indhu
-
Indhu Rubasingham: రంగస్థల సింగం
‘అమ్మాయిలు నటించడం ఏమిటి?’ అనే ఆశ్చర్యం నుంచి రంగస్థలానికి వెలుగులు అద్దిన ప్రసిద్ధ నటీమణుల వరకు ఎంతో చరిత్ర ఉంది. రంగస్థలానికి సంబంధించిన చరిత్రలో మరో విశిష్టమైన పేరు ఇందు. లండన్‌లోని ప్రసిద్ధ రాయల్ నేషనల్ థియేటర్‌కు ఇందు రుబసింగంను ఆర్టిస్టిక్ డైరెక్టర్, జాయింట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించారు. 60 సంవత్సరాల చరిత్ర ఉన్న నేషనల్ థియేటర్‌కు మహిళా దర్శకురాలిని ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా నియమించడం ఇదే తొలిసారి.... ఇందు తల్లిదండ్రులు ఇంగ్లాండ్‌లో సిర్థపడిన శ్రీలంక తమిళులు. నాటింగ్హమ్ సిటీలోని నాటింగ్హమ్ గర్ల్స్ హైస్కూల్ లో విద్యాభ్యాసం చేసింది ఇందు. హల్ యూనివర్శిటీలో థియేటర్ ఆర్ట్స్‌లో డాక్టరేట్ చేసింది. థియేటర్ రాయల్, స్ట్రాట్ఫర్డ్ ఈస్ట్‌లో ట్రైనీ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తరువాత ఫ్రీలాన్స్ థియేటర్ డైరెక్టర్ గా పది సంవత్సరాలకు పైగా పనిచేసింది. ఫ్రీలాన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కాలంలోనే లండన్‌లోని ‘గేట్ థియేటర్’లో అసోసియేట్ డైరెక్టర్‌గా నియామకం అయింది. లండన్‌లోని కిల్న్ థియేటర్‌కు ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా నియామకం కావడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది ఇందు. గతంలో ఈ థియేటర్ శ్వేతజాతీయుల ఆధ్వర్యంలోనే నడిచేది. శ్వేతజాతేతర మహిళా దర్శకురాలు ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా నియామకం కావడం ఇదే తొలిసారి. కిల్న్ థియేటర్ నిర్వహణలో ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’ గా తనదైన ముద్ర వేసింది ఇందు. ఆడిటోరియంను ఆధునీకరించి సీట్ల సంఖ్యను పెంచింది. కొత్త సౌకర్యాలు మాత్రమే కాదు కొత్త నాటకాన్ని థియేటర్‌కు పరిచయం చేసింది. ‘రెడ్ వెల్వెట్’‘హ్యాండ్ బ్యాగ్డ్’ ‘వెన్ ది క్రౌస్ విజిట్’ ‘ఏ వోల్ఫ్ ఇన్ స్నేక్స్కిన్ షూస్’...మొదలైన నాటకాలు డైరెక్టర్‌గా ఇందుకు మంచి పేరు తెచ్చాయి. ది ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్, ఏషియన్ ఉమెన్ ఆఫ్ ఎచీవ్మెంట్ అవార్డ్, లిబర్టీ హ్యుమన్ రైట్స్ అవార్డ్... మొదలైన ఎన్నో అవార్డ్లు అందుకుంది. ‘నాటకరంగాన్ని వినోద మాధ్యమానికి పరిమితం చేయకూడదు. మార్పు తెచ్చే శక్తి నాటకానికి ఉంది. ప్రజలను ఒక దగ్గరకు తీసుకువచ్చి అభిప్రాయాలు పంచుకునేలా, ఆలోచించేలా చేస్తుంది’ అంటుంది ఇందు. కొత్తదనం నిండిన నాటకాలకు ఇందు ప్రాధాన్యత ఇస్తుంది. మానవ సంబంధాలను విభిన్న కోణాల నుంచి విశ్లేషించే నాటకాలను ఎంపిక చేసుకుంటుంది. బీబీసీ రేడియో 4, బీబీసీ రేడియో 3, బీబీసి వరల్డ్ సర్వీస్‌కు సంబంధించి రేడియో నాటికలకు కూడా దర్శకత్వం వహించింది. నేషనల్ థియేటర్ లో ‘ది వెయిటింగ్ రూమ్’ ‘ది రామాయణ’ అనుపమ చంద్రశేఖర్ ‘ది ఫాదర్ అండ్ ది అసాసిన్’ నాటకాలకు దర్శకత్వం వహించింది. ‘ది ఫాదర్ అండ్ ది అసాసిన్’కు బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డ్ అందుకుంది. కొత్త రచయితలను, నటులను ప్రోత్సహించడంలో ప్రపంచ రంగస్థలానికి పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది ఇందు. ‘ఇందు నేషనల్ డైరెక్టర్‌గా నియామకం కావడం సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్‌గా, లీడర్‌గా ఆమె అంటే అపారమైన అభిమానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే నాటకాలు రావడానికి, నాటకరంగాన్ని స్ఫూర్తిదాయక శక్తిగా మలిచే విషయంలో ఆమె కొత్త అధ్యయనాన్ని మొదలు పెడతారని ఆశిస్తున్నాను’ అంటుంది నేషనల్ థియేటర్ డైరెక్టర్ కేట్ వరహ్. ‘ఆర్టిస్టిక్ డైరెక్టర్’గా తన నియామకంపై స్పందిస్తూ... ‘నేషనల్ థియేటర్ నా జీవితంలో ముఖ్యపాత్ర పోషించింది. ఇదొక అత్యున్నత గౌరవంగా భావిస్తున్నాను. నాకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అత్యున్నత బాధ్యత’ అంటుంది ఇందూ రుబసింగం. కొత్త రెక్కలతో... రంగస్థలం అనేది ఒకచోట, ఒకేకాలంలో ఉండిపోదు. కాలంతో పాటు కదులుతుంది. కాలాన్ని ప్రతిబింబిస్తుంది. రంగస్థలానికి ఆలోచనాపరులను ఒకే వేదిక మీదికి తీసుకువచ్చే శక్తి ఉంది. మానవసంబంధాల నుంచి అస్తిత్వ పోరాటాల వరకు ఎన్నో అంశాలకు నాటకం అద్దం పడుతుంది. సాంకేతిక పరంగానే కాదు ఇతివృత్త పరంగా కూడా నాటక రంగం కొత్త దారిలో వెళుతుంది. రంగçస్థల ప్రపంచంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి. కొత్త ఆలోచలకు రెక్కలు వస్తున్నాయి. – ఇందు రుబసింగం, రంగస్థల దర్శకురాలు -
ఇందు మృతి కేసులో కొనసాగుతున్న పోలిసుల దర్యాప్తు
-
చిన్నారి మృతిపై వీడని మిస్టరీ.. తల్లిదండ్రుల ఫోన్లు స్వాధీనం!
సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పాప మృతికి గల కారణాలపై మిస్టరీ వీడలేదు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో విచారిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చిన్నారి ఇందుకు ఇవాళ(శనివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాప మృతికి గల అసలు కారణాలను వెలికి తీసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేస్తున్న క్రమంలో దమ్మాయిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరగకుండా దమ్మాయిగూడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం చెరువు నీటిని సైతం పరీక్షలకు పంపించినట్లు సమాచారం. అలాగే.. గంజాయి సెవిస్తూ విచ్చలవిడిగా తిరిగే కొందరు అనుమానితులను సైతం జవహార్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక, సైంటిఫిక్ ఆధారాలతోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: బాలిక మిస్సింగ్ విషాదాంతం.. చెరువులో మృతదేహం లభ్యం -
చీమ మనిషిగా మారితే...!
మనిషిలా మారాలని ఓ చీమ తాపత్రయపడుతుంది. అసలు.. అది సాధ్యమా? ఒకవేళ కుదిరితే ఆ చీమకు ప్రేమ, శృంగారం ఫీలింగ్స్ కలిగితే ఎలా ఉంటుంది? అనే అంశాలతో ‘చీమ – ప్రేమ మధ్యలో భామ’ అనే చిత్రం తెరకెక్కింది. అమిత్, ఇందు హీరోహీరోయిన్లుగా నటించారు. మాగ్నస్ ఓపస్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్.ఎన్. లక్ష్మీనారాయణ నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఇది ఓ యువజంట ప్రేమకథ. కుటుంబ విలువలతో, కామెడీ సన్నివేశాలతో ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించాం. యూత్ అండ్ ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సంగీతం, గ్రాఫిక్ వర్క్స్ హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు. ‘‘మా చిత్రంలో చీమ ప్రధాన ఆకర్షణ . ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, గీతామాధురి పాడిన పాటలు హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు లక్ష్మీనారాయణ. -
యువతకు సందేశం
ఓఎస్. సంగీత్, ఇందు జంటగా రాజేష్ దర్శకత్వంలో ఎ.బాబురావు, మీసాల విజయ్ నిర్మించిన చిత్రం ‘గుండె’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ– ‘‘యువతారానికి కనెక్ట్ అయ్యే స్టోరి ఇది. ప్రేక్షకులు అద్భుతమైన ప్రేమకథను చూడబోతున్నారు. మంచి ఫీల్‌గుడ్ మూవీ చూశామన్న అనుభూతి కలుగుతుంది. మంచి సందేశం కూడా ఉంది సినిమాలో’’ అని అన్నారు. ‘‘మాకు కథను ఏ విధంగా చెప్పాడో దానికి రెట్టింపు తెరమీద చూపించబోతున్నారు రాజేష్. యూత్‌ని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమాకు ‘గుండె’ అనే టైటిల్ పెట్టాం. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెచ్చే ఎంటర్టైనింగ్ చిత్రమిది. త్వరలో ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా పాటలను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు బాబురావు. -
కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా..
ఇరవై ఏళ్ల ప్రాయం.. వివాహం నిశ్చయమై మార్చి 20న పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి. తల్లిదండ్రులు కుమార్తె వివాహం కోసం ఏర్పాట్లు చేసుకుంటుంటే...యువతి మాత్రం తన వివాహం కోసం ఉన్న పొలమంతా అమ్మేస్తే కన్నవారి జీవనం ఎలాగంటూ మదనపడ సాగింది. తన తరువాత ఉన్న చెల్లి వివాహం ఎలా చేస్తారని ఆలోచించింది. ఆ ఆలోచనలో తీవ్ర మనస్తాపానికి గురైంది. తన చెల్లి పెళ్ళి చేయాలన్నా...తల్లిదండ్రులు ఉన్నంతలో సంతోషంగా జీవించాలన్నా...తన చావే పరిష్కారమనుకుంది. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన రామభద్రపురం మండలం శిష్టు సీతారాంపురంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం(రామభద్రపురం): మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కి వధువు కావాల్సిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్ప డింది. కన్నవారి జీవనం, తోబుట్టువు వివాహం కోసం ఆలోచించసాగింది. తన మరణంతోనే తోబుట్టువు పెళ్లి, కన్నవారి జీవనం సాగుతుందని ఆలోచించి పురుగుల మందు తాగేసింది. మండలంలోని శిష్టుసీతారాంపురం గ్రామానికి చెందిన శిష్టు ఇందు(20) అనే యువతి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... శిష్టుసీతారాంపురం గ్రామానికి చెందిన శిష్టు తిరుపతికి ముగ్గురు కుమార్తెలు. పెద్దమ్మాయికి ఏడాది కిందట తన పొలంలో కొంత భాగాన్ని విక్రయించి వివాహం చేశారు. రెండవ అమ్మాయి ఇందు. ఈమెకు ఇటీవలె వివాహం నిశ్చయమైంది. ఉన్న పొలంలో మిగిలిన భూమిని విక్రయించి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించడంతో ఉన్నదంతా తన వివాహం కోసం అమ్మేస్తే చెల్లి ఉంది తరువాత ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో ఇందు మనస్తాపానికి గురైంది. గురువారం సాయంత్రం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. తల్లిదండ్రులు పొలం పనులు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి కుమార్తె వాంతులు చేసుకుంటుండం గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులు బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయింది. మార్చి 20న వివాహం జరపవలసిన కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చెల్లి పెళ్లి కోసం, తల్లిదండ్రుల జీవనం కోసం ఆలోచించి ఇందు చేసిన ఈ ప్రయత్నంతో కుటుంబ సభ్యులు గొల్లుమంటున్నారు. మా కోసం ఎందుకమ్మా! ఇలా చేశావ్...ఇందు అంటూ రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఏఎస్ఐ రమణమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగకు వెళుతూ.. పరలోకాలకు..
రాఘవాపురం(పాలకుర్తి) : తండాలో జరుగుతున్న పండుగకు వెళుతూ ఇద్దరు మృత్యు ఒడికి చేరారు. కారు అదుపుతప్పి బోల్తాపడడంతో కానరానిలోకాలకు చేరారు. ఈ సంఘటన పాలకుర్తి -హన్మకొండ రహదారిపై రాఘవాపురం స్టేజీ సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రాయపర్తి మండలం కేశవాపురం గ్రామ శివారు పీతల తండాకు చెందిన మాలోతు స్వరూప, మాలోతు యాకూబ్ దంపతులు కాజీపేట ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఇదే తండాకు చెందిన మాలోత్ రాము(32), రజిత దంపతులు కాజీపేటలోని ఫాతిమానగర్‌లో ఉంటున్నారు. యూకూబ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా, రాము కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పాలకుర్తి మండలం బమ్మెర శివారు ఎల్లమ్మగడ్డ తండాలో స్వరూప తల్లిగారింట్లో పండుగ చేసుకుంటుండడంతో ఆమె భర్త యూకూబ్, కుమార్తెలు ఇందూ(6), బిందుతో కలిసి రాము కారును అద్దెకు మాట్లాడుకుని బయల్దేరారు. ఈ క్రమంలో రాఘవాపురం గ్రామం స్టేజీ దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొని బోల్తాపడింది. దీంతో తీవ్రగాయూలపాలైన డ్రైవర్ రాము(32)తోపాటు చిన్నారి ఇందూ(6) సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మృతుడు రాముకు కొన్నాళ్ల క్రితమే వివాహ మైందని, అతడి భార్య ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని బంధువులు తెలిపారు. అలాగే స్వరూప, యాకూబ్, వారి చిన్నకూతురు మాలోతు బిందుకు తీవ్ర గాయాలయ్యూరుు. వారిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎల్లమ్మగడ్డ తండా వాసులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. రాము, ఇందూ మృతితో ఎల్లమ్మగడ్డ తండా, పీతల తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని పాలకుర్తి సీఐ తిరుపతి, ఎస్సై ఉస్మాన్ షరీఫ్ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.