... శిస్టు సీతారాంపురం గ్రామానికి చెందిన శిష్టు తిరుపతికి ముగ్గురు కుమార్తెలు. పెద్దమ్మాయికి ఏడాది కిందట తన పొలంలో కొంత భాగాన్ని విక్రయించి వివాహం చేశారు. రెండవ అమ్మాయి ఇందు. ఈమెకు ఇటీవలె వివాహం నిÔశ్చయమైంది. పొలంలో మిగిలిన భూమిని విక్రయించి వివాహం చేయాలని తల్లిదండ్రులు అనుకోవడంతో ఉన్నదంతా తన వివాహం కోసం అమ్మేస్తే చెల్లి ఉంది తరువాత ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో మనస్తాపానికి గురైంది. గురువారం సాయంత్రం క్రిమిసంహారక మందు తాగింది. తల్లిదండ్రులు పొలం పనులు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి కుమార్తె వాంతులు చేసుకుంటుండం గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులు బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయింది. మార్చి 20న వివాహం జరపవలసిన కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. చెల్లి పెళ్లి కోసం...తల్లిదండ్రుల జీవనం కోసం ఆలోచించి ఇందు చేసిన ఈ ప్రయత్నంతో కుటుంబ సభ్యులు గొల్లుమంటున్నారు. మా కోసం ఎందుకమ్మా! ఇలా చేశావ్...అంటూ రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఏఎస్ఐ రమణమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డ బరువైపోయింది.. బావిలో పడేసింది
ఓ కన్నతల్లి ఘాతుకం చీపురుపల్లి: నవ మాసాలు మోసింది. ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇంతలోనే భర్త ఆమెను వదిలేశాడు. ‘అసలే ఆడపిల్ల. ఆపైన అనారోగ్యంతో ఎదుగుబొదుగు లేని శరీరం. అత్తారింటి ఆదరణ లేదు.. కన్నవారికీ భారంగా మారాను..’ అనుకుందో, మరేమనుకుందో కానీ ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి రామాంజనేయకాలనీకి చెందిన టేకు ఇందు అనే మహిళ తన ఏడాదిన్నర పాప జ్యోత్స్నను మంగళవారం రాత్రి బావిలో పడేసింది. వెంటనే పాపను బావిలో పడేశానంటూ కేకలు పెట్టింది. దీంతో అక్కడికి చేరుకున్న ఇందు తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేయనున్నట్టు పట్టణ ఎస్ఐ ఎం.నాగేశ్వరరావు తెలిపారు. అర్ధరాత్రి వరకు పాపను బయటకు వెలికి తీయలేదు. తాను పుట్టింటికి, పాప తనకు భారంగా మారిన పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వచ్చిందని ఇందు చెప్పింది.