N Ramachandran
-
‘రామచంద్రన్‌ను తప్పించండి’
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్‌కు వ్యతిరేకంగా మరో సమాఖ్య కూడా జత కలిసింది. హాకీ ఇండియా (హెచ్ఐ)తో పాటుగా భారత బౌలింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) కూడా ఐఓఏ వెంటనే ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి రామచంద్రన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందిగా డిమాండ్ చేసింది. ‘ఐఓఏ రాజ్యాంగాన్ని అనుసరించి రామచంద్రన్‌పై మేం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం. ఆయన వ్యవహార శైలిపై పూర్తి అసంతృప్తితో ఉన్నాం. ఆయన ఐఓఏను బలహీనపరిచే విధంగా పనిచేస్తున్నారు. వీలైనంత త్వరగా ఎస్‌జీఎంను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం’ అని బీఎఫ్ఐ అధ్యక్షురాలు సునైనా కుమారి, కార్యదర్శి డీఆర్ సైనీ ఐఓసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
సోచిలో మువ్వన్నెల జెండా రెపరెపలు
రష్యాలోని సోచిలో జరగుతున్న వింటర్ ఒలంపిక్స్‌లో భారత మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆదివారం సోచి క్రీడా ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భారత ఆటగాళ్లు శివ కేశవన్, హిమాంశు, నదీమ్ ఇక్బాల్ వారి ముగ్గురు కోచ్‌లు, అసోసియేషన్ (ఐఓఏ)కు నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన ఎన్. రామచంద్రన్, యూరోపియన్ ఒలంపిక్స్ కమిటీ అధ్యక్షుడు ప్యాట్రిక్ హైకిలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వింటర్ ఒలంపిక్స్ ప్రారంభంలో భారత్ ఐఓసీ కింద పాల్గొన్న విషయం తెలిసిందే. వింటర్ ఒలంపిక్స్ ఈ నెల 7న సోచిలో ప్రారంభమైనాయి. అవి ఈ నెల 23 వరకు జరుగుతాయి. భారత్‌పై అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ విధించిన నిషేధం దాదాపు 14 నెలల తర్వాత తొలగడంతో జాతీయ జెండా తిరిగి ఒలంపిక్స్‌లో రెపరెపలాడింది.