
పాడేరు: పెదబయలు ఏరియా కమిటీకి చెందిన నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది మిలీíÙయా సభ్యులు మంగళవారం పాడేరులో జిల్లా ఎస్పీ అమిత్‌బర్ధర్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఆ వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. పలు నేరాలకు పాల్పడిన మిలీషియా సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు నిర్ణయించుకున్నట్టు ఎస్పీ తెలిపారు.
లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా రావాల్సిన అన్ని రాయితీలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. లొంగిపోయిన వారిపై ఎలాంటి కేసులుండవని స్పష్టం చేశారు. పాడేరు ఏఎస్పీ ధీరజ్, సీఆరీ్పఎఫ్ 198 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ కె.ధారియన్ రాజు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment