రష్యాలోని సోచిలో జరగుతున్న వింటర్ ఒలంపిక్స్లో భారత మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆదివారం సోచి క్రీడా ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భారత ఆటగాళ్లు శివ కేశవన్, హిమాంశు, నదీమ్ ఇక్బాల్ వారి ముగ్గురు కోచ్లు, అసోసియేషన్ (ఐఓఏ)కు నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన ఎన్. రామచంద్రన్, యూరోపియన్ ఒలంపిక్స్ కమిటీ అధ్యక్షుడు ప్యాట్రిక్ హైకిలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వింటర్ ఒలంపిక్స్ ప్రారంభంలో భారత్ ఐఓసీ కింద పాల్గొన్న విషయం తెలిసిందే. వింటర్ ఒలంపిక్స్ ఈ నెల 7న సోచిలో ప్రారంభమైనాయి. అవి ఈ నెల 23 వరకు జరుగుతాయి. భారత్పై అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ విధించిన నిషేధం దాదాపు 14 నెలల తర్వాత తొలగడంతో జాతీయ జెండా తిరిగి ఒలంపిక్స్లో రెపరెపలాడింది.
సోచిలో మువ్వన్నెల జెండా రెపరెపలు
Published Mon, Feb 17 2014 9:39 AM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
Advertisement