BFI
-
అన్ని క్రీడా సమాఖ్యల తీరు అంతే: ఢిల్లీ హైకోర్టు
Arundhati Choudhary Drags BFI To Court Over Direct Entry For Lovlina Borgohain In World Championships: న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం ట్రయల్స్ లేకుండానే టోక్యో ఒలింపిక్స్ పతక విజేత హోదాలో లవ్లీనా బొర్గోహైన్‌కు భారత జట్టులో నేరుగా బెర్త్ ఇవ్వడంపై బాక్సర్ అరుంధతీ చౌదరీ ఢిల్లీ హైకోర్టుకెక్కింది. బుధవారం విచారణ సందర్భంగా జస్టిస్ రేఖ పల్లి భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ)ను తలంటారు. ఒక్క బీఎఫ్ఐ మాత్రమే కాదు... దేశంలోని అన్ని క్రీడా సమాఖ్యల తీరు ఇలానే అఘోరించిందని ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘క్రీడా సమాఖ్యల పనితీరు గురించి వింటుంటే సమాఖ్యకు తలోగ్గే వరకు క్రీడాకారుల మాటకు విలువ ఇవ్వరేమోననిపిస్తోంది. క్రీడాభివృద్ధి కోసం సమాఖ్యలు పని చేయాలి. క్రీడాకారులను ఇలా ఇబ్బంది పెడుతూ ఏం సాధిస్తారు’ అని రేఖ పల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు కోరుతూ కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. మరోవైపు ఈ వివాదంపై బీఎఫ్ఐ వివరణ ఇచ్చింది. అరుంధతిని ప్రపంచ పోటీలకు రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశామని బీఎఫ్ఐ వివరించింది. చదవండి: పొట్టి క్రికెట్‌పై దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
కరోనాతో బాక్సింగ్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నుమూత
ఢిల్లీ: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.కె. సాచేటి(56) కొవిడ్-19తో మంగళవారం మృతిచెందారు. కొవిడ్ ఇన్ఫెక్షన్తో ఆయన గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన మరణం క్రీడా ప్రపంచంలో భారీ శూన్యతను మిగిల్చిందని బీఎఫ్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. సాచేటి ఐఓసీ ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ సభ్యుడుగా కూడా ఉన్నారు. సాచేటి మృతిపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు విచారం వ్యక్తం చేశారు. ఆర్ కే సాచేటి కొవిడ్-19తో జరిగిన యుద్ధంలో ఓడిపోయారన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి బాక్సింగ్ దేశాల లీగ్‌లో భారత్‌ను ఉంచిన మూల స్తంభాల్లో ఆయన ఒకరన్నారు. సాచేటి మృతిపట్ల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ), అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంతాపం ప్రకటించింది. -
బీఎఫ్ఐ ఆదేశిస్తే... నిఖత్‌తో బౌట్‌కు సిద్ధమే
న్యూఢిల్లీ: ‘నిఖత్ జరీన్‌తో తలపడేందుకు నాకెలాంటి భయం లేదు’ అని భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రకటించింది. ‘భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఆదేశిస్తే... ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం నిర్వహించే సెలక్షన్ ట్రయల్స్ బౌట్లో నిఖత్‌ను ఓడించి లాంఛనం పూర్తి చేస్తాను’ అని రికార్డుస్థాయిలో ఎనిమిదిసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన ఈ మణిపూర్ బాక్సర్ స్పష్టం చేసింది. శనివారం ఓ సన్మాన కార్యక్ర మంలో పాల్గొనేందుకు వచ్చిన మేరీకోమ్ తాజా వివాదంపై స్పందించింది. ‘బీఎఫ్ఐ తీసుకున్న నిర్ణయాన్ని, నిబంధనలను నేను మార్చలేను. పోటీపడటమే నాకు తెలుసు. బీఎఫ్ఐ తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తాను. వారు నిఖత్‌తో ట్రయల్స్ బౌట్లో తలపడాలని ఆదేశిస్తే తప్పకుండా పోటీపడతాను’ అని 36 ఏళ్ల మేరీకోమ్ తెలిపింది. -
అయ్యో... నిఖత్!
న్యూఢిల్లీ: మరోసారి తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నుంచి నిరాశే ఎదురైంది. సెలక్షన్ ట్రయల్స్‌ను పక్కనబెట్టి మళ్లీ పతక విజేతలకు బీఎఫ్ఐ జైకొట్టడంతో నిఖత్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు దూరమైంది. ఈ ఆగస్టులోచాంపియన్షిప్కు ముందు కూడా ఇలాంటి నిర్ణయంతో నిఖత్ జరీన్ ఇంటికే పరిమితమైంది. మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ కూడా నిఖత్ వెయిట్ కేటగిరీ (51 కేజీలు) కావడం తెలంగాణ బాక్సర్‌కు శాపమైంది. మేటి బాక్సర్‌ను కాదనలేక, షెడ్యూలు ప్రకారం ట్రయల్స్ నిర్వహించకుండానే మేరీని బీఎఫ్ఐ ఖరారు చేసింది. ఇప్పుడు నిఖత్ ఒలింపిక్స్ ఆశల్ని క్వాలిఫయింగ్‌కు ముందే తుంచేసింది. వచ్చే ఫిబ్రవరిలో ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్ పోటీలు చైనాలో జరుగనున్నాయి. ఈ ఈవెంట్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన విజేతల్ని బీఎఫ్ఐ ఎంపిక చేసింది. అక్కడ కాంస్యాలు నెగ్గిన మేరీకోమ్ (51 కేజీలు), లవ్లీనా (69 కేజీలు) సెలక్షన్ ట్రయల్స్‌తో నిమిత్తం లేకుండానే చైనా ఈవెంట్‌కు అర్హత పొందారు. దీంతో 51 కేజీల కేటగిరీలో ఉన్న నిఖత్ సెలక్షన్ బరిలోకి దిగకుండానే బీఎఫ్ఐ చేతిలో నాకౌట్ అయ్యింది. బాక్సింగ్ సమాఖ్య నిర్ణయంపై మేరీ సంతోషం వ్యక్తం చేసింది. ‘చాలా ఆనందంగా ఉంది. పతక విజేతనైనా నాకు నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో పాల్గొనే అవకాశమిచి్చన బీఎఫ్ఐకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అని పేర్కొంది. -
ఒలింపిక్స్‌కు విజేందర్ గ్రీన్‌సిగ్నల్
చెన్నై: సుమారు రెండేళ్ల క్రితం భారత బాక్సర్ విజేందర్ సింగ్ ప్రొషెనల్ రింగ్‌లోకి అడుగుపెట్టడంతో దేశం తరఫున అధికారిక ఈవెంట్లలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రొఫెషనల్ బాక్సర్లగా మారిన వాళ్లు ఇకపై దేశం తరఫున ఆడేందుకు సైతం అనుమతిస్తూ భారత బాక్సింగ్ ఫెడరేషన్(బీఎఫ్ఐ) నిర్ణయం తీసుకోవడంతో విజేందర్ ముందు సువర్ణావకాశం వచ్చి పడింది. ఒలింపిక్స్ సహా అన్ని అధికారిక క్రీడల్లో భారత ప్రొఫెషనల్ బాక్సర్ల పాల్గొనే అవకాశాన్ని కల్పించడంతో విజేందర్కు మెగా ఈవెంట్లో తన సత్తాను మరోసారి చాటేందుకు అవకాశం ఏర్పడింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విజేందర్.. వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు చాన్స్ దొరికింది. దాంతో పాటు మరో భారత ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయత్‌కు కూడా ఒలింపిక్స్ బాక్సింగ్ రింగ్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. దీనిపై విజేందర్ మాట్లాడుతూ.. ‘కచ్చితంగా మెగా ఈవెంట్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఉన్నాను. నాకు ప్రొఫెషనల్ అయినా, అమెచ్యూర్ అయినా ఒక్కటే. ఎక్కడైనా రెండొందల శాతం ప్రదర్శను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి భారత జెండాను నా షర్ట్‌పై చూడాలనుకుంటున్నా. దేశం కోసం పోరాడటం ఎప్పుడూ గౌరవమే’ అని పేర్కొన్నాడు. కాగా, ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే అంతకుముందు జరిగే క్వాలిఫయింగ్ ఈవెంట్లో తలపడాల్సి ఉంటుంది. -
ఇండస్ ఇండ్‌కు బీఎఫ్ఐఎల్ దన్ను
ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,433 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలానికి రూ.1.036 కోట్ల నికర లాభం సాధించామని ఇండస్ ఇండ్ బ్యాంక్ తెలిపింది. తమ బ్యాంక్‌లో విలీనమైన సూక్ష్మ రుణ సంస్థ, భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పనితీరు బాగుండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్ సీఎమ్‌డీ, సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. మొత్తం ఆదాయం రూ.6,370 కోట్ల నుంచి శాతం వృద్ధితో రూ.8,625 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్ (బీఎఫ్ఐఎల్) విలీనం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ క్యూ1 ఫలితాల్లో బీఎఫ్ఐఎల్ గణాంకాలు కూడా ఉన్నందున గత క్యూ1 ఫలితాలను, ఈ క్యూ1 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించారు. రుణ వృద్ధి 28 శాతం...: 28 శాతం రుణ వృద్ధి సాధించామని బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. నికర వడ్డీ ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.2,844 కోట్లకు పెరిగిందని, 4.05 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించామని వివరించారు. ఈ ఏడాది జూన్‌లో మనీ మార్కెట్ రేట్లు భారీగా తగ్గాయని, ఫలితంగా నికర వడ్డీ మార్జిన్ పెరిగిందని పేర్కొన్నారు. మొండి బకాయిలు డబుల్...: గత క్యూ1లో 1.15 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో దాదాపు రెట్టింపై 2.15 శాతానికి పెరిగాయని సోబ్తి పేర్కొన్నారు. ‘‘గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో ఇది 2.10 శాతం. గత క్యూ1లో 0.51 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ1లో 1.23 శాతానికి పెరిగాయి. కేటాయింపులు రూ.350 కోట్ల నుంచి రూ.430 కోట్లకు చేరుకున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు రుణాలిచ్చిన కారణంగా గత కొన్ని క్వార్టర్ల పాటు రుణ నాణ్యత ప్రభావితమైంది, ప్రస్తుతం ఈ రుణ నాణ్యత ఇబ్బందుల నుంచి బయటపడ్డాం’’ అని సోబ్తి వివరించారు. ఆరంభంలో భారీగా లాభపడిన ఇండస్ ఇండ్ షేర్ చివరకు 2% నష్టంతో రూ.1,510 వద్ద ముగిసింది. -
‘రామచంద్రన్‌ను తప్పించండి’
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్‌కు వ్యతిరేకంగా మరో సమాఖ్య కూడా జత కలిసింది. హాకీ ఇండియా (హెచ్ఐ)తో పాటుగా భారత బౌలింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) కూడా ఐఓఏ వెంటనే ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి రామచంద్రన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందిగా డిమాండ్ చేసింది. ‘ఐఓఏ రాజ్యాంగాన్ని అనుసరించి రామచంద్రన్‌పై మేం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం. ఆయన వ్యవహార శైలిపై పూర్తి అసంతృప్తితో ఉన్నాం. ఆయన ఐఓఏను బలహీనపరిచే విధంగా పనిచేస్తున్నారు. వీలైనంత త్వరగా ఎస్‌జీఎంను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం’ అని బీఎఫ్ఐ అధ్యక్షురాలు సునైనా కుమారి, కార్యదర్శి డీఆర్ సైనీ ఐఓసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.