ఇదే ‘ఆఖరిసారి’ అంటున్న మేవెదర్! | This is the 'last' Mayweather say! | Sakshi
Sakshi News home page

ఇదే ‘ఆఖరిసారి’ అంటున్న మేవెదర్!

Published Thu, Sep 10 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

ఇదే ‘ఆఖరిసారి’ అంటున్న మేవెదర్!

ఇదే ‘ఆఖరిసారి’ అంటున్న మేవెదర్!

లాస్‌వెగాస్ : ప్రపంచ వెల్టర్ వెయిట్ టైటిల్ కోసం ఈ శనివారం ఆండ్రీ బెర్టోతో తలపడనున్న బాక్సింగ్ స్టార్ ఫ్లాయిడ్ మేవెదర్ ఇదే తన ఆఖరి బౌట్ అని ప్రకటించాడు. ఆ తర్వాత తాను రిటైర్ అవుతానని అతను వెల్లడించాడు. ఇది గెలిస్తే మేవెదర్ కెరీర్ రికార్డు 49-0 అవుతుంది. ఇకపై నిరూపించుకోవడానికి ఏమీ లేదని, తన వద్ద కావాల్సినంత డబ్బూ ఉంది కాబట్టి మున్ముందు ఆరోగ్యంతో పాటు పిల్లల సంరక్షణపై కూడా దృష్టి పెడతానని అతను చెప్పాడు.

వినోద రంగం లో కూడా అడుగు పెట్టాలని భావిస్తున్న మేవెదర్‌కు ఇప్పటికే మూడు సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే గతంలోనూ 2008లో రిటైర్మెంట్ ప్రకటించినా... మళ్లీ రింగ్‌లోకి వచ్చిన మేవెదర్, ఇంకో బౌట్ ఆడి తన స్కోరును 50 చేస్తాడని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement