aeroplan
-
500 ఎయిర్ బస్ విమానాలకు ఇండిగో ఆర్డర్
-
హార్ట్‌బీటే పాస్‌పోర్ట్.. ఏం కావాలన్నా క్షణాల్లో ప్రింట్ చేసుకుని తినడమే!
ఏదో పనిమీద పక్క దేశానికి వెళ్తున్నారు. చేతిలో ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా నడిచి వెళ్లారు.అంతే చెకింగ్, ఇమిగ్రేషన్ గట్రా అన్నీ అయిపోయాయి. విమానంలో కూర్చోగానే..సీటు మీ శరీరానికి తగ్గట్టుగా మారిపోయింది. విమానం దిగి హోటల్‌కు వెళ్లగానే ఆకలేసింది.మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయగానే.. ప్రింట్ చేసి తెచ్చి ఇచ్చేశారు.. ఇదేమిటి ఏదేదో చెప్పేస్తున్నారు అనిపిస్తోందా? భవిష్యత్తులో.. అంటే 2070 నాటికిప్రయాణం ఇలానే ఉంటుందట. ఆ వివరాలేమిటో చూద్దామా.. బ్రిటన్‌కు చెందిన ‘ది ఈజీ జెట్’ సంస్థమరో 50 ఏళ్ల తర్వాత ప్రయాణాల తీరుఎలా ఉంటుంది? సెలవులను ఎలాఎంజాయ్ చేస్తామన్న అంశంపై శాస్త్రవేత్తలు,నిపుణులతో మాట్లాడి ‘ది ఈజీ జెట్ 2070 ఫ్యూచర్ ట్రావెల్’పేరిట నివేదికను విడుదల చేసింది. లండన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిర్గిట్టె అండర్సన్, డిజైన్ సైంటిస్ట్ మెలిస్సా స్టెర్రీ, క్రాన్ఫీల్డ్ వర్సిటీ ప్రొఫెసర్ గ్రాహం బ్రైత్వేట్లతో పాటు మరికొందరుతమ అంచనాలను వెల్లడించారు. జస్ట్ అలా నడిచివెళితే చాలు.. ప్రతి ఒక్కరి వేలిముద్ర, కంటి ఐరిస్ వేర్వేరుగా ఉన్నట్టే.. గుండె కొట్టుకునే సిగ్నేచర్ కూడా విభిన్నంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ సిగ్నేచర్ డేటాను స్టోర్ చేసి.. వ్యక్తిగత గుర్తింపు, పాస్‌పోర్టుగా వాడొచ్చంటున్నారు. ఉదాహరణకు విమానాశ్రయంలోని ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లగానే.. సెన్సర్లు, కెమెరాలు, ప్రత్యేక పరికరాలు స్పందిస్తాయి. ఐరిస్ స్కాన్, ఫేషియల్ రికగ్నిషన్ (ముఖం గుర్తింపు), హార్ట్‌బీట్ సిగ్నేచర్లను గుర్తించి.. గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తాయి. ఇదంతా సెకన్లలోనే జరిగిపోతుంది. విమానంలో కూర్చోగానే.. ప్రయాణికులు విమానం ఎక్కి సీట్లోకూర్చోగానే.. వారి శరీరానికి తగినట్టు (సన్నగా, లావుగా, పొడవు, పొట్టి.. ఇలా) కాళ్లు గా సీటు ఆకృతి మారిపోతుంది. సీటుపై తలకు పక్కన అమర్చిన ప్రొజెక్టర్ నుంచి సరిగ్గా కళ్లకుముందు డిస్ప్లే ఏర్పడుతుంది. ఏ ఇబ్బందీ లేకుండా కావాల్సినవి వీక్షించవచ్చు. ఇల్లు–ఎయిర్పోర్ట్ టెర్మినల్– ఇల్లు ఉన్నచోటి నుంచే గాల్లోకి ఎగిరి ప్రయాణించి మళ్లీ అలాగే కిందకు దిగగలిగే (వీటీఓఎల్) ఎయిర్ ట్యాక్సీలు అంతటా అందుబాటులోకి వస్తాయి. ఇంటి దగ్గరే ఎయిర్‌ట్యాక్సీ ఎక్కి నేరుగావిమానాశ్రయం టెర్మినల్‌లో దిగడం.. ప్రయాణం చేశాక మళ్లీ టెర్మినల్ నుంచి నేరుగా ఇంటి వద్దదిగడం.. సాధారణంగా మారిపోతుంది. త్రీడీ ప్రింటెడ్ ఫుడ్.. కావాల్సినట్టు బెడ్ ♦ మనకు నచ్చిన ఆహారాన్ని కాసేపట్లోనే ఫ్రెష్‌గా ప్రింట్ చేసి ఇచ్చే ‘ఫుడ్ త్రీడీ ప్రింటింగ్’మెషీన్లు అందుబాటులోకి వస్తాయి. అల్పాహారం నుంచి రాత్రి భోజనం దాకా ఏదైనా ప్రింట్ చేసుకుని తినేయడమే. ♦ హోటళ్లలో రూమ్‌లు ‘స్మార్ట్’గా మారిపోతాయి. మనం రూమ్‌కు వెళ్లే ముందే.. గదిలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలో,లోపలికి వెళ్లగానే ఏదైనా సంగీతం ప్లేకావాలో, బెడ్ ఎంత మెత్తగాఉండాలో, గీజర్‌లో నీళ్లు ఎంత వేడితో ఉండాలో నిర్ణయించుకోవచ్చు. అందుకు తగినట్టుగా అన్నీ మారిపోతాయి. ♦ మనకు కావాల్సిన మోడల్, డిజైన్, వస్త్రంతో డ్రెస్సులు కూడా త్రీడీ ప్రింటింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే మనం ఇక లగేజీ తీసుకెళ్లాల్సిన అవసరం దాదాపు లేనట్టే. ప్రత్యేక సూట్లతో ‘టైమ్ ట్రావెలింగ్’ హాలిడే కోసం ఏదైనా పర్యాటక ప్రాంతానికివెళ్లినప్పుడు ప్రత్యేకమైన ‘హాప్టిక్’సూట్లను వేసుకోవచ్చు. ఏదైనా ప్రదేశాన్ని చూస్తున్న సమయంలోనే వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీ ద్వారా.. అవి ఒకప్పుడు ఎలా ఉండేవి, ఎలా మారుతూవచ్చాయన్నది కళ్ల ముందే కనిపించే సదుపాయం వచ్చేస్తుంది. ఇతర భాషల్లో ఎవరైనా మాట్లాడుతుంటే.. అప్పటికప్పుడు మనకు కావాల్సిన భాషలోకి మార్చి వినిపించే ‘ఇన్ ఇయర్’ పరికరాలు వస్తాయి. ఎక్కడైనా,ఏ భాష వారితోనైనా సులభంగా మాట్లాడొచ్చు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ -
పుట్టుకతోనే చేతుల్లేవు.. కానీ చాలానే సాధించింది!
న్యూయార్క్: అమెరికాలోని అరిజోనాలో నివశిస్తున్న జెస్సీకా కాక్స్‌కు పుట్టుకతోనే చేతులు లేవు అయితేనేం ఆమె దాన్ని పెద్ద లోపంగా భావించ లేదు. ఆమె తన జీవితాన్ని పూర్తిగా ఆశ్వాదిస్తూ ఆనందంగా బతకాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె అన్నింటిని చాలా సునాయాసంగా పట్టుదలతో నేర్చుకుంది. అన్ని అవయవాలు సరిగా ఉన్నవారితో పోల్చుకుంటే ఈమె చాలానే సాధించింది. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. (చదవండి: పువ్వులతోనే వేడినీళ్లు) కేవలం కారు నడపటం, పియానో వాయించటమే కాదు ఏకంగా విమానాన్నే తన పాదాలతో నడేపేస్తోంది. అంతేకాదు బాక్సింగ్‌లో ఆమె రెండు బ్లాక్ బెల్ట్ల్ని కూడా గెలుచుకుంది. ఈ మేరకు ఆమెకు బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్న తైక్వాండ్కి చెందిన పాట్రిక్‌ని వివాహం చేసుకుంది. పైగా ఆమె మోటివేషనల్ స్సీకర్‌గా ప్రపంచమంతటా పర్యటిస్తోంది. ప్రస్తుతం ఆమె వికలాంగుల హక్కుల కోసం పోరాడుతోంది.య జెస్సీకాని చూస్తే సాధించలేనిదంటూ ఏమి ఉండదని బలంగా కోరుకుంటే దేన్నైనా సాధించగలమని అనిపిస్తోంది కదూ. (చదవండి: ఓల్డ్ కార్ సీట్ బెల్ట్‌తో బ్యాగ్‌లు) -
ట్రూజెట్ విమనానికి తప్పిన ప్రమాదం!
సాక్షి, కడప : కడప నుంచి విజయవాడ బయల్దేరిన విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. పైలెట్ అప్రమత్తం కావడం..ఏటీసీ అధికారులకు సమాచారం అందించడం..విమానాన్ని కడప ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ట్రూ జెట్ విమానంలో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో విమానం బయలుదేరగా 10–15 నిమిషాల వ్యవధిలో పక్షి తగిలింది. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన పైలెట్ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. నేరుగా విమానాన్ని కడప ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి దింపారు. ఇందులో ప్రయాణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు మిగిలిన ప్రయాణికులను క్షేమంగా ఎయిర్‌పోర్టులో దింపేసి ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా మరో విమానంలో హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు. క్షేమంగా దిగడంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరిసింది. ప్రమాదం దృష్ట్యా విజయవాడ వెళ్లాల్సిన విమాన సర్వీసు, చెన్నై వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. కడప ఎయిర్‌పోర్టులో ఆగిన విమానం ప్రమాద నేపథ్యంలో విమానం కడప ఎయిర్‌పోర్టుకు చేరింది. దానిని ఎయిర్‌పోర్టు అధికారులు పరీక్షల నిమిత్తం కడపలోనే ఉంచారు. ఈ విమానాన్ని గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం పలువురు అధికారులు పరిశీలిస్తారు.అన్ని పరీక్షలను నిర్వహించాక విమానం బయలుదేరనుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు కడప నుంచి విజయవాడకు బయలుదేరిన విమానానికి ప్రమాదం ఎదురు కావడంతో అత్యవసరంగా పైలెట్ విమానాన్ని కడప ఎయిర్‌పోర్టుకు సురక్షితంగా తీసుకొచ్చారు. ప్రయాణికులు తిరిగి వెళ్లడానికి ట్రూ జెట్ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొందరికి వాహనాలు సమకూర్చింది. మరికొందరికి బస్సు లు, మరో విమానంలో అవకాశం కల్పించారు. అయితే చెన్నై విమాన సర్వీసును రద్దు చేయడంతో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య నేపథ్యంలో ట్రూజెట్ అధికా>రులు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. -
శిక్షణ విమానం కూలి ఇద్దరు మృతి
హైదరాబాద్: మహారాష్ట్రలో చిన్న శిక్షణ విమానం కూలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. గోండియా వద్ద నదిలో బుధవారం ఉదయం డి.ఎ.42 విమానం కూలిపోయి సీనియర్ శిక్షకుడు రాజన్‌గుప్తా, శిక్షణ పొందుతున్న పైలట్ శివాని మృతిచెందారు. గోండియాలోని జాతీయ విమాన శిక్షణ సంస్థకు చెందిన ఈ విమానానికి ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ)తో 9.40 గంటలకు సంబంధాలు తెగిపోయాయి. గోండియాకు 40 కి.మీ. దూరంలోని కిరోరి తహసిల్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.