చీమ మనిషిగా మారితే...! | cheema prema madhyalo bhama released on september | Sakshi
Sakshi News home page

చీమ మనిషిగా మారితే...!

Published Tue, Aug 27 2019 12:37 AM | Last Updated on Tue, Aug 27 2019 12:37 AM

cheema prema madhyalo bhama released on september - Sakshi

ఇందు, అమిత్

మనిషిలా మారాలని ఓ చీమ తాపత్రయపడుతుంది. అసలు.. అది సాధ్యమా? ఒకవేళ కుదిరితే ఆ చీమకు ప్రేమ, శృంగారం ఫీలింగ్స్‌ కలిగితే ఎలా ఉంటుంది? అనే అంశాలతో ‘చీమ – ప్రేమ మధ్యలో భామ’ అనే చిత్రం తెరకెక్కింది. అమిత్, ఇందు హీరోహీరోయిన్లుగా నటించారు. మాగ్నస్‌ ఓపస్‌ ఫిలిమ్స్‌ పతాకంపై శ్రీకాంత్‌ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్‌.ఎన్‌. లక్ష్మీనారాయణ నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘ఇది ఓ యువజంట ప్రేమకథ. కుటుంబ విలువలతో, కామెడీ సన్నివేశాలతో ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించాం.  యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సంగీతం, గ్రాఫిక్‌ వర్క్స్‌ హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు. ‘‘మా చిత్రంలో చీమ ప్రధాన ఆకర్షణ . ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంగారు, గీతామాధురి పాడిన పాటలు హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు లక్ష్మీనారాయణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement