టోక్యో: ఒలింపిక్స్‌లో భారత మహిళా బాక్సర్ లవ్లినా బోర్గోహైన్ సంచలనం సృష్టించింది. అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఎలాంటి అంచనాలు లేకుండానే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. తాజాగా 69 కేజీల విభాగంలో పోటీపడిన లవ్లీనా సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో మాజీ వరల్డ్ చాంపియన్.. చైనీస్ తైపీ ప్లేయర్ చెన్ నైన్ చిన్‌పై 4-1 తేడాతో ఆమె ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో లవ్లీనా బాక్సింగ్ విభాగంలో కనీసం క్యాంస్యం పతకం గెలుచుకునే అవకాశం లభించింది.
సెమీస్‌లో ఒకవేళ లవ్లీనా ఓడినా.. క్యాంసం దక్కడం ఖాయం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లవ్లీనా మూడు రౌండ్లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రౌండ్‌లో 3:2 తో ఆధిక్యంలో ఉండగా.. రెండో రౌండ్‌లో మొత్తం ఐదుగురు జడ్జీలు లవ్లీనాకే 10 స్కోరు ఇచ్చారు. ఇక మూడో రౌండ్‌లో నలుగురు లవ్లీనా వైపే మొగ్గారు. దీంతో ఆమె 4-1తో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక ఆగస్టు 4న జరగనున్న సెమీఫైనల్లో టర్కీకి చెందిన సుర్మెనెలి బుసెనాజ్‌తో తలపడనుంది.
కిక్ బాక్సర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి..
1997 అక్టోబర్ 2న అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో టికెన్- మామోని దంపతులకు లవ్లీనా బోర్గోహైన్ జన్మించింది. లవ్లీనాకు కవలలైన ఇద్దరు అక్కలు ఉన్నారు. లవ్లీనా తండ్రి టికెన్ బోర్గోహైన్ ఒక చిన్న వ్యాపారి. టికెన్‌కు ఎన్ని ఆర్థిక కష్టాలు ఎదురైనా తన ముగ్గురు కూతుళ్లను బాక్సర్లుగా తయారు చేయాలనే పట్టుదలను మాత్రం వదల్లేదు. ఆయన కోరికకు తగ్గట్టే లిచా, లిమాలు కిక్ బాక్సింగ్‌లో నేషన్‌ల్ లెవల్ పోటీల్లో పాల్గొన్నారు. అయితే వివాహం తర్వాత వారిదరు బాక్సింగ్‌ను పక్కనపెట్టారు. అయితే లవ్లీనా మాత్రం కిక్ బాక్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినా కొంతకాలానికి బాక్సింగ్‌లో అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అందులోకి మారింది.
2011లో లవ్లీనా బర్తాపూర్ బాలిక పాఠశాలలో చదువుతున్నప్పుడు బాక్సింగ్ ఈవెంట్‌లో పాల్గొని గెలుపొందింది. ఈ విజయంతో ఆమె తొలిసారి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టిలో పడింది. ఆ తర్వాత భారత బాక్సింగ్స్ వుమెన్స్ చీఫ్ కోచ్ శివ్ సింగ్ వద్ద ఆమె కోచింగ్ తీసుకుంది. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో దేశానికి పతకం అందించునున్న మూడో బాక్సర్‌గా లవ్లీనా నిలవనుంది. ఇంతకముందు 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ బాక్సింగ్ విభాగం నుంచి క్యాంస్యం గెలుపొందారు. ఇక 69 కేజీల విభాగంలో మనకు క్యాంస్య పతకం రానుండడం ఇదే తొలిసారి.
లవ్లీనా సాధించిన పతకాలు
2018లో ఏఐబీఏ వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకం
2019లో ఏఐబీఏ వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకం
2018లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్వార్టర్‌పైనల్‌లో ఓటమి
Comments
Please login to add a commentAdd a comment