న్యూఢిల్లీ: బాక్సర్లు మేరీకోమ్, నిఖత్ జరీన్ (51 కేజీలు) ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ సెలక్షన్ ట్రయల్స్ బౌట్ వివాదంలో తాను నేరుగా జోక్యం చేసుకోలేనని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అయితే దేశానికి మేలు జరిగే నిర్ణయాన్ని తీసుకోవాలని మాత్రం భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ)కు సూచిస్తానని ఆయన తెలిపారు. ‘దేశానికి, క్రీడలకు, క్రీడాకారులకు మేలు జరిగే నిర్ణయం తీసుకోవాలని భారత బాక్సింగ్ సమాఖ్యకు నేను కచ్చితంగా సూచిస్తాను. అయితే ఒలింపిక్ చార్టర్ నిబంధనల ప్రకారం స్వయం ప్రతిపత్తిగల క్రీడా సమాఖ్యల సెలక్షన్ నిర్ణయాల్లో ప్రభుత్వ మంత్రులు జోక్యం చేసుకోరాదు’ అని కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘తక్షణమే స్పందించినందుకు ధన్యవాదాలు సర్. దేశానికి పేరు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించే క్రీడాకారులు ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో నష్టపోవద్దని కోరుకుంటున్నాను’ అని క్రీడల మంత్రి స్పందనకు నిఖత్ సమాధానం ఇచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment