యువతకు సందేశం | gunde movie updates | Sakshi
Sakshi News home page

యువతకు సందేశం

Published Sat, Feb 16 2019 2:19 AM | Last Updated on Sat, Feb 16 2019 2:19 AM

gunde movie updates - Sakshi

ఇందు, ఓఎస్‌. సంగీత్

ఓఎస్‌. సంగీత్, ఇందు జంటగా రాజేష్‌ దర్శకత్వంలో ఎ.బాబురావు, మీసాల విజయ్‌ నిర్మించిన చిత్రం ‘గుండె’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాజేష్‌ మాట్లాడుతూ– ‘‘యువతారానికి కనెక్ట్‌ అయ్యే స్టోరి ఇది. ప్రేక్షకులు అద్భుతమైన ప్రేమకథను చూడబోతున్నారు. మంచి ఫీల్‌గుడ్‌ మూవీ చూశామన్న అనుభూతి కలుగుతుంది. మంచి సందేశం కూడా ఉంది సినిమాలో’’ అని అన్నారు. ‘‘మాకు కథను ఏ విధంగా చెప్పాడో దానికి రెట్టింపు తెరమీద చూపించబోతున్నారు రాజేష్‌. యూత్‌ని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమాకు ‘గుండె’ అనే టైటిల్‌ పెట్టాం. ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా మెచ్చే ఎంటర్‌టైనింగ్‌ చిత్రమిది. త్వరలో ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా పాటలను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు బాబురావు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement