ఆర్‌ఆర్‌ఆర్‌ సినీ ప్రియులకు.. అయితే, కెకెకె క్రీడాభిమానులకు.. కాస్కో... చూస్కో... | 2022 sporting calendar Released | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ సినీ ప్రియులకు.. అయితే, కెకెకె క్రీడాభిమానులకు.. కాస్కో... చూస్కో...

Published Sun, Jan 2 2022 1:19 AM | Last Updated on Sun, Jan 2 2022 7:57 AM

2022 sporting calendar Released - Sakshi

సాక్షి క్రీడా విభాగం: ఈ ఏడాది ఆర్‌.ఆర్‌.ఆర్‌. తెగ ఆకర్షిస్తోంది. ఇది పూర్తిగా సినీ ప్రియులకు సంబంధించిన వ్యవహారం. అలాగే ఈ ఏడాది కె.కె.కె (క్రికెట్‌... క్రీడలు... ఖేల్‌) కూడా కనీవినీ ఎరుగని రీతిలో అలరించేందుకు, అదరగొట్టేందుకు, బ్రహ్మాండాన్ని బద్దలు చేసేందుకు ముస్తాబైంది.

ఈ కె.కె.కె ప్రత్యేకతలు తెలుసుకుందాం. క్రికెట్‌ విషయానికొస్తే ఐపీఎల్‌ మెగా వేలం నుంచి లీగ్‌ దాకా, అలాగే పురుషుల టి20 ప్రపంచకప్, కుర్రాళ్లు (అండర్‌–19), అమ్మాయిల ప్రపంచకప్‌ (వన్డే)లు, ఇతరత్రా టోర్నీలున్నాయి.

క్రీడలు... అంటే ఈ ఏడాది జరగబోయే మెగా ఈవెంట్స్‌ అన్నీ లోకాన్నే మైదానంలో కూర్చోబెట్టేంత రద్దీతో ఉన్నాయి. కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడలు, ఫుట్‌బాల్‌ ప్రపంచకప్, వింటర్‌ ఒలింపిక్స్‌ ఇలా దేనికదే తీసిపోనంత ప్రతిష్టాత్మక ఈవెంట్లు. అన్నీ సై అంటే సై అనే క్రీడలే!

ఖేల్‌... అంటే క్రికెట్, మెగా ఈవెంట్లు కాకుండా జరిగే టోర్నీలు. ప్రపంచ అథ్లెటిక్స్, ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు, ప్రపంచ ఆర్చరీకప్, ప్రపంచకప్‌ షూటింగ్‌ పోటీలతో పాటు రెగ్యులర్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు, బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్, ఫార్ములావన్‌ రేసింగ్, రెజ్లింగ్, బాక్సింగ్‌ పంచ్‌లతో ఈ పన్నెండు నెలలు పండంటి వినోదమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

► అండర్‌–19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌
వేదిక: వెస్టిండీస్‌
జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు

► మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌
వేదిక: న్యూజిలాండ్‌
మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 3 వరకు

► భారత పురుషుల క్రికెట్‌ జట్టు షెడ్యూల్‌
దక్షిణాఫ్రికాలో పర్యటన
జనవరి 3 నుంచి 23 వరకు 2 టెస్టులు, 3 వన్డేలు

► ఐపీఎల్‌–2022 మెగా వేలం
వేదిక: బెంగళూరు
ఫిబ్రవరి 12, 13

► భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన
ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు

► భారత్‌లో శ్రీలంక పర్యటన
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు
2 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు

► భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన
జూన్‌ 9 నుంచి 19 వరకు
5 టి20 మ్యాచ్‌లు

► ఇంగ్లండ్‌లో భారత్‌ పర్యటన
జూలై 1 నుంచి 17 వరకు
1 టెస్టు, 3 టి20లు, 3 వన్డేలు

► న్యూజిలాండ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు  పర్యటన
ఫిబ్రవరి 5 నుంచి 24 వరకు
1 టి20 మ్యాచ్, 5 వన్డేలు

► ఫార్ములావన్‌
ఈ ఏడాది ఫార్ములావన్‌ (ఎఫ్‌1)లో మొత్తం 23 రేసులు జరుగుతాయి. మార్చి 20న బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రితో ఎఫ్‌1 సీజన్‌ మొదలవుతుంది. అనంతరం సౌదీ అరేబియా (మార్చి 27), ఆస్ట్రేలియా (ఏప్రిల్‌ 10), ఇటలీ (ఏప్రిల్‌ 24), మయామి–యూఎస్‌ఏ (మే 8), స్పెయిన్‌ (మే 22), మొనాకో (మే 29), అజర్‌బైజాన్‌ (జూన్‌ 12), కెనడా (జూన్‌ 19), బ్రిటన్‌ (జూలై 3), ఆస్ట్రియా (జూలై 10), ఫ్రాన్స్‌ (జూలై 24), హంగేరి (జూలై 31), బెల్జియం (ఆగస్టు 28), నెదర్లాండ్స్‌ (సెప్టెంబర్‌ 4), ఇటలీ (సెప్టెంబర్‌ 11), రష్యా (సెప్టెంబర్‌ 25), సింగపూర్‌ (అక్టోబర్‌ 2), జపాన్‌ (అక్టోబర్‌ 9),  ఆస్టిన్‌–యూఎస్‌ఏ (అక్టోబర్‌ 23), మెక్సికో (అక్టోబర్‌ 30), బ్రెజిల్‌ (నవంబర్‌ 13) గ్రాండ్‌ప్రి రేసులు ఉన్నాయి. చివరగా నవంబర్‌ 20న అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో సీజన్‌ ముగుస్తుంది.  

ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌
వేదిక: ఇస్తాంబుల్‌ (టర్కీ)
మే 6 నుంచి 21 వరకు

► వింటర్‌ ఒలింపిక్స్‌
వేదిక: బీజింగ్‌ (చైనా)
ఫిబ్రవరి 4–20
పాల్గొనే దేశాలు: 84

► కామన్వెల్త్‌ గేమ్స్‌
వేదిక: బర్మింగ్‌హమ్‌ (ఇంగ్లండ్‌)
జూలై 28–ఆగస్టు 8

► కామన్వెల్త్‌ గేమ్స్‌
వేదిక: బర్మింగ్‌హమ్‌ (ఇంగ్లండ్‌)
జూలై 28–ఆగస్టు 8

► ఆసియా క్రీడలు
వేదిక: హాంగ్జౌ (చైనా)
సెప్టెంబర్‌ 10–25

► ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌
వేదిక: ఖతర్‌
నవంబర్‌ 21–డిసెంబర్‌ 18
పాల్గొనే జట్లు: 32

► ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌
వేదిక: ఒరెగాన్‌ (అమెరికా)
జూలై 15–24

► ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు
వేదిక: చెంగ్డూ (చైనా)
జూన్‌ 26–జూలై 7

► ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌
వేదిక: బెల్‌గ్రేడ్‌ (సెర్బియా);
సెప్టెంబర్‌ 10–18

► పురుషుల టి20 క్రికెట్‌ వరల్డ్‌కప్‌
వేదిక: ఆస్ట్రేలియా  
అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13

షూటింగ్‌
► ప్రపంచకప్‌ షాట్‌గన్‌ టోర్నీ
వేదిక: రబాట్‌ (మొరాకో); ఫిబ్రవరి 7–18

► ప్రపంచకప్‌ రైఫిల్, పిస్టల్‌ టోర్నీ
వేదిక: కైరో (ఈజిప్ట్‌); ఫిబ్రవరి 26–మార్చి 8

► ప్రపంచకప్‌ షాట్‌గన్‌ టోర్నీ
వేదిక: నికోసియా (సైప్రస్‌); మార్చి 8–19  

► ప్రపంచకప్‌ షాట్‌గన్‌ టోర్నీ
వేదిక: లిమా (పెరూ); మార్చి 27–ఏప్రిల్‌ 7

► ప్రపంచకప్‌ రైఫిల్, పిస్టల్‌ టోర్నీ
వేదిక: రియో డి జనీరో (బ్రెజిల్‌); ఏప్రిల్‌ 9–19

► ప్రపంచకప్‌ షాట్‌గన్‌ టోర్నీ
వేదిక: లొనాటో (ఇటలీ); ఏప్రిల్‌ 19–30

► ప్రపంచకప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ టోర్నీ
వేదిక: బాకు (అజర్‌బైజాన్‌); మే 27–జూన్‌ 9

► ప్రపంచకప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ టోర్నీ
వేదిక: చాంగ్వాన్‌ (కొరియా); జూలై 9–22

► ప్రపంచ షాట్‌గన్‌ చాంపియన్‌షిప్‌
వేదిక: క్రొయేషియా; సెప్టెంబర్‌ 27– అక్టోబర్‌ 10

► ప్రపంచ రైఫిల్, పిస్టల్‌ చాంపియన్‌షిప్‌
వేదిక: కైరో (ఈజిప్ట్‌); అక్టోబర్‌ 12–25

ఆర్చరీ
► ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీ
వేదిక: అంటాల్యా; ఏప్రిల్‌ 18–24

► ప్రపంచకప్‌ స్టేజ్‌–2 టోర్నీ
వేదిక: గ్వాంగ్‌జు; మే 16–22

► ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నీ
వేదిక: పారిస్‌ (ఫ్రాన్స్‌);
జూన్‌ 20–26  

► ప్రపంచకప్‌ స్టేజ్‌–4 టోర్నీ
వేదిక: మెడెలిన్‌ (కొలంబియా); జూలై 18–24

బ్యాడ్మింటన్‌
► ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 టోర్నీ
వేదిక: న్యూఢిల్లీ
జనవరి 11–16

► సయ్యద్‌ మోదీ ఓపెన్‌ సూపర్‌–300 టోర్నీ
వేదిక: లక్నో
జనవరి 18 –23

► ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ సూపర్‌–1000 టోర్నీ
వేదిక: బర్మింగ్‌హమ్‌; మార్చి 16 –20  

► థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ టోర్నీ
వేదిక: బ్యాంకాక్‌; మే 8 –15

► ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 టోర్నీ
వేదిక: జకార్తా;జూన్‌ 14 –19

► ప్రపంచ చాంపియన్‌షిప్‌
వేదిక: టోక్యో; ఆగస్టు 21 –28

► వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ
వేదిక: గ్వాంగ్‌జౌ;డిసెంబర్‌ 14 –18

► టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌
వేదిక: మెల్‌బోర్న్‌
జనవరి 17–30

► ఫ్రెంచ్‌ ఓపెన్‌
వేదిక: పారిస్‌
మే 22– జూన్‌ 5

► వింబుల్డన్‌ ఓపెన్‌
వేదిక: లండన్‌; జూన్‌ 27–జూలై 10

► యూఎస్‌ ఓపెన్‌
వేదిక: న్యూయార్క్‌; ఆగస్టు 29–సెప్టెంబర్‌ 11

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement