‘రామచంద్రన్‌ను తప్పించండి’ | Another NSF demands GBM to oust IOA chief N Ramachandran | Sakshi
Sakshi News home page

‘రామచంద్రన్‌ను తప్పించండి’

Published Sun, May 3 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

‘రామచంద్రన్‌ను తప్పించండి’

‘రామచంద్రన్‌ను తప్పించండి’

న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్‌కు వ్యతిరేకంగా మరో సమాఖ్య కూడా జత కలిసింది. హాకీ ఇండియా (హెచ్‌ఐ)తో పాటుగా భారత బౌలింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) కూడా ఐఓఏ వెంటనే ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి రామచంద్రన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందిగా డిమాండ్ చేసింది. ‘ఐఓఏ రాజ్యాంగాన్ని అనుసరించి రామచంద్రన్‌పై మేం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం. ఆయన వ్యవహార శైలిపై పూర్తి అసంతృప్తితో ఉన్నాం. ఆయన ఐఓఏను బలహీనపరిచే విధంగా పనిచేస్తున్నారు. వీలైనంత త్వరగా ఎస్‌జీఎంను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం’ అని బీఎఫ్‌ఐ అధ్యక్షురాలు సునైనా కుమారి, కార్యదర్శి డీఆర్ సైనీ ఐఓసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement