
సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో నూతన నటుడు అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000 వాలా. టెన్ రూపీస్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది.
అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా లో అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియా లో వచ్చిన స్పందన చూసి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ "మా 1000 వాలా చిత్రం ఫస్ట్ లుక్ సోషల్ మీడియా ప్రేక్షకులను ఆకట్టుకుంది. లైక్స్ మరియు కామెంట్స్ చూసి మా సినిమా తప్పక విజయం సాధిస్తుంది అని నమ్మకం కలిగింది. షూటింగ్ అంత పూర్తి అయింది. ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment