
న్యూయార్క్: తమ ప్రొఫెషనల్ కెరీర్‌లో పరాజయంతో పరిచయం లేని అమెరికా దిగ్గజ బాక్సర్లు ఫ్లాయిడ్ మేవెదర్, మహిళా స్టార్ లైలా అలీ అంతర్జాతీయ బాక్సింగ్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. జగద్విఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ కుమార్తె అయిన లైలా అలీ తండ్రికి తగ్గ తనయగా రింగ్‌లో నిరూపించుకుంది. తన కెరీర్‌లో 24–0 రికార్డుతో ప్రతి బౌట్ గెలిచిన 42 ఏళ్ల లైలా 21 పోటీల్లో నాకౌట్ విజయాలు సాధించడం మరో విశేషం. పురుషుల విభాగంలో 43 ఏళ్ల మేవెదర్‌ది కూడా చెక్కుచెదరని రికార్డే. ఇంకా చెప్పాలంటే బాక్సింగ్‌లో అతని స్కోరు ఫిఫ్టీ నాటౌట్! 50–0తో ప్రత్యర్థులకు తలగ్గొని మేవెదర్ ఖాతాలో 27 నాకౌట్ విజయాలున్నాయి. ఇంకా ఈ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో హెవీవెయిట్ మాజీ విజేత వ్లాదిమిర్ క్లిచ్కో (ఉక్రెయిన్), ఒలింపిక్ మాజీ చాంపియన్ ఆండ్రీ వార్డ్, అన్ వోల్ఫీ, ట్రిమియర్, మార్గరెట్ గుడ్‌మన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment