
న్యూఢిల్లీ: మరోసారి తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) నుంచి నిరాశే ఎదురైంది. సెలక్షన్ ట్రయల్స్‌ను పక్కనబెట్టి మళ్లీ పతక విజేతలకు బీఎఫ్‌ఐ జైకొట్టడంతో నిఖత్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు దూరమైంది. ఈ ఆగస్టులోచాంపియన్‌షిప్‌కు ముందు కూడా ఇలాంటి నిర్ణయంతో నిఖత్ జరీన్ ఇంటికే పరిమితమైంది. మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ కూడా నిఖత్ వెయిట్ కేటగిరీ (51 కేజీలు) కావడం తెలంగాణ బాక్సర్‌కు శాపమైంది. మేటి బాక్సర్‌ను కాదనలేక, షెడ్యూలు ప్రకారం ట్రయల్స్ నిర్వహించకుండానే మేరీని బీఎఫ్‌ఐ ఖరారు చేసింది. ఇప్పుడు నిఖత్ ఒలింపిక్స్ ఆశల్ని క్వాలిఫయింగ్‌కు ముందే తుంచేసింది.
వచ్చే ఫిబ్రవరిలో ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్ పోటీలు చైనాలో జరుగనున్నాయి. ఈ ఈవెంట్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన విజేతల్ని బీఎఫ్‌ఐ ఎంపిక చేసింది. అక్కడ కాంస్యాలు నెగ్గిన మేరీకోమ్ (51 కేజీలు), లవ్లీనా (69 కేజీలు) సెలక్షన్ ట్రయల్స్‌తో నిమిత్తం లేకుండానే చైనా ఈవెంట్‌కు అర్హత పొందారు. దీంతో 51 కేజీల కేటగిరీలో ఉన్న నిఖత్ సెలక్షన్ బరిలోకి దిగకుండానే బీఎఫ్‌ఐ చేతిలో నాకౌట్ అయ్యింది. బాక్సింగ్ సమాఖ్య నిర్ణయంపై మేరీ సంతోషం వ్యక్తం చేసింది. ‘చాలా ఆనందంగా ఉంది. పతక విజేతనైనా నాకు నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో పాల్గొనే అవకాశమిచి్చన బీఎఫ్‌ఐకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment