మేవెదర్ టైటిల్ వెనక్కి
వాషింగ్టన్: మ్యానీ పకియావోతో జరిగిన ‘శతాబ్దపు పోరు’లో దక్కించుకున్న వెల్టర్‌వెయిట్ ప్రపంచ టైటిల్‌ను ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ కోల్పోవాల్సి వచ్చింది. గత మేలో విజేతగా నిలిచిన మేవెదర్‌కు ఈ ఫైట్ ద్వారా రూ.1,040 కోట్లు దక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ బౌట్ ద్వారా బెల్ట్‌ను గెల్చుకున్నందుకు తను మంజూరు రుసుము కింద రెండు లక్షల డాలర్ల (రూ.కోటీ 27 లక్షలు)ను ప్రపంచ బాక్సింగ్ సంస్థ (డబ్ల్యుబీవో)కు చెల్లించాల్సి ఉంది.
గత శుక్రవారమే ఈ గడువు ముగియడంతో వెల్టర్‌వెయిట్ బెల్ట్‌ను వెనక్కి తీసుకోవాలని డబ్ల్యుబీవో నిర్ణయించింది. డబ్ల్యుబీవో నిబంధనల ప్రకారం బాక్సర్లు తాము గెలుచుకున్న మొత్తం నుంచి 3 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డబ్ల్యుబీవో చాంపియన్లు ఇతర వెయిట్ విభాగాల టైటిళ్లను తమ దగ్గర ఉంచుకోవడం నిషేధం. మేవెదర్ ప్రస్తుతం జూనియర్ మిడిల్‌వెయిట్‌లో డబ్ల్యుబీసీ, డబ్ల్యుబీఏ చాంపియన్ కూడా.