న్యూయార్క్: అమెరికాలోని అరిజోనాలో నివశిస్తున్న జెస్సీకా కాక్స్‌కు పుట్టుకతోనే చేతులు లేవు అయితేనేం ఆమె దాన్ని పెద్ద లోపంగా భావించ లేదు. ఆమె తన జీవితాన్ని పూర్తిగా ఆశ్వాదిస్తూ ఆనందంగా బతకాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె అన్నింటిని చాలా సునాయాసంగా పట్టుదలతో నేర్చుకుంది. అన్ని అవయవాలు సరిగా ఉన్నవారితో పోల్చుకుంటే ఈమె చాలానే సాధించింది. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
(చదవండి: పువ్వులతోనే వేడినీళ్లు)
కేవలం కారు నడపటం, పియానో వాయించటమే కాదు ఏకంగా విమానాన్నే తన పాదాలతో నడేపేస్తోంది. అంతేకాదు బాక్సింగ్‌లో ఆమె రెండు బ్లాక్ బెల్ట్‌ల్ని కూడా గెలుచుకుంది. ఈ మేరకు ఆమెకు బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్న తైక్వాండ్‌కి చెందిన పాట్రిక్‌ని వివాహం చేసుకుంది. పైగా ఆమె మోటివేషనల్ స్సీకర్‌గా ప్రపంచమంతటా పర్యటిస్తోంది. ప్రస్తుతం ఆమె వికలాంగుల హక్కుల కోసం పోరాడుతోంది.య జెస్సీకాని చూస్తే సాధించలేనిదంటూ ఏమి ఉండదని బలంగా కోరుకుంటే దేన్నైనా సాధించగలమని అనిపిస్తోంది కదూ.
(చదవండి: ఓల్డ్ కార్ సీట్ బెల్ట్‌తో బ్యాగ్‌లు)
Comments
Please login to add a commentAdd a comment