
రాశీ ఖన్నా
రోజూ గంటసేపు నేర్చుకుంటున్నా. కొవ్వు, పిండి పదార్థాల సమాహారంతో నా డైట్ ఉంటుంది. బాక్సింగ్ అనేది శారీరక బలం మాత్రమే కాదు.. మానసిక బలాన్నీ పెంపొందిస్తుంది.
రాశీ ఖన్నా బాక్సింగ్ నేర్చుకుంటున్నారు. ఏదైనా క్యారెక్టర్ కోసం నేర్చుకుంటున్నారా? అంటే.. ఆ విషయాన్ని స్పష్టం చేయడంలేదు. మరింత ఫిట్‌గా కనబడటం కోసమే ఈ ట్రైనింగ్ అంటున్నారు. హిందీలో ‘సన్నీ’ అనే సినిమా అంగీకరించారీ బ్యూటీ. ఈ శిక్షణకు ఒక కారణం ఈ సినిమా అని తెలుస్తోంది. ఇక బాక్సింగ్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘శరీర శక్తిని పెంచుకోవడానికి ఒక మంచి మార్గం బాక్సింగ్. పైగా నేను తీసుకుంటున్నది ‘హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్’ (హెచ్‌ఐఐటి). రోజూ గంటసేపు నేర్చుకుంటున్నా. కొవ్వు, పిండి పదార్థాల సమాహారంతో నా డైట్ ఉంటుంది. బాక్సింగ్ అనేది శారీరక బలం మాత్రమే కాదు.. మానసిక బలాన్నీ పెంపొందిస్తుంది. ఎంత పెద్ద సవాల్‌ని అయినా ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసం నాలో పెరిగింది. అందరికీ మానసిక బలం అవసరం. బలహీనత అనేది మనల్ని హరించివేస్తుంది’’ అన్నారు.