హైదరాబాద్: మహారాష్ట్రలో చిన్న శిక్షణ విమానం కూలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. గోండియా వద్ద నదిలో బుధవారం ఉదయం డి.ఎ.42 విమానం కూలిపోయి సీనియర్ శిక్షకుడు రాజన్‌గుప్తా, శిక్షణ పొందుతున్న పైలట్ శివాని మృతిచెందారు.
గోండియాలోని జాతీయ విమాన శిక్షణ సంస్థకు చెందిన ఈ విమానానికి ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ)తో 9.40 గంటలకు సంబంధాలు తెగిపోయాయి. గోండియాకు 40 కి.మీ. దూరంలోని కిరోరి తహసిల్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.