Floyd Mayweather
-
కోహ్లీ నాలుగేళ్ల సంపాదన ఒక్క ఫేక్ ఫైట్ ద్వారా ఆర్జించాడు
న్యూఢిల్లీ: టీమిండియా సారధి విరాట్ కోహ్లీ నాలుగేళ్ల సంపాదనను ఆ రిటైర్డ్ అమెరికన్ బాక్సర్ కేవలం ఒక్క రోజులో అర్జించాడు. ప్రపంచంలోనే అత్యధిక ధనార్జన కలిగిన క్రీడాకారుల్లో ఒకరైన కోహ్లీ.. పారితోషికాలు, ఎండార్స్మెంట్లు తదితర మార్గాల ద్వారా ఏడాదికి దాదాపు రూ. 196 కోట్ల రూపాయలు సంపాదిస్తుంటాడు. దీన్ని చూసే చాలా మంది ముక్కున వేలేసుకుంటుంటారు. అయితే కోహ్లీ నాలుగేళ్ల సంపాదనను కేవలం ఒక్క రోజులోనే కొల్లగొట్టాడు అమెరికా దిగ్గజ బాక్సర్ ఫ్లాయిడ్ మెవెదర్. అది కూడా ఓ ఫేక్ ఫైట్ చేసి ఈ మొత్తం అర్జించాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. జూన్ మొదటి వారంలో లోగన్ పాల్ అనే యూట్యూబర్‌తో బాక్సింగ్ రింగ్‌లో తలపడిన మెవెదర్.. ఆ మ్యాచ్ ద్వారా 100 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 742 కోట్లు) సంపాదించినట్లు చెప్పాడు. అదేదో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో సంపాదించిందనుకుంటే పొరపడట్టే. ఈ భారీ మొత్తాన్ని మెవెదర్ ఓ ఫేక్ ఫైట్ ద్వారా సంపాదించానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సరదాగా కోసం బౌట్‌లోకి అడుగుపెడితే.. అపార సంపద తన తలుపు తట్టిందని తెలిపాడు. ప్రొఫెషనల్ బాక్సర్ అయిన మెవెదర్ ఆరు రౌండ్ల పాటు సాగిన ఈ ఫైట్‌లో ప్రత్యర్ధిపై ఒక్క పంచ్ కూడా విసరకపోవడం విశేషం. ఎన్ని అవకాశాలు వచ్చినా ప్రత్యర్థిపై చేయెత్తకపోవడంతో ఈ మ్యాచ్‌పై చాలా సందేహాలు, విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది జూన్ 6న జరిగిన ఈ బౌట్లో మెవెదర్ ఓటమిపాలైనప్పటికీ.. అతని ఖాతాలో 742 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. దీంత అతని ఆస్తుల విలువ రూ. 1.2 బిలియన్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే, ప్రొఫెషనల్ బాక్సింగ్ చరిత్రలో అజేయుడిగా ఉన్న మెవెదర్ తన కెరీర్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అతనాడిన 50 మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధిపై అతనిదే పైచేయి. హోలీఫీల్డ్ లాంటి దిగ్గజ బాక్సర్లను సైతం మట్టికరిపించిన ఆయన.. బాక్సింగ్ చరిత్రలో మకుటం లేని మహారాజుగా చలామణి అయ్యాడు. ఈ క్రమంలో పేరు ప్రఖ్యాతలతో పాటు భారీ మొత్తంలో డబ్బును సంపాదించాడు. చివరకు 2017లో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి రిటైర్ అయ్యాడు. క్రీడాకారుల్లో అపర కుబేరుడిగా పేరొందిన మెవెదర్.. చాలా లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తాడు. అతని వద్ద ఖరీదైన కార్లు, వాచీలు, జ్యువెలరీ కలెక్షన్లు ఉన్నాయి. బుగాటి, లంబొర్గిని, రోల్స్ రాయస్ వంటి కార్లు అతడి గ్యారేజీలో కలెక్షన్లుగా పడి ఉన్నాయి. ప్రపంచంలోనే ఏ క్రీడాకారుని వద్ద లేని వరల్డ్ క్లాస్ జెట్ ఫ్లైట్‌ని అతను సొంతం చేసుకున్నాడు. దాని ఖరీదు రూ. 350 కోట్లకు పైమాటే. చదవండి: ఐపీఎల్ అసలు క్రికెట్టే కాదు.. ప్రముఖ వ్యాఖ్యాత సంచలన వ్యాఖ్యలు -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మేవెదర్, లైలా అలీ
న్యూయార్క్: తమ ప్రొఫెషనల్ కెరీర్లో పరాజయంతో పరిచయం లేని అమెరికా దిగ్గజ బాక్సర్లు ఫ్లాయిడ్ మేవెదర్, మహిళా స్టార్ లైలా అలీ అంతర్జాతీయ బాక్సింగ్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. జగద్విఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ కుమార్తె అయిన లైలా అలీ తండ్రికి తగ్గ తనయగా రింగ్‌లో నిరూపించుకుంది. తన కెరీర్లో 24–0 రికార్డుతో ప్రతి బౌట్ గెలిచిన 42 ఏళ్ల లైలా 21 పోటీల్లో నాకౌట్ విజయాలు సాధించడం మరో విశేషం. పురుషుల విభాగంలో 43 ఏళ్ల మేవెదర్ది కూడా చెక్కుచెదరని రికార్డే. ఇంకా చెప్పాలంటే బాక్సింగ్‌లో అతని స్కోరు ఫిఫ్టీ నాటౌట్! 50–0తో ప్రత్యర్థులకు తలగ్గొని మేవెదర్ ఖాతాలో 27 నాకౌట్ విజయాలున్నాయి. ఇంకా ఈ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో హెవీవెయిట్ మాజీ విజేత వ్లాదిమిర్ క్లిచ్కో (ఉక్రెయిన్), ఒలింపిక్ మాజీ చాంపియన్ ఆండ్రీ వార్డ్, అన్ వోల్ఫీ, ట్రిమియర్, మార్గరెట్ గుడ్మన్ ఉన్నారు. -
'ఫుట్‌బాల్ టీంను కొందామనుకుంటున్నా'
న్యూయార్క్ : అమెరికా బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయిడ్ మేవెదర్ ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ క్లబ్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.ఇదే విషయమై గతవారం టైన్సైడ్లోని ఓ- 2సిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఫుట్‌బాల్ టీమ్ న్యూ కాజిల్ యునైటెడ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగాన్యూకాజిల్కు ప్రస్తుత యజమానిగా వ్యవహరిస్తున్న మైక్ ఆష్లే నుంచి క్లబ్‌ను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారా.. అని మేవెదర్‌ను విలేకరులు ప్రశ్నించారు. దానికి మేవెదర్ స్పందిస్తూ.. ‘యూఎస్‌లో మేము దీనిని సాకర్ అని పిలుస్తాము. కాని న్యూ కాజిల్ ఫుట్‌బాల్ జట్టుపై ఎలాంటి నమ్మకం లేదు. నేను న్యూ కాజిల్ జట్టును కొనాలని భావిస్తే ముందు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడూ కొత్త వ్యాపార అవకాశాలకు సిద్ధంగా ఉంటాను. నాకు బాక్సింగ్ ఒక్కటే కాకుండా మిగతా ఆటలంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్‌ను కొందామనే ఆలోచన చేశా. సాకర్ నా ఆట కాకపోవచ్చు.. కానీ ప్రతి ఆట గురించి నాకు కొంతమేర అవగాహన ఉంది' అని మేవెదర్ వెల్లడించాడు.(షఫాలీని అలా చూడటం కష్టమైంది) అయితే మేవెదర్, బ్రిటిష్ బిలియనీర్ ఆష్లే మధ్య ఇంకా దీని గురించి ఎటువంటి అధికారిక చర్చలు జరగలేదు. కానీ న్యూకాజిల్‌లో వాటాను కొనుగోలు చేయడానికి ఫ్లాయిడ్ కంపెనీ మనీ టీమ్ ఆసక్తి చూపిస్తోందని టిఎమ్‌జెడ్ స్పోర్ట్స్ ఇటీవలే నివేదించింది. కాగా గతేడాదిఫ్లాయిడ్ మేవెదర్ జపాన్‌లో జరిగిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొని 20 ఏళ్ల కిక్-బాక్సర్ టెన్షిన్ నాసుకావాపై సునాయాస విజయం సాధించి ఫ్రొఫెషనల్ బాక్సింగ్‌కు వీడ్కోలు పలికాడు. కేవలం రెండే నిమిషాలు జరిగిన ఆ బౌట్లో నాసుకావాను ఓడించి 9 మిలియన్ డాలర్లను గెలుచుకున్నాడు. కాగా ఫ్లాయిడ్ మేవెదర్ తన ఫ్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో 50 విజయాలతో పాటు 26 ప్రపంచ టైటిళ్లను నెగ్గాడు. కొంతకాలం కిందట ఫ్రొఫెషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మేవెదర్ ప్రస్తుతం అమెరికా బాక్సింగ్ ప్రమోటర్‌గా కొనసాగుతున్నాడు. (మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) -
అజేయుడిగా మేవెదర్ వీడ్కోలు
లాస్ వెగాస్ : ఫ్లాయిడ్ మేవెదర్... ప్రపంచ క్రీడారంగంలో అత్యధికంగా ఆర్జించే క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్న ఈ అమెరికన్ బాక్సర్ తన కెరీర్ చివరి బౌట్‌ను ఎలా ముగిస్తాడనే ఉత్కంఠ వీడింది. అంచనాలకు అనుగుణంగానే ఒక్క ఓటమి కూడా లేకుండా 49-0తో కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. అంతేకాకుండా హెవీవెయిట్ దిగ్గజం రాకీ మార్సియానో (అమెరికా) అత్యధిక విజయాల రికార్డునూ సమం చేశాడు. శనివారం ఎంజీఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనాలో ప్రత్యర్థి ఆండ్రీ బెర్టోతో జరిగిన 12 రౌండ్ల బౌట్లో జడ్జీల ఏకగ్రీవ తీర్మానంతో మేవెదర్ 120-108, 118-110, 117-111 స్కోర్లతో నెగ్గాడు. విజేతగా నిలిచిన మేవెదర్‌కు ఈ ఫైట్ ద్వారా రూ.212 కోట్లు, బెర్టోకు రూ.27 కోట్లు అందాయి. -
విజయంతో బాక్సింగ్ స్టార్ మేవెదర్ గుడ్ బై
-
విజయంతో బాక్సింగ్ స్టార్ మేవెదర్ గుడ్ బై
లాస్‌వెగాస్ : బాక్సింగ్ స్టార్ ఫ్లాయిడ్ మేవెదర్ ప్రపంచ వెల్టర్ వెయిట్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆండ్రీ బెర్టోతో జరిగిన పోరులో మేవెదర్ విజయం సాధించాడు. మేవెదర్ కెరీర్లో ఇది 49-0 రికార్డు విజయం. హెవీ వెయిట్ లెజెండ్ రాకీ మార్కియానో రికార్డును సమం చేశాడు. ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ బౌట్ అనంతరం మేవెదర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు దశాబ్దాల పాటు ఓటమే లేకుండా కెరీర్ కొనసాగించిన మేవెదర్.. ఇక తన కెరీర్ ముగిసిందని అధికారికంగా ప్రకటించాడు. వినోద రంగం లో కూడా అడుగు పెట్టాలని భావిస్తున్న మేవెదర్‌కు ఇప్పటికే మూడు సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే గతంలోనూ 2008లో రిటైర్మెంట్ ప్రకటించినా... మళ్లీ రింగ్‌లోకి వచ్చాడు. మేవెదర్ ఇంకో బౌట్ ఆడి తన స్కోరును 50 చేస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఇదే ‘ఆఖరిసారి’ అంటున్న మేవెదర్!
లాస్‌వెగాస్ : ప్రపంచ వెల్టర్ వెయిట్ టైటిల్ కోసం ఈ శనివారం ఆండ్రీ బెర్టోతో తలపడనున్న బాక్సింగ్ స్టార్ ఫ్లాయిడ్ మేవెదర్ ఇదే తన ఆఖరి బౌట్ అని ప్రకటించాడు. ఆ తర్వాత తాను రిటైర్ అవుతానని అతను వెల్లడించాడు. ఇది గెలిస్తే మేవెదర్ కెరీర్ రికార్డు 49-0 అవుతుంది. ఇకపై నిరూపించుకోవడానికి ఏమీ లేదని, తన వద్ద కావాల్సినంత డబ్బూ ఉంది కాబట్టి మున్ముందు ఆరోగ్యంతో పాటు పిల్లల సంరక్షణపై కూడా దృష్టి పెడతానని అతను చెప్పాడు. వినోద రంగం లో కూడా అడుగు పెట్టాలని భావిస్తున్న మేవెదర్‌కు ఇప్పటికే మూడు సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే గతంలోనూ 2008లో రిటైర్మెంట్ ప్రకటించినా... మళ్లీ రింగ్‌లోకి వచ్చిన మేవెదర్, ఇంకో బౌట్ ఆడి తన స్కోరును 50 చేస్తాడని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. -
మేవెదర్ టైటిల్ వెనక్కి
వాషింగ్టన్: మ్యానీ పకియావోతో జరిగిన ‘శతాబ్దపు పోరు’లో దక్కించుకున్న వెల్టర్‌వెయిట్ ప్రపంచ టైటిల్‌ను ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ కోల్పోవాల్సి వచ్చింది. గత మేలో విజేతగా నిలిచిన మేవెదర్‌కు ఈ ఫైట్ ద్వారా రూ.1,040 కోట్లు దక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ బౌట్ ద్వారా బెల్ట్‌ను గెల్చుకున్నందుకు తను మంజూరు రుసుము కింద రెండు లక్షల డాలర్ల (రూ.కోటీ 27 లక్షలు)ను ప్రపంచ బాక్సింగ్ సంస్థ (డబ్ల్యుబీవో)కు చెల్లించాల్సి ఉంది. గత శుక్రవారమే ఈ గడువు ముగియడంతో వెల్టర్‌వెయిట్ బెల్ట్‌ను వెనక్కి తీసుకోవాలని డబ్ల్యుబీవో నిర్ణయించింది. డబ్ల్యుబీవో నిబంధనల ప్రకారం బాక్సర్లు తాము గెలుచుకున్న మొత్తం నుంచి 3 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డబ్ల్యుబీవో చాంపియన్లు ఇతర వెయిట్ విభాగాల టైటిళ్లను తమ దగ్గర ఉంచుకోవడం నిషేధం. మేవెదర్ ప్రస్తుతం జూనియర్ మిడిల్వెయిట్లో డబ్ల్యుబీసీ, డబ్ల్యుబీఏ చాంపియన్ కూడా. -
ధోని సంపాదన ఎంతో తెలుసా!
‘ఫోర్బ్స్’ ధనిక అథ్లెట్ల జాబితాలో 23వ స్థానం న్యూయార్క్ : ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన అథ్లెట్ల జాబితాలో భారత క్రికెటర్ ఎం.ఎస్.ధోని మరోసారి స్థానం దక్కించుకున్నాడు. ఏడాదికి 31 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 198 కోట్లు) సంపాదనతో 23వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఒక స్థానం కిందకు దిగాడు. ఎం.ఎస్.కు ఆట ద్వారా 4 మిలియన్ డాలర్లు, వాణిజ్య ప్రకటనల ద్వారా 27 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. ప్రముఖ ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్ 100 మందితో కూడిన ఈ జాబితాను ప్రకటించింది. అయితే భారత్ నుంచి ఒక్క మహీ మినహా మిగతా వారెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. అమెరికా బాక్సింగ్ స్టార్ ఫ్లాయిడ్ మెవెదర్ 300 మిలియన్ డాలర్ల (రూ. 1900 కోట్లు)తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి మెవెదర్ సంపాదన రెట్టింపు అయ్యింది.ఫిలిప్పిన్స్ బాక్సర్ మ్యానీ పాకియావో 160 మిలియన్ డాలర్లు (రూ. 1022 కోట్లు), రొనాల్డో 79.6 మిలియన్ డాలర్లు (రూ. 500 కోట్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
సూపర్... మేవెదర్
అద్భుతమేమీ జరగలేదు. అనుభవమే గెలిచింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ ‘మెగా ఫైట్’లో పైచేయి సాధించాడు. ఫిలిప్పీన్స్ మేటి బాక్సర్ మ్యానీ పాకియోపై హోరాహోరీ పోరులో నెగ్గిన మేవెదర్ కెరీర్లో వరుసగా 48వ విజయంతో తన అజేయ రికార్డును కొనసాగించాడు. బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌట్‌గా నిలిచిన ఈ పోటీలో గెలవడం ద్వారా మేవెదర్ 18 కోట్ల డాలర్లు (రూ. 1147 కోట్లు), పాకియో 12 కోట్ల డాలర్లు (రూ. 764 కోట్లు) తమ ఖాతాలో వేసుకున్నారు. ‘మెగా ఫైట్’లో అమెరికా బాక్సర్దే గెలుపు ► కెరీర్లో వరుసగా 48వ విజయం ► పోరాడి ఓడిన పాకియో లాస్‌వేగాస్ : ఇద్దరు బాక్సింగ్ దిగ్గజాల మధ్య జరిగిన పసందైన పోరులో అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఫిలిప్పీన్స్ మేటి బాక్సర్ మ్యానీ పాకియోతో ఆదివారం జరిగిన వెల్టర్ వెయిట్ కేటగిరీ బౌట్లో మేవెదర్ పాయింట్ల పద్ధతిలో విజయాన్ని సాధించాడు. నిర్ణీత 12 రౌండ్ల అనంతరం బౌట్‌ను పర్యవేక్షించిన ముగ్గురు జడ్జిలు మేవెదర్కే (118-110, 116-112, 116-112 పాయింట్లు) అనుకూలంగా ఫలితాన్ని ప్రకటించారు. ఈ గెలుపుతో 38 ఏళ్ల మేవెదర్ తన విజయాల రికార్డును 48-0తో మెరుగుపర్చుకున్నాడు. మరోవైపు 36 ఏళ్ల పాకియో కెరీర్లో ఆరో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. బౌట్ మొత్తంలో మేవెదర్ 435 పంచ్‌లు విసరగా అందులో 148 పంచ్‌లు ప్రత్యర్థికి తగిలాయి. మరోవైపు పాకియో 429 పంచ్‌లు విసరగా అందులో 81 పంచ్‌లు మేవెదర్‌కు తగిలాయి. వీటి ఆధారంగానే మేవెదర్ విజయం ఖాయమైంది. శతాబ్దపు పోరు’ గా ప్రచారం కల్పించిన ఈ బౌట్లో పాకియో నుంచి మేవెదర్‌కు ఆద్యంతం గట్టిపోటీనే ఎదురైంది. ఎడంచేతి వాటం బాక్సరైన పాకియో ఆరంభ రౌండ్లలో దూకుడుగా వ్యవహరించాడు. పలుమార్లు మేవెదర్పై వరుస పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. కొన్నిసార్లయితే మేవెదర్ వీటి నుంచి తప్పించుకోవడానికి రింగ్‌లో ఓ మూలకు వెళ్లిపోయాడు. అయితే మేవెదర్ మాత్రం ఆచితూచిగా కదులుతూ అవకాశం దొరికినపుడల్లా పంచ్‌లు సంధించాడు. మొత్తానికి బౌట్ చూసిన వారికి పాకియో ఆధిపత్యం చలాయించినట్లు కనిపించినా... పరిగణనలోకి తీసుకున్న పంచ్‌ల విషయంలో మా త్రం మేవెదర్ పైచేయి సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ బౌట్‌ను టీవీ ల్లో 40 కోట్ల మంది తిలకిం చారని అంచనా. ఈ ఫైట్‌ను చూసేందుకు చాలా మంది సెలబ్రిటీలు రావడంతో లాస్‌వేగాస్‌లోని విమానాశ్రయం ప్రైవేట్ జెట్ విమానాలతో నిండి పోయింది. ఫిలిప్పీన్స్‌లో పాకియో అభిమానుల కోసం పలు స్టేడియాల్లో, వీధుల్లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. బౌట్ జరుగుతున్నంతసేపు మనీలా వీధులు అభిమానులతో నిండిపోయాయి. పాకియో బాక్సింగ్ శైలి విభిన్నంగా ఉంటుంది. అందుకే కొంత సమయం తీసుకొని అతణ్ని పరిశీలించాను. ఆ తర్వాత దూకుడు పెంచాను. అతని పోరాటపటిమ అమోఘం. పాకియో చాలా పంచ్‌లు విసిరినా అందులో చాలావరకు నాకు తగల్లేదు. సెప్టెంబరులో నా కెరీర్లో చివరి బౌట్లో తలపడతాను. -మేవెదర్ నిజానికి నేనే గెలిచానని అనుకున్నాను. అయితే రింగ్‌లో మేవెదర్ కదులుతున్నపుడు అతనిపై పంచ్‌లు సంధించడం కష్టం. ఒకేచోట ఉన్నపుడు అతనిపై పంచ్‌ల వర్షం కురిపించాను. భుజం నొప్పితోనే ఈ బౌట్ బరిలోకి దిగాను. నొప్పి నివారణకు ఇంజెక్షన్ తీసుకుంటానని కోరినా నిర్వాహకులు అంగీకరించలేదు. -పాకియో -
60 సెకన్లలో హాంఫట్...
న్యూయార్క్ : విఖ్యాత బాక్సింగ్ స్టార్స్ ఫ్లోయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ ప్యాకియో (ఫిలిప్పీన్స్)ల మధ్య మే 2న జరిగే ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. శుక్రవారం టికెట్ల అమ్మకాలు మొదలైన 60 సెకన్లలోపే అన్ని టికెట్లు అయిపోయాయి. వీరిద్దరి బౌట్‌కు వేదికగా నిలువనున్న లాస్‌వేగాస్‌లోని ఎంజీ ఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనా సామర్థ్యం 16 వేలు. కాగా అభిమానులకు 14 వేల టికెట్లు విక్రయించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన 38 ఏళ్ల మేవెదర్ తన కెరీర్లో 47 బౌట్లలోనూ విజేతగా నిలిచాడు. ప్యాకియో 64 బౌట్లలో 57 విజయాలు నమోదు చేసుకున్నాడు.