కామన్‌వెల్త్ గేమ్స్-2022లో భారత అథ్లెట్‌లు పతకాలు మోత మోగిస్తున్నారు. తాజాగా 10వ రోజు భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు వచ్చి చేరాయి. మహిళల 48 కేజీల విభాగంలో భారత బాక్సర్ నీతు ఘంగాస్ గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ల్లో ఇంగ్లండ్‌కు చెందిన డెమీ-జేడ్‌పై 5-0తేడాతో నీతు విజయం సాధించింది.
తన పాల్గొంటున్న తొలి కామన్‌వెల్త్ గేమ్స్‌లోనే నీతు పతకం సాధించడం గమనార్హం. కాగా కామన్‌వెల్త్ గేమ్స్-2022లో బాక్సింగ్‌లో భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం. మరోవైపు పురుషుల 51 కేజీల విభాగంలో బాక్సర్ అమిత్ పంఘల్ కూడా గోల్డ్‌మెడల్ సాధించాడు.
ఫైనల్లో ఇంగ్లండ్ బాక్సర్ కియారన్ మక్‌డొనాల్డ్‌ను 0-5 ఓడించి పంఘల్ పతకం కైవసం చేసుకున్నాడు. అదే విధంగా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఓవరాల్‌గా ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 42 పతకాలు చేరాయి.
చదవండి: CWG 2022- PV Sindhu: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
Comments
Please login to add a commentAdd a comment