
అజేయుడిగా మేవెదర్ వీడ్కోలు
లాస్ వెగాస్ : ఫ్లాయిడ్ మేవెదర్... ప్రపంచ క్రీడారంగంలో అత్యధికంగా ఆర్జించే క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్న ఈ అమెరికన్ బాక్సర్ తన కెరీర్ చివరి బౌట్‌ను ఎలా ముగిస్తాడనే ఉత్కంఠ వీడింది. అంచనాలకు అనుగుణంగానే ఒక్క ఓటమి కూడా లేకుండా 49-0తో కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. అంతేకాకుండా హెవీవెయిట్ దిగ్గజం రాకీ మార్సియానో (అమెరికా) అత్యధిక విజయాల రికార్డునూ సమం చేశాడు. శనివారం ఎంజీఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనాలో ప్రత్యర్థి ఆండ్రీ బెర్టోతో జరిగిన 12 రౌండ్‌ల బౌట్‌లో జడ్జీల ఏకగ్రీవ తీర్మానంతో మేవెదర్ 120-108, 118-110, 117-111 స్కోర్లతో నెగ్గాడు. విజేతగా నిలిచిన మేవెదర్‌కు ఈ ఫైట్ ద్వారా రూ.212 కోట్లు, బెర్టోకు రూ.27 కోట్లు అందాయి.