Ukraine against Russia: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచంలో అశాంతిని రేపింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత, అంటే దాదాపుగా 40 ఏళ్ల తర్వాత ప్రపంచ దేశాలు చెరి సగంగా విడిపోవడం ఇదే తొలిసారి. కోవిడ్–19 వల్ల కలిగిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు రష్యా యుద్ధం మొదలు పెట్టడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలతో మిలటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలు ఒకేసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. బాంబుల మోతతో లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు అండర్‌గ్రౌండ్‌లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. అత్యంత పవర్‌పుల్ ఆయుదాలు, మిస్సైల్స్ కలిగిన రష్యా బలగాలకు ఎదురెళ్లి ఉక్రెయిన్ బలగాలు తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నాయి.
ఇక విషయంలోకి వెళితే.. ఇద్దరు బాక్సింగ్ లెజెండ్స్ ప్రస్తుతం ఉక్రెయిన్ తరపున రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వాళ్లే విటాలి క్లిట్ష్కో, వ్లాదిమిర్ క్లిట్ష్కో.. బాక్సింగ్ విభాగంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎన్నో ఘనతలు అందుకున్నారు. పలుమార్లు హెవివెయిట్ బాక్సింగ్‌లో చాంపియన్‌గా నిలచిన ఈ ఇద్దరు కొంతకాలం కిందట ఉక్రెయిన్ ఆర్మీలో తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం విటాలి క్లిట్ష్కో 2014 నుంచి కీవ్ మేయర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఉక్రెయిన్ బాంబుల మోతతో దద్దరిల్లడం.. పుతిన్ చేస్తున్న రాక్షస క్రీడ ఇద్దరిని తీవ్రంగా కలిచివేసింది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు కలిసి ఒక వీడియోను విడుదల చేశారు. ''దేశాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధంలోకి దిగుతున్నాం. పేరులో వ్లాదిమిర్ ఉన్నప్పటికి ఉక్రెయిన్ తరపునే మా పోరాటం. ఉక్రెయిన్‌ను కాపాడుకుంటాం.. మా దేశాన్ని నమ్ముతున్నాం.. ఇక్కడి ప్రజలంతా మా వాళ్లు.. వాళ్లను రక్షించడం మా బాధ్యత.. ఉక్రెయిన్ తరపున యుద్ధం చేస్తాం'' అంటూ విటాలి క్లిట్ష్కో పేర్కొన్నాడు.
చదవండి: Ukraine-Russia War: 'పనికిమాలిన చర్య.. రష్యాకు రేసింగ్‌కు వెళితే చెప్పుతో కొట్టుకున్నట్లే'
Ishan Kishan: ఊచకోత అంటే ఇదే.. పూనకం వచ్చినట్లు ఆడాడు
Wladimir Klitschko and Vitali Klitschko launch a joint video appeal after Vladimir Putin launched an invasion of Ukraine by Russia…
— Michael Benson (@MichaelBensonn) February 24, 2022
[📽️ @Vitaliy_Klychko & @Klitschko] pic.twitter.com/uVG4NqtCff
Comments
Please login to add a commentAdd a comment