న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు జాస్మిన్ లంబోరియా, శశి చోప్రా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన తొలి పోరులో జాస్మిన్ (60 కేజీల విభాగం) రిఫరీ స్టాపింగ్ ద కాంటెస్ట్ (ఆర్‌ఎస్‌సీ) ద్వారా ఎన్‌యాంబెగా ఆంబ్రోస్ (టాంజానియా)ను చిత్తు చేసింది. బౌట్ మొదలైన 12 సెకన్లలోనే జాస్మిన్ విసిరిన పంచ్‌లకు ఆంబ్రోస్ తట్టుకోలేకపోవడంతో రిఫరీ ఆటను ఆపివేసి జాస్మిన్‌ను విజేతగా ప్రకటించారు.
63 కేజీల కేటగిరీలో శశి చోప్రా 5–0 స్కోరుతో ఎంవాంగీ టెరిసియా (కెన్యా)పై ఘన విజయం సాధించింది. తర్వాతి రౌండ్‌లో సమడోవా (తజికిస్తాన్)తో జాస్మిన్... కిటో మై (జపాన్)తో శశి తలపడతారు. అయితే 70 కేజీల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత బాక్సర్ శ్రుతి యాదవ్ 0–5తో జో పాన్ (చైనా) చేతిలో ఓటమిపాలైంది. నేడు భారత బాక్సర్లు నీతూ ఘంఘాస్, మంజు బంబోరియా తొలి రౌండ్‌లో ఆడతారు.
Comments
Please login to add a commentAdd a comment