Arundhati Choudhary Drags BFI To Court Over Direct Entry For Lovlina Borgohain In World Championships: న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం ట్రయల్స్ లేకుండానే టోక్యో ఒలింపిక్స్ పతక విజేత హోదాలో లవ్లీనా బొర్గోహైన్‌కు భారత జట్టులో నేరుగా బెర్త్ ఇవ్వడంపై బాక్సర్ అరుంధతీ చౌదరీ ఢిల్లీ హైకోర్టుకెక్కింది. బుధవారం విచారణ సందర్భంగా జస్టిస్ రేఖ పల్లి భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ)ను తలంటారు. ఒక్క బీఎఫ్‌ఐ మాత్రమే కాదు... దేశంలోని అన్ని క్రీడా సమాఖ్యల తీరు ఇలానే అఘోరించిందని ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘క్రీడా సమాఖ్యల పనితీరు గురించి వింటుంటే సమాఖ్యకు తలోగ్గే వరకు క్రీడాకారుల మాటకు విలువ ఇవ్వరేమోననిపిస్తోంది. క్రీడాభివృద్ధి కోసం సమాఖ్యలు పని చేయాలి. క్రీడాకారులను ఇలా ఇబ్బంది పెడుతూ ఏం సాధిస్తారు’ అని రేఖ పల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు కోరుతూ కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. మరోవైపు ఈ వివాదంపై బీఎఫ్‌ఐ వివరణ ఇచ్చింది. అరుంధతిని ప్రపంచ పోటీలకు రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశామని బీఎఫ్‌ఐ వివరించింది.
చదవండి: పొట్టి క్రికెట్‌పై దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment